Taipei Open 2022: Parupalli Kashyap Advances To Quarter Finals, Details Inside - Sakshi
Sakshi News home page

Taipei Open 2022: 51 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌.. క్వార్టర్‌కు కశ్యప్‌

Published Thu, Jul 21 2022 6:32 PM | Last Updated on Thu, Jul 21 2022 7:15 PM

Taipei Open 2022: Parupalli Kashyap Advance To Quarters - Sakshi

తైవాన్ వేదికగా జరుగుతున్న తైపీ ఓపెన్‌లో పారుపల్లి కశ్యప్‌ క్వార్టర్స్‌ చేరాడు. పురుషుల సింగిల్స్ లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ లో తైవాన్ కు చెందిన లి చియా హోతో తలపడిన కశ్యప్.. అతడిని ఓడించి క్వార్టర్స్ కు దూసుకెళ్లాడు.  రెండో రౌండ్ లో కశ్యప్.. 21-10, 21-19 తేడాతో లి చియా ను ఓడించాడు. 51 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్ లో ఆది నుంచి ఆధిపత్యం చెలాయించిన కశ్యప్.. క్వార్టర్స్ కు చేరాడు.  

కశ్యప్‌ మినహా మిగతా భారత బృందం రెండో రౌండ్ లో తడబడింది. మిథున్ మంజునాథన్, ప్రియాన్షు రజవత్, కిరణ్ జార్జ్ లు రెండో రౌండ్‌ గండాన్ని దాటలేకపోయారు.  ఇక మహిళల సింగిల్స్ లో ఏకైక ఆశాకిరణం సమియా ఫరూఖీ కూడా ఓడింది. మహిళల సింగిల్స్ లో రెండో రౌండ్ కు చేరిన భారత ఏకైక క్రీడాకారిణి సమియా ఫరూఖీ.. తైవాన్ కే చెందిన వెన్ చి చేతిలో 18-21, 13-21 తో ఓటమిపాలైంది. మెన్స్ డబుల్స్ లో రెండో రౌండ్ కు చేరిన భట్నాగర్-ప్రతీక్ జోడీ తైవాన్ కే చెందిన యాంగ్-చి లిన్  చేతిలో ఓడింది. మిక్సడ్‌ డబుల్స్ లో భట్నాగర్-తనీషా క్రాస్టోల జోడీ రెండో రౌండ్ లో 21-14, 21-17 తేడాతో కై వెన్-యు కియా జోడీని మట్టికరిపించి క్వార్టర్స్ కు దూసుకెళ్లింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement