
తైపీ: భారత సీనియర్ షట్లర్ పారుపల్లి కశ్యప్ తైపీ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు. డబుల్స్‌లో తనీషా క్రాస్టో రెండు విభాగాల్లో క్వార్టర్స్ చేరింది. మహిళల, మిక్స్‌డ్ డబుల్స్‌లో దూసుకెళుతోంది.
గురువారం జరిగిన రెండో రౌండ్లో మూడో సీడ్ కశ్యప్ 21–10, 21–19తో చియ హో లీ (తైపీ)పై గెలుపొందగా, మిథున్ 24–22, 5–21, 17–21తో నాలుగో సీడ్ నరవొక (జపాన్) చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్‌లో సామియా ఫారుఖీ 18–21, 13–21తో వెచ్ చి హూ (తైపీ) చేతిలో ఓడింది.
మహిళల డబుల్స్‌లో తనీషా–సృష్టి జోడీ 21–14, 21–8తో జియా యిన్–లిన్ యూ (తైపీ)పై గెలిచింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో తనీషా–ఇషాన్ ద్వయం 21–14, 21–17తో చెంగ్ కై వెన్– వాంగ్ యూ (తైపీ)పై నెగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment