Taipei
-
పార్లమెంట్లో డిష్యుం.. డిష్యుం
చట్ట సభల్లో సభ్యుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడం సర్వసాధారణమే. ఒక్కోసారి అవి శ్రుతి మంచి దాడులకు దారి తీసిన దాఖలాలు లేకపోలేదు. అయితే తైవాన్‌లో ఆ పరిస్థితి ముష్టి యుద్ధానికి దారి తీసింది. పార్లమెంట్‌లోనే చట్ట సభ్యులు తన్నుకున్న వీడియోలు ఎక్స్‌లో వైరల్ అవుతోంది. నూతన సంస్కరణలపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.పార్లమెంట్లో తప్పుడు ప్రకటనలు చేసే వాళ్లకు కఠిన శిక్ష పడేలా చేసిన తైవాన్ పార్లమెంట్ చట్టం చేయాలనుకుంది. ఇందుకుగానూ చట్ట సభ్యులకు అధిక అధికారం కట్టబెట్టే చట్ట ప్రాతిపాదనలపై శుక్రవారం చర్చ జరిగింది. ఆ సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం డిష్యుం.. డిష్యుంకి దారి తీసింది. ఎంపీలు ఒకరినొకరు నెట్టేసుకుంటూ.. ఇష్టానుసారం తన్నుకున్నారు. รัฐสภาไต้หวันวุ่น นักการเมืองทะเลาะกันนัว หลังไม่มีพรรคใดครองเสียงข้างมากกระทบการลงมติ #ทันโลกกับไทยพีบีเอส #ThaiPBS #ไต้หวัน #taiwan pic.twitter.com/M2Fkmf5f5T— ทันโลกกับThaiPBS (@TanlokeThaiPBS) May 18, 2024 మహిళా ప్రతినిధులు సైతం తమ వంతుగా ఈ గొడవలో భాగం అయ్యారు. జుట్టు జుట్టు పట్టుకుని ఒకరినొకరు నెట్టేసుకుంటూ.. కిందపడి పడి గుద్దులు గుద్దుకున్నారు. ఆ ఘర్షణల్లో ఓ ఎంపీ అక్కడి బిల్లు సంబంధిత ఫైల్స్‌ను తీసుకుని బయటకు పరిగెత్తడం బాగా వైరల్ అయ్యింది. 🚨🇹🇼#BREAKING: A member of Taiwan's parliament stole a bill and ran off with it to prevent it from being passed.LMFAOOOOOO 😭😭😭pic.twitter.com/CxcmWCusAI— Censored Men (@CensoredMen) May 17, 2024డెమొక్రటిక్ ప్రొగెసివ్ పార్టీ, కువోమింటాంగ్ పార్టీ ఎంపీల మధ్య చర్చ సమయంలో జరిగిన వాగ్వాదమే ఈ ఘర్షణలకు కారణమైంది. మరికొందరు స్పీకర్ కుర్చీ చుట్టు చేరడం, టేబుళ్ల మీద నుంచి దూకడం ఆ వీడియోలలో చూడొచ్చు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఈ గలాట.. మధ్యాహ్నం దాకా కొనసాగింది. తైవాన్ పార్లమెంట్లో 113 సీట్లు ఉన్నాయి. తైవాన్ నూతన అధ్యక్షుడు లై చింగ్ టె సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకు ముందే పార్లమెంట్ రణరంగంగా మారడం గమనార్హం. విశేషం ఏంటంటే.. చట్ట సభలో మెజారిటీ లేకున్నా చింగ్ టె అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతుండడం.డీపీపీ కంటే కేఎంటీకి సీట్లు అధికంగా వచ్చాయి. కానీ, ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన బలం లేదు. దీంతో.. టీపీపీ మద్దతు తీసుకోవాలని కేఎంటీ భావిస్తోంది. -
దూకుడు పెంచిన చైనా.. తైవాన్‌కు యుద్ధ విమానాలు
తైపే: ద్వీపదేశమైన తైవాన్‌పై చైనా మరోసారి దూకుడు ప్రదర్శించింది. తైవాన్ చుట్టూ చైనాకు చెందిన 20 యుద్ధ విమానాలు స్వైరవిహారం చేశాయి. ఎదో కుట్రపూరిత ఆలోచనతోనే అవి తైవాన్ జలసంధిలోని మధ్యస్థ రేఖను దాటినట్లు తైపీ అధికారులు తెలిపారు. కుట్రపూరితమైన ఆలోచనలతోనే.. స్వీయ పాలిత దేశం తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం చైనాకు తమదేశానికి మధ్యలో ఉండే జలసంధిలో చానాకు చెందిన సుమారు 20 యుద్ధ విమానాలు రెండు దేశాలను వేరుచేసే మధ్యస్థ రేఖను దాటి దేశ ఆగ్నేయ నైరుతి వాయు రక్షణ జోన్లోకి ప్రవేశించాయన్నారు. చైనా దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగానే ఇటువంటి ట్రైనింగ్ మిషన్లను నిర్వహిస్తోందని దానికోసమే పెట్రోలింగ్ విమానాలతోనూ నౌకలతో ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. వారి జోక్యాన్ని సహించలేక.. ఈ రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతోనే బీజింగ్ డెమోక్రటిక్ తైవాన్ను తన స్వంత భూభాగంగా ప్రకటించుకుంటోందని వారు దీన్ని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు కూడా సాహసిస్తుందని అందులో భాగంగానే సైనికపరమైన, దౌత్యపరమైన ఒత్తిడిని పెంచిందన్నారు. ఇదే నెలలో అమెరికా, కెనడాకు చెందిన రెండు నౌకలు ఈ నెలలో తైవాన్ జలసంధి వద్ద విహరిస్తూ ద్వీపదేశానికి అండగా నిలిచే ప్రయత్నం చేయడంతో చైనా దళాలు అప్రమత్తమయ్యాయని తైపే రక్షణశాఖ తెలిపింది. ఇదేమీ కొత్త కాదు.. ఈ వారంలోనే ద్వీపం చుట్టూ విహరిస్తున్న 68 విమానాలను 10 యుద్ధ నౌకలను గుర్తించినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాటిలో కొన్ని విమానాలు మరియు యుద్ధనౌకలు చైనా షాన్డాంగ్ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ ద్వారా కొన్ని యుద్ధ విమానాలు యుద్ధ నౌకలు సముద్రంలోనూ గాలిలోనూ శిక్షణ పశ్చిమ పసిఫిక్ వైపుగా వెళ్లాయని తెలిపింది తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ. అయితే చైనా ఇంత వరకు ఈ చొరబాటు గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏప్రిల్ నెలలో బీజింగ్ ఇటువంటి మిలటరీ విన్యాసాలే చేయగా తైవాన్ అధ్యక్షుడు సై ఇంగ్ వెన్ విషయాన్ని కాలిఫోర్నియా వెళ్లి యూఎస్ హౌస్ సభాపతి కెవిన్ మెక్ కార్తీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో తైవాన్ కేవలం 24 గంటల్లో ఏకంగా 71 చైనాకు చెందిన యుద్ధ నౌకలను గుర్తించింది. #China is moving military equipment to ports near Taiwan, raising fears of an invasion. #Taiwan says it has detected 57 Chinese warplanes and 10 warships in the past 24 hours. Is this a drill or a threat? pic.twitter.com/2O7eFroJ2d — News Hrs (@newshrstweet) September 14, 2023 ఇది కూడా చదవండి: బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం.. 14 మంది మృతి -
శాంతి ఆకాశం నుంచి ఊడిపడదు: తైవాన్
తైపీ: చైనా నుంచి యుద్ధం, ఆక్రమణల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. తైవాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఏడాది మిలిటరీ సర్వీస్‌ను తప్పనిసరి చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. చైనా నుంచి ఏనాటికైనా ఆక్రమణ తప్పదనే భయాందోళనలో ఉండింది ఈ చిన్న ద్వీప దేశం. ఈ నేపథ్యంలో అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ స్వయంగా ఈ ప్రకటన చేయడం విశేషం. తైవాన్‌పై చైనా బెదిరింపులు తీవ్రంగా కనిపిస్తున్నాయి. యుద్ధం కావాలని ఎవరూ కోరుకోరు. కానీ, నా తోటి పౌరులారా.. శాంతి ఆకాశం నుంచి ఊడిపడదని గుర్తించాలి అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దులో త్వరగతిన మారుతున్న పరిస్థితుల ఆధారంగా.. నాలుగు నెలల మిలిటరీ సర్వీస్ సరిపోదు. అందుకే దానిని ఏడాదికి పొడిగించాలని నిర్ణయించాం. 2024 నుంచి ఏడాది మిలిటరీ సర్వీస్ తప్పనిసరి కానుంది. 2005 జనవరి 1వ తేదీ తర్వాత జన్మించిన వాళ్లందరికీ.. కొత్త కొనసాగింపు వర్తిస్తుందని సాయ్ ఇంగ్ వెన్ ప్రకటించారు. రెండు రోజుల కిందట.. తైవాన్ సమీపంలో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించింది. వాష్టింగ్టన్, తైపీలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాయని.. సైనిక విన్యాసాలను చైనా సమర్థించుకుంది కూడా. తైవాన్‌లో ఒకప్పుడ ఏడాది మిలిటరీ సర్వీస్ నిబంధన ఉండేది. కానీ, తర్వాతి కాలంలో దానిని నాలుగు నెలల కాలపరిమితికి కుదించారు. అయితే, సరిహద్దులో సైనిక చర్యల ద్వారా చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యం.. డ్రాగన్ కంట్రీ నుంచి ఏనాటికైనా యుద్ధం తప్పదనే భావనలోకి చేరుకుంది తైవాన్. తమను తాము స్వపరిపాలన.. ప్రజాస్వామ్యిక దేశంగా తైవాన్ ప్రకటించుకుంది. కానీ, తైవాన్ తమ భూభాగానికే చెందుతుందని డ్రాగన్ కంట్రీ ప్రకటించుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో తైవాన్‌కు అండగా అమెరికా ప్రకటనలు ఇవ్వడం, అక్కడి ప్రతినిధులు తైవాన్ గడ్డపై పర్యటించడం చైనాకు కోపం తెప్పిస్తోంది. ఈ పరిస్థితులకు తోడు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ మధ్య కాలంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. తైవాన్ సరిహద్దులో వరుసపెట్టి మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహిస్తుండడంతో.. తరచుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా తరహాలో చైనా కూడా తమ భూభాగంపై దురాక్రమణకు పాల్పడవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తోంది తైవాన్. -
తైవాన్‌లో అడుగుపెట్టిన నాన్సీ పెలోసీ.. చైనాను రెచ్చగొట్టేలా ట్వీట్లు
తైపీ/బీజింగ్: తీవ్ర ఉద్రిక్తతల నడుమ తైవాన్‌లో అడుగుపెట్టారు అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ. తైపీ ఎయిర్‌పోర్ట్‌లో భారత కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి దిగిన ఆమెకు సాదర స్వాగతలం లభించింది. అయితే దిగీదిగంగానే ఆమె చేసిన ట్వీట్లు.. చైనాను రెచ్చగొట్టేలా ఉన్నాయి. అమెరికా ముందు నుంచి చెప్తున్నట్లు తైవాన్ ప్రజాస్వామ్యానికి మద్దతుగా, అలాగే ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛకు మేం కట్టుబడి ఉంటామని ఆమె ట్వీట్లు చేశారు. మరోవైపు నాన్సీ పెలోసీ ల్యాండ్ అయిన విషయం తెలుసుకున్న చైనా.. జరగబోయే పరిణామాలన్నింటికి అమెరికానే కారణమంటూ ప్రకటించింది. Our delegation’s visit to Taiwan honors America’s unwavering commitment to supporting Taiwan’s vibrant Democracy. Our discussions with Taiwan leadership reaffirm our support for our partner & promote our shared interests, including advancing a free & open Indo-Pacific region. — Nancy Pelosi (@SpeakerPelosi) August 2, 2022 ఇప్పటికే చైనా-తైవాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే ఉంటుంది. చైనా తీవ్ర అభ్యంతరాలు, హెచ్చరికల నడుమే తైవాన్‌లో అడుగుపెట్టారు యూఎస్ హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ. మొదటి నుంచి ఆమె పర్యటనను వ్యతిరేకిస్తున్న చైనా.. తాజాగా తైవాన్ భూ భాగంలోకి ఫైటర్ జెట్స్‌ను ప్రయోగించింది. అంతేకాదు తైవాన్ ప్రభుత్వ వెబ్సైట్లను సైతం హ్యాక్ చేసింది. ట్రెండింగ్‌లో వరల్డ్‌వార్ త్రీ తైవాన్-చైనా ఉద్రిక్తతల నడుమ యుద్ధ వాతావరణం నెలకొనడంతో మూడో ప్రపంచ యుద్ధం అంటూ ట్విటర్ ట్రెండ్ నడుస్తోంది. స్వీయ పరిపాలన ఉన్న తైవాన్ను తమ సొంతంగా ప్రకటించుకుంది చైనా. అలాగే.. పెలోసీ పర్యటన తమ(చైనా) తైవాన్ పర్యటన.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని, చైనా ఆర్మీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించింది. తైవాన్ పర్యటన తర్వాత.. సింగపూర్, మలేషియా, జపాన్, సౌత్ కొరియాలోనూ ఆమె పర్యటించనున్నారు. -
Taipei Open: పోరాడి ఓడిన పారుపల్లి కశ్యప్
తైపీ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 40వ ర్యాంకర్ కశ్యప్ 12–21, 21–12, 17–21తో 59వ ర్యాంకర్ సూంగ్ జూ వెన్ (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. కశ్యప్‌నకు 3 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 39 వేలు), 3,850 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో తనీషా–ఇషాన్ (భారత్) జంట 19–21, 12–21తో హూ పాంగ్ రోన్–తో ఈ వె (మలేసియా) జోడీ చేతిలో ఓడింది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో తనీషా–శ్రుతి (భారత్) ద్వయం 16–21, 22–20, 18–21తో ఎన్జీ సాజ్ యా– సాంగ్ హి యాన్ (హాంకాంగ్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
Taipei Open 2022: క్వార్టర్స్‌లో కశ్యప్
తైపీ: భారత సీనియర్ షట్లర్ పారుపల్లి కశ్యప్ తైపీ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు. డబుల్స్‌లో తనీషా క్రాస్టో రెండు విభాగాల్లో క్వార్టర్స్ చేరింది. మహిళల, మిక్స్డ్ డబుల్స్‌లో దూసుకెళుతోంది. గురువారం జరిగిన రెండో రౌండ్లో మూడో సీడ్ కశ్యప్ 21–10, 21–19తో చియ హో లీ (తైపీ)పై గెలుపొందగా, మిథున్ 24–22, 5–21, 17–21తో నాలుగో సీడ్ నరవొక (జపాన్) చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్‌లో సామియా ఫారుఖీ 18–21, 13–21తో వెచ్ చి హూ (తైపీ) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌లో తనీషా–సృష్టి జోడీ 21–14, 21–8తో జియా యిన్–లిన్ యూ (తైపీ)పై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా–ఇషాన్ ద్వయం 21–14, 21–17తో చెంగ్ కై వెన్– వాంగ్ యూ (తైపీ)పై నెగ్గింది. -
51 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్.. క్వార్టర్‌కు కశ్యప్
తైవాన్ వేదికగా జరుగుతున్న తైపీ ఓపెన్‌లో పారుపల్లి కశ్యప్ క్వార్టర్స్ చేరాడు. పురుషుల సింగిల్స్ లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ లో తైవాన్ కు చెందిన లి చియా హోతో తలపడిన కశ్యప్.. అతడిని ఓడించి క్వార్టర్స్ కు దూసుకెళ్లాడు. రెండో రౌండ్ లో కశ్యప్.. 21-10, 21-19 తేడాతో లి చియా ను ఓడించాడు. 51 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్ లో ఆది నుంచి ఆధిపత్యం చెలాయించిన కశ్యప్.. క్వార్టర్స్ కు చేరాడు. కశ్యప్ మినహా మిగతా భారత బృందం రెండో రౌండ్ లో తడబడింది. మిథున్ మంజునాథన్, ప్రియాన్షు రజవత్, కిరణ్ జార్జ్ లు రెండో రౌండ్ గండాన్ని దాటలేకపోయారు. ఇక మహిళల సింగిల్స్ లో ఏకైక ఆశాకిరణం సమియా ఫరూఖీ కూడా ఓడింది. మహిళల సింగిల్స్ లో రెండో రౌండ్ కు చేరిన భారత ఏకైక క్రీడాకారిణి సమియా ఫరూఖీ.. తైవాన్ కే చెందిన వెన్ చి చేతిలో 18-21, 13-21 తో ఓటమిపాలైంది. మెన్స్ డబుల్స్ లో రెండో రౌండ్ కు చేరిన భట్నాగర్-ప్రతీక్ జోడీ తైవాన్ కే చెందిన యాంగ్-చి లిన్ చేతిలో ఓడింది. మిక్సడ్ డబుల్స్ లో భట్నాగర్-తనీషా క్రాస్టోల జోడీ రెండో రౌండ్ లో 21-14, 21-17 తేడాతో కై వెన్-యు కియా జోడీని మట్టికరిపించి క్వార్టర్స్ కు దూసుకెళ్లింది. -
కశ్యప్, మిథున్ ముందంజ.. మాళవికకు తొలి రౌండ్లోనే చుక్కెదురు
తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్, మిథున్ మంజునాధ్ తొలి రౌండ్లో సునాయాస విజయాలు సాధించగా.. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్‌కు చుక్కెదురైంది. హైదరాబాద్ కుర్రాడు పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్లో స్థానిక ఆటగాడు చి యు జెన్‌పై 24-22, 21-10 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించగా.. మిథున్ మంజునాథ్ 21-17, 21-15 తేడాతో కిమ్ బ్రున్ (డెన్మార్క్)పై గెలుపొందాడు. వీరితో పాటు కిరణ్ జార్జ్, ప్రియాన్షు రజత్‌లు కూడా తొలి రౌండ్లో ప్రత్యర్ధులపై గెలుపొంది రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ 21-10, 15-21, 14-21 తేడాతో తైపీ షట్లర్ లియాంగ్ టింగ్ యు చేతిలో ఖంగుతినగా.. కిసోనా సెల్వదురై సమియా ఫరూఖీ చేతిలో ఓటమిపాలైంది. డబుల్స్, మిక్సడ్ డబుల్స్ విభాగాల్లో భారత షట్లర్ల ముందుంజ.. పురుషుల డబుల్స్ విభాగంలో భారత జోడీలు అర్జున్-కపిల, ఇషాన్ బట్నాగర్-కృష్ణప్రసాద్‌లు తొలి రౌండ్లో ప్రత్యర్ధులపై విజయాలు నమోదు చేయగా.. రవికృష్ణ-ఉదయ్ కుమార్, గర్గా-పంజలా జోడీలు తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాయి. మిక్సడ్ డబుల్స్‌లో భారత స్టార్ జోడీ ఇషాన్ బట్నాగర్-తానిషా క్రాస్టో .. స్వెత్లాన జిల్బర్మెన్-మిషా జిల్మర్మన్ జంటను ఓడించి ప్రీ క్వార్టర్స్ కు చేరుకుంది. చదవండి: కామన్ వెల్త్ గేమ్స్‌కు ముందు భారత్‌కు భారీ షాక్..! -
మరో నాలుగు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలు రద్దు
టోక్యో: కరోనా ఖాతాలో మరో నాలుగు టోర్నీలు చేరాయి. సెప్టెంబర్‌లో జరగాల్సిన పోటీలను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బుధవారం తాజాగా ప్రకటించింది. కరోనా నేపథ్యంలో తైపీ ఓపెన్ (సెప్టెంబర్ 1–6), కొరియా ఓపెన్ (8–13), చైనా ఓపెన్ (15–20), జపాన్ ఓపెన్ (22–27)లను నిర్వహించబోమని సమాఖ్య వెల్లడించింది. ఇది కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ అందరి ఆరోగ్యభద్రత దృష్ట్యా టోర్నీల రద్దుకే మొగ్గుచూపామని బీడబ్ల్యూఎఫ్ కార్యదర్శి థామస్ లుండ్ పేర్కొన్నారు. ఈ మహమ్మారి కారణంగానే ఇటీవల చైనాలో జరగాల్సిన 11 టెన్నిస్ టోర్నీలు రద్దు కాగా... మంగళవారం ప్రారంభం కావాల్సిన డబ్ల్యూటీఏ పాన్ పసిఫిక్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ తొలిసారిగా రద్దయింది. -
‘ప్రేమే గెలిచిందని ఈరోజు నిరూపించాము’
తైపీ : స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేస్తూ తైవాన్ ప్రభుత్వం కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. తద్వారా గే వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా నిలిచింది. పార్లమెంటు బయట వేలాది మంది హర్ష ధ్వానాలు వినిపిస్తుండగా..శుక్రవారం ఇందుకు సంబంధించిన బిల్లును ఆమోదించింది. దీంతో సామాన్య వివాహ చట్టంలో ఉండే అన్ని నిబంధనలు స్కలింగ సంపర్కులకు కూడా వర్తించనున్నాయి. డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(డీపీపీ) ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం మే 24 నుంచి అమల్లోకి రానుంది. కాగా స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధం చేసి చరిత్ర సృష్టించామని తైవాన్ అధ్యక్షురాలు సా యింగ్-వెన్ ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు... ‘ శుభోదయం తైవాన్. ఈరోజు కొత్త చరిత్ర సృష్టించేందుకు మాకు అవకాశం దక్కింది. అదే విధంగా తూర్పు ఆసియా నుంచే ఆధునిక భావజాలం విలువలకు సంబంధించిన మూలాలు రూపుదిద్దుకుంటాయనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాం. అంతేకాదు ప్రేమే గెలిచిందని కూడా ప్రపంచానికి చూపించాం. సమానత్వ భావాన్ని పెంపొందించేందుకు, తైవాన్ను మెరుగైన దేశంగా నిలిపేందుకు నేడు ముందడుగు వేశాం’ అని ట్వీట్ చేశారు. ఇక డీపీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం పట్ల ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం గే వివాహాల చట్టబద్ధతపై నిర్వహించిన రెఫరెండంలో భాగంగా.. అత్యధిక మంది దీనిని వ్యతిరేకించారని గుర్తు చేశాయి. వివాహం అనేది ఆడ, మగ మధ్య మాత్రమే జరగాలనే మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని సా యింగ్-వెన్ అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఈ చట్టం వల్ల తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసినా, గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఆమె ఈ చట్టం తీసుకువచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆమె గెలుపుపై నీలినీడలు కమ్ముకమ్ముకున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. Good morning #Taiwan. Today, we have a chance to make history & show the world that progressive values can take root in an East Asian society. Today, we can show the world that #LoveWins. pic.twitter.com/PCPZCTi87M — 蔡英文 Tsai Ing-wen (@iingwen) May 17, 2019 -
భారత్‌కు మరో 3 పతకాలు
న్యూఢిల్లీ: ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. తైపీలోని తావోయువాన్లో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం భారత్ ఖాతాలో 3 పతకాలు చేరాయి. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు ఉన్నాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్సడ్ టీమ్ (జూనియర్) విభాగంలో భారత షూటర్లే స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. ఇందులో శ్రేయ అగర్వాల్ – యశ్వర్ధన్ జోడి మొదటి స్థానంలో నిలవగా (497.3 పాయింట్లు)... మేహులి ఘోష్ – కేవల్ ప్రజాపతికి రెండో స్థానం (496.9 పాయింట్లు) దక్కింది. ఈ ఈవెంట్లో కొరియా కాంస్య పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ (సీనియర్) విభాగంలో భారత్‌కు వెండి పతకం దక్కింది. ఎలవెనీల్ వలరివన్ – రవి కుమార్ ద్వయం రెండో స్థానంలో (498.4 పాయింట్లు) నిలిచి రజతాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ పోరులో కొరియా (499.6)కు స్వర్ణం దక్కగా, తైపీ కాంస్యం గెలుచుకుంది. మరో భారత జోడి దీపక్ కుమార్ – అపూర్వి చండీలా నాలుగో స్థానంలో నిలిచింది. పోటీల్లో రెండో రోజు ముగిసే సరికి మొత్తం ఐదు పతకాలు సాధించిన భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
మహిళా ట్రెక్కర్ దుర్మరణం
తైపీ : తైవాన్‌కు చెందిన మహిళా ట్రెక్కర్ గిగీ వూ(36) శవాన్ని వెలికితీసేందుకు సహాయక చర్యలు చేపట్టామని ఆ దేశ రక్షణా బృందాలు తెలిపాయి. శనివారం తైవాన్‌లోని యుషాన్ జాతీయ పార్కులో కొండను ఎక్కుతున్న సమయంలో దురదృష్టవశాత్తు గిగీ లోయలో పడిపోయారని పేర్కొన్నాయి. తాను ప్రమాదంలో ఉన్న విషయాన్ని సాటిలైట్ ఫోన్ ద్వారా ఆమె స్నేహితులకు చేరవేశారని.. వారు ఇచ్చిన సమాచారంతో ప్రస్తుతం గిగీ శవం కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపాయి. కాగా సుమారు 100 పర్వతాలు అధిరోహించిన గిగీ... ప్రతీ శిఖరం పైకి చేరుకోగానే బికినీ ధరించి సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఈ క్రమంలో ఆమె ‘బికినీ క్లైంబర్’గా గుర్తింపు పొందారు. ఇక ఎప్పటిలాగానే శనివారం కూడా ట్రెక్కింగ్‌కు బయల్దేరిన ఆమె.. యుషాన్ పార్కులోని ఓ కొండపై నుంచి 100 అడుగుల లోతులో పడిపోయారు. ఈ క్రమంలో సోమవారం మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతానికి హెలికాప్టర్లు చేరుకునేందుకు వాతావరణం సహకరించడం లేదని.. అయితే తొందర్లోనే ఆమె శవాన్ని బయటికి తీసుకువస్తామని తెలిపారు. -
తైవాన్‌లో భారీ భూకంపం
-
భారీ భూకంపం ; కూలిన భవంతులు
హువలీన్: తూర్పు ఆసియా దేశమైన తైవాన్ను శక్తిమంతమైన భూకంపం వణికించింది. హువలీన్ కౌంటీకి ఉత్తరాన దక్షిణ చైనా సముద్రంలో మంగళవారం అర్థరాత్రి 6.4 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 145 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనలో 31 మంది విదేశీయులు సహా 258 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రతకు దేశంలోని తూర్పు ప్రాంతంలో రోడ్లు, నీటి సరఫరా వ్యవస్థ ధ్వంసం కాగా, విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో దాదాపు 35,000 మంది ప్రజలు ఆహారం, నీళ్లు లేకుండా చీకట్లో మగ్గుతున్నారు. భూ ప్రకంపనలకు భారీ భవంతులు సైతం పేక మేడల్లా కూలిపోయాయి. మరికొన్ని నివాస, వాణిజ్య భవన సముదాయాలు కూడా భూమిలోకి కుంగిపోవడంతో అందులో చిక్కుకున్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వీరిని రక్షించడానికి 600 మంది సైనికులతో పాటు 750 మంది అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగినట్లు అత్యవసర సేవల కేంద్రం తెలిపింది. భూకంపం తర్వాత హువాలియెన్లో కనిపించిన భీకర దృశ్యాలు.. -
ఈ స్నేహం సూపరో సూపర్..
తైపీ: ఈ మధ్య మనుషులకే సంబంధాలు ఇమడం లేదుగానీ.. పుట్టుకతోనే బద్ధశత్రువులైన కుక్క పిల్లి, పిల్లి ఎలుక, ఎలుక పామువంటికి మాత్రం స్నేహం ఇట్టే కుదిరిపోతోంది. అది ఎంత గాఢంగా అంటే తమ ముందున్న ఎలాంటి సమస్యనైనా అధిగమించి శత్రువనుకున్నవారిని మిత్రువుగా మార్చుకునేంత. ఈ అంశానికి తైపీలోని ఓ పెంపుడు జంతువుల ఇల్లు సజీవ సాక్ష్యంగా నిలిచింది. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే దాదాపు 14లక్షలమందికి పైగా ఈ వీడియోను చూశారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా.. తైవాన్ లోని తైపీ నగరంలోగల జోలిన్ పెట్ హౌజ్‌లో ఓ బుజ్జి కుక్క పిల్ల(జై)ను, మరో బుజ్జి పిల్లి(వీరు)ని వేర్వేరు గ్లాస్ నిర్మాణాల్లో పెట్టారు. అవి పైకి ఎక్కి పారిపోలేనంత పకడ్బందీగా ఏర్పాటుచేశారు. పక్కపక్కనే ఉన్న జైకి, వీరుకి స్నేహం కుదిరింది. కానీ, అస్సలు కలుసుకోలేవు. ఎందుకంటే మధ్యలో గ్లాస్ అడ్డు. అప్పుడప్పుడు నిద్రలోకి వెళ్లే అవి కాస్త మెలకువ వచ్చినప్పుడు మాత్రం ఒకదానిని ఒకటి చూసుకుంటూ మురిసిపోతుండేవి. ఒక రోజు బుజ్జి జై చిన్న కునుకు తీస్తుండగా తెలివైన వీరు మ్యావ్ అని అరుస్తూ గ్లాస్ గోడపైకి ఎక్కేసింది. వాస్తవానికి అక్కడి నుంచి అది పారిపోవచ్చు.. అయితే అప్పటికే నిద్రపోతున్న తన స్నేహితుడు జై నిద్ర లేచాడు. వెంటనే తన స్నేహితుడిని ఆహ్వానిస్తూ తన ముందు కాళ్లు అందించాడు. ఒక్కసారిగా మిత్రుడి స్పర్ష తగలడంతో మరింత కష్టపడి జైతో కలిసిపోయింది వీరు. ఇన్ని రోజులు పక్కపక్కనే ఉన్నా.. దూరమైన తన స్నేహితుడు తన పక్కకే వచ్చేసరికి బుజ్జి కుక్కపిల్ల సంతోషంతో తోకను ఊపుతూ ప్రేమగా తన మిత్రుడిపై ముద్దుల వర్షం కురిపించింది. అదెలాగో ఆ వీడియోను మీరే చూడండి. -
తైవాన్‌లో భూకంపం
తైపీ: తైవాన్ ఈశాన్య తీరం ప్రాంతంలో గురువారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.6గా నమోదు అయింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రాన్ని కనుగొన్నట్లు పేర్కొంది. తైవాన్ రాజధాని తైపీకి 60 కిలో మీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించిందని తెలిపింది. అయితే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ జరిగినట్లు ఇంత వరకు సమాచారం అందలేదని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తైవాన్‌లో భూకంపం సంభవించి అపార్ట్మెంట్ కుప్పకూలింది. ఈ ఘటనలో 117 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
తైవాన్ భూకంపం: పెరుగుతున్న మృతులు
తైపీ : తైవాన్‌లో గతవారం సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శనివారం నాటికి మృతుల సంఖ్య 108కి చేరుకుందని ఉన్నతాధికారులు తైవాన్ రాజధాని తైపీలో వెల్లడించారు. మరో తొమ్మిది మంది ఆచూకీ గల్లంతైందని తెలిపారు. ఈ భూకంపంలో గాయపడిన106 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఫిబ్రవరి 6వ తేదీన తైవాన్ ఈశాన్య ప్రాంతంలోని కావోషింగ్ కేంద్రంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6. 7గా నమోదు అయిన సంగతి తెలిసిందే. భూకంప ధాటికి తైనాన్ పట్టణంలోని పలు భారీ భవంతులు నేల కూలాయి. 16 అంతస్తుల భవనం పూర్తిగా దెబ్బతింది. అందులోని 281 మందిని పోలీసులు రక్షించారు. -
తైవాన్ మ్యూజిక్ పార్టీలో అగ్నిప్రమాదం
519 మందికి గాయాలు తైపీ: తైవాన్ రాజధాని తైపీలోని ఓ వాటర్ పార్కులో శనివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. ‘కలర్ ప్లే ఏసియా’ కార్యక్రమంలో భాగంగా వేదిక మీద నుంచి నిర్వాహకులు విసిరిన ఒక రకమైన రంగుల పొడి ఒక్కసారిగా భారీ పేలుడుకు దారితీసింది. దీంతో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సుమారు వెయ్యి మందిలో 519 మంది కాలిన గాయాలతో ఆస్పత్రులపాలయ్యారు. వారిలో 419 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వారిలో 184 మందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బాధితుల్లో తైవాన్ జాతీయులతోపాటు హాంగ్‌కాంగ్ నుంచి నలుగురు, చైనా నుంచి ఇద్దరు, మకావు, జపాన్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారని వివరించారు. బాధితులను దేశాధ్యక్షుడు మా యింగ్-జియో ఆదివారం పరామర్శించారు. వారికి అత్యుత్తమ వైద్య సాయం అందేలా చూస్తామన్నారు. అలాగే ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాద కారణాలు ఇంకా తెలియరాలేదని , దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. దేశంలో రంగుల పొడి వాడకంతో సాగే కార్యక్రమాలపై ప్రధాని చిహ్-కువో గతంలోనే నిషేధం విధించారు. -
తైవాన్‌లో భారీ పేలుడు