
తైపీ : తైవాన్‌కు చెందిన మహిళా ట్రెక్కర్ గిగీ వూ(36) శవాన్ని వెలికితీసేందుకు సహాయక చర్యలు చేపట్టామని ఆ దేశ రక్షణా బృందాలు తెలిపాయి. శనివారం తైవాన్‌లోని యుషాన్ జాతీయ పార్కులో కొండను ఎక్కుతున్న సమయంలో దురదృష్టవశాత్తు గిగీ లోయలో పడిపోయారని పేర్కొన్నాయి. తాను ప్రమాదంలో ఉన్న విషయాన్ని సాటిలైట్ ఫోన్ ద్వారా ఆమె స్నేహితులకు చేరవేశారని.. వారు ఇచ్చిన సమాచారంతో ప్రస్తుతం గిగీ శవం కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపాయి.
కాగా సుమారు 100 పర్వతాలు అధిరోహించిన గిగీ... ప్రతీ శిఖరం పైకి చేరుకోగానే బికినీ ధరించి సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఈ క్రమంలో ఆమె ‘బికినీ క్లైంబర్’గా గుర్తింపు పొందారు. ఇక ఎప్పటిలాగానే శనివారం కూడా ట్రెక్కింగ్‌కు బయల్దేరిన ఆమె.. యుషాన్ పార్కులోని ఓ కొండపై నుంచి 100 అడుగుల లోతులో పడిపోయారు. ఈ క్రమంలో సోమవారం మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతానికి హెలికాప్టర్లు చేరుకునేందుకు వాతావరణం సహకరించడం లేదని.. అయితే తొందర్లోనే ఆమె శవాన్ని బయటికి తీసుకువస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment