trekker
-
Moushmi Kapadia: ఎడారి చీకటి నుంచి వెన్నెల వెలుగులోకి...
‘మీ బిడ్డ నాలుగు–అయిదు సంవత్సరాలకు మించి బతకడు’ అని వైద్యులు చెప్పినప్పుడు ఎత్తైన చోటు నుంచి చీకటిలోయల్లో పడిపోయినట్లు తల్లడిల్లి పోయింది . మూడు సంవత్సరాలు డిప్రెషన్ చీకట్లో కూరుకుపోయిన మౌష్మి ఒక్కొక్క అడుగు వేస్తూ వెలుగుదారిలోకి వచ్చింది. ఆట–పాటలతో తనలో ఉత్సాహాన్ని నింపుకొంది. ఆ ఉత్సాహాన్ని శక్తి చేసుకుంది. గా దేశాన్ని చుట్టి వచ్చింది. గా ఎన్నో సాహసాలు చేసింది ఇంటి గడప దాటలేడు అనుకున్న కుమారుడికి ప్రపంచం చూపుతూ ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తోంది మౌష్మి కపాడియా... మౌష్మి కపాడియా కుమారుడు ఆర్ఎస్ఎమ్డీ) అని నిర్ధారించిన వైద్యులు ‘ఇది నయం చేయలేని వ్యాధి’ అన్నారు. ఆ బాధ మాటలకు అందనిది. తట్టుకోలేనిది. తనలో తాను ఎంతో కుమిలిపోయింది మౌష్మి. పిల్లాడికి సంబంధించి ఏం చేయాలి? ఏం చేయకూడదు, ఎలా కేర్ తీసుకోవాలో వివరించారు వైద్యులు. వేదాన్షును తీసుకొని దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న భర్త ప్రియేష్ దగ్గరకు వెళ్లింది. మూడేళ్ల వయసులో వేదాన్ష్ కు గురయ్యాడు. ఐసీయూలో ఉన్న తన బిడ్డను చూసి కుప్పకూలిపోయింది మౌష్మి. ఆ భయానకమైన రోజు ఇప్పటికీ తన కళ్లముందే కదలాడుతున్నట్టు ఉంటుంది. బిడ్డ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలియదు. తాను చేయగలిగిందల్లా దూరం నుంచి బిడ్డను చూస్తూ మనసులో ఏడ్వడం మాత్రమే. ఆశ కోల్పోయిన వైద్యులు... ‘దేవుడిని ప్రార్థించండి. మేము మా వంతు ప్రయత్నం చేశాం’ అన్నారు. ఈ మాటలు తనను మరింత కృంగిపోయేలా చేశాయి. వెంటిలేటర్‌పై అయిదురోజులు ఉన్నాడు వేదాన్షు. ఆ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ ఒకరు మెరుగైన చికిత్స కోసం ఇండియాకు వెళితే మంచిది అని సలహా ఇచ్చాడు. అతడి సలహా ప్రకారం బిడ్డను తీసుకొని భర్తతో కలిసి ముంబైకి వచ్చింది మౌష్మి. అబ్బాయిని ఇంటికి తీసుకువెళ్లిన రోజును గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ వణికిపోతుంది మౌష్మి. ‘ఇరవై ఏళ్ల క్రితం దుబాయ్‌లో వైద్యసదుపాయాలు అంత బాగాలేవు. శ్వాస తీసుకోవడానికి అవసరమైన ప్రత్యేక యంత్రాలు లేవు’ అని దుబాయ్‌లో ఆనాటి పరిస్థితులను గుర్తు తెచ్చుకుంటుంది మౌష్మి. ముంబైలోని హాస్పిటల్లో కొన్నిరోజులు ఉన్న తరువాత వేదాన్షు పరిస్థితి మెరుగుపడింది. ఆశాదీపం ఏదో కనిపించి ఆ క్షణంలో ధైర్యం ఇచ్చింది. అయితే వైద్యులు మాత్రం... ‘నాలుగు–అయిదు సంవత్సరాలకు మించి బతకడు’ అని చెప్పారు. బలహీనమైన ఊపిరితిత్తుల వల్ల వేదాన్షు ఎన్నోసార్లు నిమోనియా బారిన పడ్డాడు. ‘ఇంటి నుంచి ఆస్పత్రి–ఆస్పత్రి నుంచి ఇంటికి’ అన్నట్లు ఉండేది పరిస్థితి. కొంత కాలం తరువాత మరో బిడ్డకు జన్మనిచ్చింది మౌష్మి. ఇది మౌష్మి జీవితాన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది. డిప్రెషన్ అనే చీకట్లోకి తీసుకెళ్లింది. ‘అకారణంగా కోపం వచ్చేది. చీటికిమాటికి చిరాకు పడేదాన్ని. తలుపులు గట్టిగా వేసేదాన్ని. నేను డిప్రెషన్లో ఉన్నాను అనే విషయం అప్పుడు తెలియదు. ఇలా ఎందుకు చేస్తున్నాను? అని నా గురించి నేను ఆలోచించే పరిస్థితిలో లేను. ఆ సమయంలో నా ఫ్రెండ్ ఒకరు కౌన్సిలింగ్‌కు వెళ్లమని సలహా ఇచ్చారు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మౌష్మి. అయితే మందుల ప్రభావంతో ఆమె బరువు పెరిగింది. ఆ బరువు మోకాళ్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ‘ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి’ అని చెప్పారు వైద్యులు. అలా తన ఫిట్నెస్ జర్నీ మొదలైంది. కొత్త జీవితానికి మొదటి అడుగు పడింది. తనకు ఇష్టమైన టెన్నిస్ ఆడడం మొదలు పెట్టింది. ఆడుతున్న సమయంలో తన మూడ్ చేంజ్ అవుతున్నట్లు, ఉత్సాహం వచ్చి చేరుతున్నట్లు అనిపించింది. జుంబా క్లాసులలో కూడా చేరి మరింత ఉత్సాహాన్ని పెంచుకుంది. మూడేళ్లపాటు డిప్రెషన్‌తో పోరాడి బయట పడిన మౌష్మి ఇద్దరు బిడ్డలను కంటి పాపల్లా చూసుకోవాలనుకుంది. ‘గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలోని బెస్ట్ మామ్ కావాలనుకున్నాను’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మౌష్మి. మూడు సంవత్సరాలుగా తనను వెంటాడిన నిరాశానిస్పృహలు, విషాదం కోపం లాంటి వాటి నుంచి బయటపడిన తరువాత పిల్లలతో హాయిగా గడిపే కాలం, పిల్లలే నా ప్రపంచం అనే కల కన్నది. బైక్‌పై దేశాన్ని చుట్టి రావాలి... ఎత్తైన పర్వతశిఖరాలను అధిరోహించాలి అనేది తన కల. పీడకలలాంటి జీవితం నుంచి బయటపడ్డ మౌష్మి కపాడియా తన కలను నిజం చేసుకుంది. పర్వతారోహణకు సంబంధించి ఎన్నో సాహసాలు చేసింది. ఇంటికే పరిమితం అవుతాడనుకున్న వేదాన్షుకు ప్రపంచాన్ని చూపింది. ‘విషాదం తప్ప అతడికి తోడు ఏదీ లేదు’ అని ఇతరులు సానుభూతి చూపే సమయంలో ‘నిరంతరం ఆనందమే నా బలం’ అని ధైర్యంగా ముందుకువెళ్లేలా చేసింది. బిడ్డతో కలిసి 21 దేశాలకు వెళ్లి వచ్చిన మౌష్మి కపాడియా ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకుంది. సవాళ్లను అధిగమించేలా... వేదాన్ష్లో వయసుకు మించిన పరిణతి కనిపిస్తుంది. ఓటమికి తలవంచని వేదాన్షు నోటి నుంచి తరచుగా వచ్చే మాట ‘హ్యాపీ ఎబౌట్ ఎవ్రీ థింగ్ అండ్ శాడ్ ఎబౌట్ నథింగ్’ ‘జీవితం మన ముందు ఎన్నో సవాళ్లు పెడుతుంది. వాటిని అధిగమిస్తామా లేదా అనేదానిపైనే మనం ముందుకు వెళ్లే దారి నిర్ణయం అవుతుంది’ అంటాడు వేదాన్ష్. -
Anitha Rao: మహిళా ట్రెక్కర్‌గా.. హార్స్ రైడింగ్, పెయింటింగ్‌లోనూ.. హ్యాట్సాఫ్!
మురళీనగర్: విశాఖపట్నానికి చెందిన దేవనబోయిన అనితారావు (53)కు సాహసమే ఊపిరి. ఐదు పదులు దాటినా ఆమె పర్వతారోహణ, బైక్ రైడింగ్‌తో సత్తా చాటుకుంటున్నారు. సాహసయాత్రికురాలిగా, బైక్ రైడర్‌గా ఆమె పేరు తెచ్చుకున్నారు. తండ్రి కల్నల్ అర్జునరావు మిలట్రీలో పనిచేశారు. దీంతో ఆమెలోనూ సాహస గుణం అలవడింది. ప్రస్తుతం బీచ్‌రోడ్డులోని కిర్లంపూడి లేఅవుట్లో బాలాజీ టవర్స్‌లో ఉంటున్నారు. ఆమె భర్త కమాండర్ వి.రామకృష్ణ నేవీలో రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆంధ్రా యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేస్తూ యువతకు ఆదర్శగా నిలుస్తున్నారు. మహిళా ట్రెక్కర్‌గా.. ఢిల్లీ యూనివర్సిటీలో ఆమె ఎంఏ సైకాలజీ చేశారు. నేవీ ఆస్పత్రిలో కొంత కాలం సైకాలజిస్టుగా కౌన్సెలింగ్ సెక్షన్లో పని చేశారు. ప్రస్తుతం గృహిణిగా ఉంటూనే పెయింటింగ్‌లో స్పెషల్ కోర్సు చేస్తూ రెగ్యులర్ విద్యార్థిగా విద్యాభ్యాసం చేస్తున్నారు.. 2004నుంచి ట్రెక్కింగ్ చేస్తున్నారు. దేశంలోని 50కి పైగా పర్వత ప్రాంతాలకు సాహసయాత్ర చేశారు. విశాఖ యూత్ హాస్టల్ తరుఫున బృందాలకు టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తూ అనేక ప్రాంతాలకు సాహసయాత్ర చేశారు. కాశ్మీరులోని సోనామార్గ్‌లోని జవహర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యుట్లో 2015లో మౌంట్ ఇంజినీరింగు కోర్సు చేసిన ఆమెకు పర్వతారోహణపై పూర్తి అవగాహన ఉంది. ప్రతి ఏడాది మే/జూన్ నెలల్లో హిమాలయపర్వతాలకు వెళ్తారు. మౌంటినీరింగులో భాగంగా క్యాంప్ లీడరుగా లడక్‌లో 21రోజుల పాటు అనేక ఇబ్బందులను అధిగమించి విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆమె చెప్పారు. అత్యధిక పీక్‌పాయింటుగా అయిన ఒడిశాలోని ఈస్ట్రన్ ఘాట్స్‌లోని మహేంద్రగిరిని ఆమె అవలీలగా అధిరోహించారు. హార్స్ రైడింగ్‌లో.. అనితారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. హార్స్ రైడింగులోనూ మంచి ప్రవేశం ఉంది. న్యూఢిల్లీలో 1986లో జరిగిన జాతీయ స్థాయి హార్స్ రైడింగ్ పోటీల్లో పాల్గొన్నారు. అంతే కాకుండా ఆమె నిర్వహించిన మోటారు బైక్ యాత్ర లిమ్కా బుక్ఆఫ్ రికార్డులో నమోదయ్యింది. 2009లో ఢిల్లీ నుంచి హిమాలయపర్వతాల్లో 3000 కిలోమీటర్లు యాత్ర చేశారు. 2011లో మనాలి నుంచి బైక్ యాత్ర చేశారు. దీనికి క్యాంపు లీడరుగా వ్యవహరించారు. ఈ రెండూ లిమ్కా బుక్ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయినట్లు ఆమె చెప్పారు. గుజరాత్ నుంచి కేరళ వరకు 3000 కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు. పెయింటింగ్‌లోనూ.. పెయింటింగ్‌లో ఆమె దిట్ట. పెన్సిల్ స్కెచింగ్, వాటర్ కలర్ పెయింగ్స్ వేస్తారు. విశాఖ మ్యూజియంలో, హవామహల్‌లో నిర్వహించిన పెయింటింగ్ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. -
కేరళలో కొండ చీలికలో చిక్కుకున్న యువకుడు..
-
మహిళా ట్రెక్కర్ దుర్మరణం
తైపీ : తైవాన్‌కు చెందిన మహిళా ట్రెక్కర్ గిగీ వూ(36) శవాన్ని వెలికితీసేందుకు సహాయక చర్యలు చేపట్టామని ఆ దేశ రక్షణా బృందాలు తెలిపాయి. శనివారం తైవాన్‌లోని యుషాన్ జాతీయ పార్కులో కొండను ఎక్కుతున్న సమయంలో దురదృష్టవశాత్తు గిగీ లోయలో పడిపోయారని పేర్కొన్నాయి. తాను ప్రమాదంలో ఉన్న విషయాన్ని సాటిలైట్ ఫోన్ ద్వారా ఆమె స్నేహితులకు చేరవేశారని.. వారు ఇచ్చిన సమాచారంతో ప్రస్తుతం గిగీ శవం కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపాయి. కాగా సుమారు 100 పర్వతాలు అధిరోహించిన గిగీ... ప్రతీ శిఖరం పైకి చేరుకోగానే బికినీ ధరించి సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఈ క్రమంలో ఆమె ‘బికినీ క్లైంబర్’గా గుర్తింపు పొందారు. ఇక ఎప్పటిలాగానే శనివారం కూడా ట్రెక్కింగ్‌కు బయల్దేరిన ఆమె.. యుషాన్ పార్కులోని ఓ కొండపై నుంచి 100 అడుగుల లోతులో పడిపోయారు. ఈ క్రమంలో సోమవారం మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతానికి హెలికాప్టర్లు చేరుకునేందుకు వాతావరణం సహకరించడం లేదని.. అయితే తొందర్లోనే ఆమె శవాన్ని బయటికి తీసుకువస్తామని తెలిపారు. -
81ఏళ్ళ వయసులో రికార్డు సృష్టించాడు!
పుణె: పర్వతాలను అధిరోహించడమంటే మామూలు విషయం కాదు. ఎంతో కృషి, పట్టుదలతో పాటు ఆరోగ్యం కూడా సహకరించాల్సి ఉంటుంది. అటువంటిది 81 ఏళ్ళ వృద్ధుడు రికార్డు సృష్టించాడు. హిమాచల్ ప్రదేశ్‌లో హిమాలయ పర్వతాల్లో అత్యంత ఎత్తైన రూపిన్ పాస్ క్రాస్ అధిరోహించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించాడు. పుణెకు చెందిన గోపాల్ వాసుదేవ్ లేలే వయసు 81 సంవత్సరాలు. గతేడాది సెప్టెంబర్ లో పర్వతారోహణ చేసిన వ్యక్తి కంటే పది రెట్లు ఎక్కువగా హిమాలయ పర్వతాలను అధిరోహించాడు. అంతేగాక అతి పెద్ద వయసులో 15,350 అడుగుల ఎత్తైన హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న రూపిన్ పాస్.. ఎక్కిన వ్యక్తిగా గోపాల్ వాసుదేవ్ లిమ్కా బుక్ లో తనపేరు నమోదు చేసుకున్నాడు. వర్షం, మంచు కురవడం, కొండ చెరియలు విరిగి పడటంతో పాటు...మైనస్ ఏడు డిగ్రీల్లో ఉండే చలిప్రాంతంలో ప్రయాణించి గోపాల్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తలచిన కార్యం సిద్ధించాలంటే ముందుగా మానసిక శక్తి, ఆత్మ విశ్వాసం ఎంతో అవసరం అంటాడు గోపాల్. తానో వృద్ధుడినని, తనకు 81 సంవత్సరాల వయసు ఉందన్న విషయాన్నిఎప్పుడూ తలచుకోనని, యువకుడిలాగానే ఫీలౌతానని అంటాడు గోపాల్. 1972 నుంచి పర్వతారోహణ చేస్తున్న అతడు... ఇప్పటికీ ప్రతిరోజూ కనీసం 8 కిలోమీటర్లు వాకింగ్ చేస్తుంటాడు. శారీరక వ్యాయామంలో భాగంగా వారానికోసారి ముంబై-పుణె హైవే ప్రాంతంలో ఉన్నకొండలను కూడ ఎక్కుతుంటాడు. ఇప్పటికే కేదార్ నాథ్, కైలాష్, కాంచెన్ జుంగా, సంగ్లా లను అధిరోహించిన గోపాల్... ఈసారి సెప్టెంబర్ లో ఉత్తరాఖండ్ లోని రూప్ కుంద్ ఎక్కేందుకు కూడా సిద్ధం అవుతున్నాడు. పుణెకు చెందిన ట్రెక్కింగ్ గ్రూప్ 'ట్రెక్నిక్' లో ఏడేళ్ళ క్రితం చేరిన అతడు అప్పట్నుంచీ అందులో భాగంగా మారిపోయాడు. ఎలక్ట్రికల్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీర్ గా విద్యార్హతలు సంపాదించిన గోపాల్.. 1964 లో పుణెకు చేరుకున్నాడు. కొన్నాళ్ళపాటు వివిధ ఫ్యాక్టరీల్లో పనిచేసి, అనంతరం అక్కడే తన స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం వ్యాపార బాధ్యతలను కుమారుడికి అప్పగించేసినా ప్రతిరోజూ ఒక్కసారైనా ఫ్యాక్టరీని సందర్శించి వస్తుంటాడు. అయితే పర్వతారోహణ రేస్ వంటిది కాదని, ఎత్తైన ప్రాంతాలను అధిరోహించేప్పుడు ఎంతో సావధానంగా ఉండాలని గోపాల్ సలహా ఇస్తాడు. ట్రెక్కింగ్ చేయాలంటే కొన్ని నెలల ముందునుంచే శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, అందుకు కావలసిన ప్రిపరేషన్ ఉండాలని సూచిస్తాడు. ట్రెక్కింగ్ లో పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ తక్కువై ఊపిరి కష్టమౌతుందని అంతా చెప్తుంటారని, తాను ఇప్పటికి ఎన్నోసార్లు హిమాలయాలను ఎక్కినా తనకా సమస్య ఎదురు కాలేదని చెప్తున్నాడు. ఆరోగ్యం, శరీర ధారుఢ్యం ఉన్నా ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా పర్వతారోహణ సాధ్యం కాదనే గోపాల్... ఎనభై ఏళ్ళు దాటిన వయసులోనూ బీపీ, సుగర్, ఆర్థరైటిస్ వంటి సమస్యలేవీ లేకుండా ఆరోగ్యంగా, చలాకీగా ఉంటూ.. చిన్న వయసులోనే డీలా పడిపోయే ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. -
వాట్పాప్ సందేశమే ఆదుకుంటోంది..
షిమ్లా: జమ్ము కశ్మీర్ పర్వతాల్లో చిక్కుకున్న ఓ పర్వతాహకుడ్ని వాట్సాప్ సందేశం ఆదుకుంది. ఆపద నుంచి కాపాడబోతోంది. కార్గిల్ సమీపంలో జానస్కార్ లోని ఉమాసి పాస్ పరిసర ప్రాంతంలో చిక్కుకుపోయిన టెక్కర్ రిజుల్ గిల్ రక్షించేందుకు ప్రభుత్వం, సైన్యం పాటుపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే హిమాచల్ ప్రదేశ్ లోని చంబా ప్రాంతానికి చెందిన గిల్ అనే పర్వతారోహకుడు అనూహ్యంగా ఆపదలో ఇరుక్కున్నాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడు అరుణ్ శర్మకి సమాచారం అందించాడు. దీంతో అరుణ్ దీన్ని వాట్సాప్ ద్వారా పోలీసులకు తెలిపాడు. వాట్సాప్ గ్రూప్ ద్వారా టెక్కర్ రిజుల్ గిల్ ప్రమాదంలో చిక్కుకున్నట్టు సమాచారం అందిందని డిప్యూటీ కమిషనర్ రాజేష్ కన్వార్ తెలిపారు. తీవ్ర గాయాలపాలయ్యాడన్న సమాచారంతో వెంటనే అలర్ట్ అయ్యామని, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశామన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, సైన్యం సహాయంతో అతన్ని అక్కణ్నించి రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ట్రెక్కర్ ను కాపాడేందుకు వీలుగా హెలికాప్టర్ కోసం కార్గిల్ అధికారులు భారతీయ సైన్యానికి విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత తొందర్లోనే అతణ్ని వెనక్కి తీసుకొస్తామని చెబుతున్నారు. అయితే తన మిత్రుడు ప్రమాదంలో చిక్కుకొని ఇప్పటికే నాలుగురోజులైందని, ఇక రెండు రోజులకు సరపడా ఆహారం మాత్రమే అతడి దగ్గర ఉందని గిల్ స్నేహితుడు అరుణ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొందరగా రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.