తైవాన్ భూకంపం: పెరుగుతున్న మృతులు | Taiwan quake death toll rise to 108 | Sakshi
Sakshi News home page

తైవాన్ భూకంపం: పెరుగుతున్న మృతులు

Published Sat, Feb 13 2016 8:49 AM | Last Updated on Sun, Sep 3 2017 5:34 PM

తైవాన్ భూకంపం: పెరుగుతున్న మృతులు

తైవాన్ భూకంపం: పెరుగుతున్న మృతులు

తైపీ : తైవాన్లో గతవారం సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శనివారం నాటికి మృతుల సంఖ్య 108కి చేరుకుందని ఉన్నతాధికారులు తైవాన్ రాజధాని తైపీలో వెల్లడించారు.  మరో తొమ్మిది మంది ఆచూకీ గల్లంతైందని తెలిపారు. ఈ భూకంపంలో గాయపడిన106 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు.

ఫిబ్రవరి 6వ తేదీన తైవాన్ ఈశాన్య ప్రాంతంలోని కావోషింగ్ కేంద్రంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6. 7గా నమోదు అయిన సంగతి తెలిసిందే. భూకంప ధాటికి తైనాన్ పట్టణంలోని పలు భారీ భవంతులు నేల కూలాయి. 16 అంతస్తుల భవనం పూర్తిగా దెబ్బతింది. అందులోని 281 మందిని పోలీసులు రక్షించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement