ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16కు చేరిన జట్లు నాకౌట్ దశ కావడంతో గెలిచిన జట్టు ముందుకు.. ఓడిన జట్టు ఇంటికి చేరుతుంది. ఈ దశలో శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన రౌండ్ ఆఫ్ 16లో మెస్సీ బృందం 2-0తో విజయం సాధించింది.
గత మ్యాచ్‌లో గోల్ చేయడంలో విఫలమైన మెస్సీ ఈ మ్యాచ్‌లో మాత్రం కీలక దశలో మెరిశాడు. ఆట 35వ నిమిషంలో లెఫ్ట్ కార్నర్ నుంచి గోల్ కొట్టడంతో అర్జెంటీనా బోణీ చేసింది. ఆ తర్వాత తొలి హాఫ్‌టైమ్ ముగిసేసరికి అర్జెంటీనా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో అర్థభాగం మొదలయిన కాసేపటికే ఆట 57వ నిమిషంలో ఆస్ట్రేలియా గోల్ కీపర్ మాథ్‌యూ రేయాన్‌ను బోల్తా కొట్టిస్తూ సింపుల్ గోల్ చేయడంతో అర్జెంటీనా ఆధిక్యం 2-0కు పెరిగింది.
ఆ తర్వాత ఆట 77వ నిమిషంలో ఆస్ట్రేలియా ఆటగాడు ఫెర్నాండేజ్ సెల్ఫ్‌గోల్ చేయడంతో ఆధిక్యం 2-1కి తగ్గింది. అయితే ఆ తర్వాత పలుమార్లు ఇరుజట్లు గోల్‌పోస్ట్‌పై దాడులు చేయడంతో ఉత్కంఠ పెరిగింది. చివరకు అర్జెంటీనా 2-1తో విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఇక మెస్సీకి తన కెరీర్‌లో ఇది 1000వ మ్యాచ్ కావడం విశేషం. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా డిసెంబర్ 10న జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది.
• Messi's 🤌🏻 placement 🎯
— JioCinema (@JioCinema) December 3, 2022
• Alvarez's alertness 🚨
• Goodwin with a glimmer of hope 🙏
Watch all the 3️⃣ goals from #ARGAUS & keep watching the #FIFAWorldCup on #JioCinema & #Sports18 📺📲#Qatar2022 #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/3gOHiOknZq
Comments
Please login to add a commentAdd a comment