బౌలింగ్‌లో రిత్విక్ (5/24), బ్యాటింగ్‌లో మిఖిల్ జైస్వాల్ (129), నిఖిల్ జైస్వాల్ (138) సెంచరీలతో రాణించడంతో సెయింట్ జాన్స్ సెమీస్ చేరింది.
జింఖానా, న్యూస్‌లైన్: బౌలింగ్‌లో రిత్విక్ (5/24), బ్యాటింగ్‌లో మిఖిల్ జైస్వాల్ (129), నిఖిల్ జైస్వాల్ (138) సెంచరీలతో రాణించడంతో సెయింట్ జాన్స్ సెమీస్ చేరింది. కోకాకోలా కప్ అండర్-16 ఇంటర్ స్కూల్ టోర్నీలో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో సెయింట్ జాన్స్ జట్టు 240 పరుగుల భారీ తేడాతో జాన్సన్ గ్రామర్ స్కూల్‌పై ఘనవిజ యం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ జాన్స్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్య ఛేదన కు దిగిన జాన్సన్ గ్రామర్ జట్టుపై ప్రత్యర్థి జట్టు బౌలర్ల విజృంభనతో జాన్సన్ జట్టు 60 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్‌లో గౌతమ్ మోడల్ స్కూల్ బౌలర్ వరుణ్ గౌడ్ 5 వికె ట్లు తీసి జట్టుకు విజయాన్ని చేకూర్చాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన బాయ్స్ టౌన్ జట్టు 123 పరుగుల వద్ద ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గౌతమ్ మోడల్ స్కూల్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి విజయాన్ని కైవసం చేసుకుంది.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్: 168 (హృషికేష్ 35, సాత్యఖి 41, అనిరుధ్ 39), కాల్ పబ్లిక్ స్కూల్: 169/3 (విఘ్నేశ్వర్ 67, పురుషోత్తమ్ 66). హెచ్‌పీయస్ రామంతపూర్: 110 (సింహ 69; అనిఖేత్ రెడ్డి 3/27), నిజామాబాద్: 112/3 (అఖిల్ 55, మజిద్ 42 నాటౌట్ ).