Ranji Trophy 2023-24- Quarter Finals: రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లు సోమవారంతో ముగిశాయి. ఎలైట్ డివిజన్‌లో మొత్తం 32 జట్లను 4 గ్రూప్‌లుగా (ఎ, బి,సి,డి; 8 జట్ల చొప్పున) విభజించారు. గ్రూప్ ‘బి’లో ముంబై జట్టు 37 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా... ఆంధ్ర జట్టు 26 పాయింట్లతో (3 విజయాలు, 3 ‘డ్రా’, 1 ఓటమి) రెండో స్థానంలో నిలిచింది.
ఇక చివరి లీగ్ మ్యాచ్‌కంటే ముందే ఈ రెండు జట్లకు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి విదర్భ (33 పాయింట్లు), సౌరాష్ట్ర (28 పాయింట్లు)... గ్రూప్ ‘సి’ నుంచి తమిళనాడు (28 పాయింట్లు), కర్ణాటక (27 పాయింట్లు)... గ్రూప్ ‘డి’ నుంచి మధ్యప్రదేశ్ (32 పాయింట్లు), బరోడా (26 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి.
ఎలైట్ డివిజన్‌కు హైదరాబాద్ అర్హత
కాగా 32 జట్లలో చివరి రెండు స్థానాల్లో నిలిచిన మణిపూర్, గోవా జట్లు వచ్చే సీజన్‌కు ‘ప్లేట్’ డివిజన్‌కు పడిపోగా... ‘ప్లేట్’ డివిజన్‌లో ఫైనల్ చేరిన హైదరాబాద్, మేఘాలయ ఎలైట్ డివిజన్‌కు అర్హత పొందాయి.
ఫిబ్రవరి 23 నుంచి క్వార్టర్ ఫైనల్స్
►ఇక ఈనెల 23 నుంచి జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో కర్ణాటకతో విదర్భ (నాగ్‌పూర్‌లో- Vidarbha vs Karnataka, 1st Quarter Final)
►ముంబైతో బరోడా (ముంబైలో- Mumbai vs Baroda, 2nd Quarter Final)
►తమిళనాడుతో సౌరాష్ట్ర (కోయంబత్తూరులో- Tamil Nadu vs Saurashtra, 3rd Quarter Final)
►మధ్యప్రదేశ్‌తో ఆంధ్ర (ఇండోర్‌లో- Madhya Pradesh vs Andhra, 4th Quarter Final ) తలపడతాయి.
ఆటకు వీడ్కోలు
ఇక రంజీ తాజా సీజన్ సందర్భంగా ఐదుగురు క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలికారు. మనోజ్ తివారి(బెంగాల్), ధవళ్ కులకర్ణి(ముంబై), సౌరభ్ తివారి(జార్ఖండ్), ఫైజ్ ఫజల్(విదర్భ), వరుణ్ ఆరోన్(జార్ఖండ్) ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కూ రిటైర్మెంట్ ప్రకటించారు.
చదవండి: రోహిత్, కోహ్లిలా హీరో అయ్యే వాడిని.. కానీ ఆరోజు ధోని ఎందుకలా చేశాడో?
Comments
Please login to add a commentAdd a comment