జింఖానా, న్యూస్‌లైన్: బీఎఫ్‌ఐ ఐఎంజీ రిలయన్స్ స్కూల్ బాస్కెట్‌బాల్ లీగ్‌లో బాలుర, బాలికల విభాగాల్లో చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్లు సెమీస్‌లోకి ప్రవేశించాయి. బాలుర విభాగంలో మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్స్‌లో చిరెక్ పబ్లిక్ స్కూల్ 32-26తో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్‌పై విజయం సాధించింది. మ్యాచ్ తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి 13-8తో చిరెక్ పబ్లిక్ స్కూల్ ముందంజలో ఉంది. ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ ఆటగాళ్లు కునాల్ (14), శివసాయి వర్మ (8) శ్రమించినప్పటికీ ఫలితం దక్కలేదు. చిరెక్ పబ్లిక్ స్కూల్ క్రీడాకారులు హిమేష్ (10), విశాల్ (8), స్టీవెన్ (6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
బాలికల క్వార్టర్‌ఫైనల్స్‌లో చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్టు 37-24తో సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజిపై గెలుపొందింది. మొదటి అర్ధ భాగం ముగిసే సమయానికి 24-9తో ఆధిక్యంలో ఉన్న చిరెక్ పబ్లిక్ స్కూల్‌కు రెండో అర్ధ భాగంలో ప్రత్యర్థి నుంచి కొంత పోటీ ఎదురైనప్పటికీ సబ్రీన్ (10), సన్హిత (10), దృష్టి (6) అల వోకగా దూసుకెళ్ళడంతో జట్టుకు విజయం చేకూరింది. సెయింట్ ఆన్స్ జట్టులో జాయ్ (4), శారద (4), సదియ (4), పల్లవి (4) చక్కటి ఆట తీరు కనబరిచారు.
మిగిలిన ఫలితాలు
బాలికల విభాగం: సెయింట్ పాయిస్ హైస్కూల్: 23 (తేజస్విని 10, శ్రీజ 6, మౌనిక 4); హోలీ ఫ్యామిలి: 8 (వినీష 4, జనని 2, శైలజ 2).
ఫ్యూచర్ కిడ్స్: 21 (హారిక 10, ప్రణవి 7); సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి: 8 (కరుణ 2).
బాలుర విభాగం: ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్: 44 (కార్తీక్ 15, రావల్ 9, విభు 6); ఇండస్ వరల్డ్ స్కూల్: 28 ( సూర్య 8, నితిన్ 7).
గీతాంజలి స్కూల్: 29 (ఒమర్ 10, భార్గవ్ 10, సాహర్ష్ 7); డీఆర్‌ఎస్ ఇంటర్నేషనల్: 19 (వికాస్ 12).
సెమీస్‌లో చిరెక్ జట్లు
Published Wed, Dec 18 2013 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM
Advertisement
Advertisement