క్వార్టర్స్‌లో కార్తికేయ్ | karthikeya entered in quarters finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో కార్తికేయ్

Published Sun, Feb 9 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM

karthikeya entered in quarters finals

 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో అండర్-15 బాలుర సింగిల్స్‌లో ఏపీ కుర్రాడు డి.జస్వం త్, టాప్ సీడ్ కార్తికేయ్ (ఢిల్లీ) క్వార్టర్ ఫైనల్స్‌కు చేరారు. సాత్విక్ సాయిరాజ్(ఏపీ) ఓడిపోయాడు. శనివారం కడపలోని వైఎస్‌ఆర్ ఇండోర్ స్టేడియం లో జరిగిన బాలుర సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సి.జస్వంత్ (ఏపీ) 10-21, 22-20, 21-10తో మైస్నమ్ మేరాబా (మణిపూర్)పై విజయం సాధించాడు.
 
 మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ కార్తికేయ్ (ఢిల్లీ) 21-16, 21-8తో ప్రాకార్ (మధ్యప్రదేశ్)పై గెలిచాడు. ఇతర మ్యాచ్‌ల్లో కిరణ్ (కేరళ) 12-21, 21-18, 21-17తో నాలుగో సీడ్ సాత్విక్ సాయిరాజ్(ఏపీ)పై, రాహుల్ 21-19, 21-11తో ఆకాశ్ యాదవ్ (ఢిల్లీ)పై, ఒరిజీత్ (అస్సాం) 21-16, 21-15తో శ్రీదత్తాత్రేయ రెడ్డి(ఏపీ)పై, ధృవ్ కపిలా (పంజాబ్) 17-21, 21-10, 21-14తో కె.ఆర్.కె.చరిత్ (ఏపీ)పై, లక్ష సేన్ (ఉత్తరాంచల్) 21-13, 21-12తో కె.జగదీష్ (ఏపీ)పై నెగ్గారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement