ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి పురుషుల బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్‌ను అరోరా కాలేజి జట్టు చేజిక్కించుకుంది. ఓయూ గ్రౌండ్స్‌లో జరిగిన ఫైనల్లో అరోరా కాలేజి జట్టు 40-14తో సునాయాసంగా ఓయూ టెక్నాలజీ కాలేజి జట్టుపై ఘనవిజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో సైఫాబాద్ ఓయూ పీజీ సైన్స్ కాలేజి జట్టు 29-11తో ఓయూ కామర్స్ కాలేజి జట్టుపై విజయం సాధించింది.
అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో అరోరా కాలేజి 40-3తో ఓయూ పీజీ సైన్స్ కాలేజిపై, ఓయూ టెక్నాలజీ కాలేజి 40-11తో ఓయూ కామర్స్ కాలేజిపై గెలిచాయి. ఈ పోటీల విజేతలకు అరోరా కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ బి.విశ్వనాథం ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ ప్రొఫెసర్ వి.సత్యనారాయణ, ఇంటర్ కాలేజి టోర్నీ సెక్రటరీప్రొఫెసర్ బి.సునీల్ కుమార్, సీనియర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లెక్చరర్ జయపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాల్ బ్యాడ్మింటన్ చాంప్ అరోరా
Published Sat, Jan 25 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
Advertisement
Advertisement