osmania univeristy
-
ప్రవేశాలు
పండిత్ దీన్‌దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ పండిత్ దీన్‌దయాల్ పెట్రోలియం యూనివర్సిటీ, గుజరాత్ కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. బీటెక్: పెట్రోలియం/ఎలక్ట్రికల్/మెకానికల్/ఇండస్ట్రియల్/కెమికల్/ సివిల్ ఇంజనీరింగ్ అర్హత: జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా ఎంటెక్ (ఫుల్ టైం), పీహెచ్డీ (ఫుల్ టైం/పార్ట్ టైం) వెబ్సైట్: www.pdpu.ac.in బీకాం (హానర్స్) కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ బీకాం (హానర్స్) కామన్ ఎంట్రెన్స్ టెస్ట్- 2014 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కోర్సు: బీకాం (హానర్స్) వ్యవధి: మూడేళ్లు అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశ పరీక్ష తేది: జూన్ 12 దరఖాస్తులకు చివరి తేది: జూన్ 9 వెబ్సైట్: www.osmania.ac.in నేషనల్ లా స్కూల్ నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. మాస్టర్ ఆఫ్ బిజినెస్ లాస్ (ఎంబీఎల్) :రెండేళ్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్( ఏడాది) విభాగాలు: హ్యూమన్ రైట్స్ లా మెడికల్ లా అండ్ ఎథిక్స్ ఎన్విరాన్మెంటల్ లా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లా చైల్డ్ రైట్స్ లా, కన్జ్యూమర్ లా అండ్ ప్రాక్టీస్ సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్ అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత దరఖాస్తులకు చివరి తేది: జూలై 30 వెబ్సైట్: http://ded.nls.ac.in -
ఓయూ మహిళల టెన్నిస్ జట్టుకు కాంస్యం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో ఉస్మానియా యూనివర్సిటీ జట్టు కాంస్య పతకం సాధించింది. నాసిక్‌లోని మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌లో ఇటీవల ఈ పోటీలు జరిగాయి. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఓయూ జట్టు 2-0 తో పంజాబ్ యూనివర్సిటీ జట్టుపై విజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో అనుష్క భార్గవ 6-3, 6-2తో దివిజపై విజయం సాధించింది. రెండో సింగిల్స్‌లో శాంభవి దీక్షిత్ 6-4, 5-7, 6-4 స్కోరుతో అభిలాష (ఢిల్లీ వర్సిటీ)పై గెలిచింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఓయూ జట్టు 2-0తో మద్రాస్ యూనివర్సిటీ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో ఓయూ జట్టు 2-0తో పుణే వర్సిటీపై గెలిచింది. -
బాల్ బ్యాడ్మింటన్ చాంప్ అరోరా
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి పురుషుల బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్‌ను అరోరా కాలేజి జట్టు చేజిక్కించుకుంది. ఓయూ గ్రౌండ్స్‌లో జరిగిన ఫైనల్లో అరోరా కాలేజి జట్టు 40-14తో సునాయాసంగా ఓయూ టెక్నాలజీ కాలేజి జట్టుపై ఘనవిజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో సైఫాబాద్ ఓయూ పీజీ సైన్స్ కాలేజి జట్టు 29-11తో ఓయూ కామర్స్ కాలేజి జట్టుపై విజయం సాధించింది. అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో అరోరా కాలేజి 40-3తో ఓయూ పీజీ సైన్స్ కాలేజిపై, ఓయూ టెక్నాలజీ కాలేజి 40-11తో ఓయూ కామర్స్ కాలేజిపై గెలిచాయి. ఈ పోటీల విజేతలకు అరోరా కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ బి.విశ్వనాథం ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ ప్రొఫెసర్ వి.సత్యనారాయణ, ఇంటర్ కాలేజి టోర్నీ సెక్రటరీప్రొఫెసర్ బి.సునీల్ కుమార్, సీనియర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లెక్చరర్ జయపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.