ఓయూ మహిళల టెన్నిస్ జట్టుకు కాంస్యం | ou ladies tennis team won bronze | Sakshi
Sakshi News home page

ఓయూ మహిళల టెన్నిస్ జట్టుకు కాంస్యం

Published Tue, Feb 11 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM

ఓయూ మహిళల టెన్నిస్ జట్టుకు కాంస్యం

ఓయూ మహిళల టెన్నిస్ జట్టుకు కాంస్యం

 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ మహిళల టెన్నిస్ టోర్నమెంట్‌లో ఉస్మానియా యూనివర్సిటీ జట్టు కాంస్య పతకం సాధించింది. నాసిక్‌లోని మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌లో ఇటీవల ఈ పోటీలు జరిగాయి. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఓయూ జట్టు 2-0 తో పంజాబ్ యూనివర్సిటీ జట్టుపై విజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో అనుష్క భార్గవ 6-3, 6-2తో దివిజపై విజయం సాధించింది. రెండో సింగిల్స్‌లో శాంభవి  దీక్షిత్ 6-4, 5-7, 6-4 స్కోరుతో అభిలాష (ఢిల్లీ వర్సిటీ)పై గెలిచింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఓయూ జట్టు 2-0తో మద్రాస్ యూనివర్సిటీ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో ఓయూ జట్టు 2-0తో పుణే వర్సిటీపై గెలిచింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement