అండర్-13 బ్యాడ్మింటన్ చాంప్ అనురాగ్ | Anurag won under-13 badminton champion | Sakshi
Sakshi News home page

అండర్-13 బ్యాడ్మింటన్ చాంప్ అనురాగ్

Published Sat, May 31 2014 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM

Anurag won under-13 badminton champion

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రైజ్‌మనీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో అండర్-13 బాలుర సింగిల్స్ టైటిల్‌ను కె.అనురాగ్ కైవసం చేసుకున్నాడు. మెదక్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందానగర్‌లోని జీహెచ్‌ఎంసీ పీజేఆర్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన అండర్-13 బాలుర సింగిల్స్ ఫైనల్లో కె.అనురాగ్ 3-1తో కె.సాయి చరణ్‌పై విజయం సాధించాడు. విజేతలకు సంగారెడ్డి కోర్టు మెజిస్ట్రేట్ డి.దుర్గాప్రసాద్, సంగారెడ్డి ఎమ్మెల్యే జి.మహిపాల్ రెడ్డి ట్రోఫీలను అందజేశారు.
 
 అండర్-10 బాలుర సింగిల్స్: 1.జి.ప్రణవ్ రావు, 2.స్వాతిక్ రెడ్డి. డబుల్స్: 1.జి.ప్రణవ్ రావు, ఎ.పి.రవితేజ జోడి, 2.వి.ఎస్.ఎస్.సందేష్, స్వాతిక్‌రెడ్డి జోడి. అండర్-15 బాలుర సింగిల్స్: 1.నవనీత్(మెదక్), 2.కె.ప్రశాంత్(ఖమ్మం).అండర్-15 బాలికల సింగిల్స్: 1.కె.ప్రీతి, 2.కె.భార్గవి. డబుల్స్: 1.కె.ప్రీతి, బి.సుప్రియ జోడి. 2.కె.భార్గవి, ఎ.అభిలాష జోడి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement