under-13
-
అండర్–13 ఫుట్‌బాల్ విజేత గుత్తి టౌన్
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అండర్–13 బాలుర ఫుట్‌బాల్ విజేతగా గుత్తి టౌన్ జట్టు నిలిచింది. స్థానిక అనంత క్రీడా మైదానంలో శనివారం జరిగిన అండర్–13 ఫుట్‌బాల్ జిల్లాస్థాయి టోర్నీలో గుత్తి టౌన్ జట్టు కొనకొండ్ల జట్టును 4–0తో ఓడించి విజేతగా నిలిచింది. గుత్తి టౌన్ జట్టులో వినయ్ అనే క్రీడాకారుడు హ్యాట్రిక్ గోల్స్ సాధించి జట్టు విజయానికి కీలకంగా నిలిచాడు. మరో క్రీడాకారుడు సుభాష్–1 గోల్ చేశాడు. దీంతో అండర్–13 ఫుట్‌బాల్ బాలుర విజేతగా గుత్తి టౌన్ జట్టు నిలిచింది. గుత్తి రైల్వే జట్టు అండర్–19 బాలుర ట్రోఫీని ఈ నెల 18న జరిగిన అండర్–19 ఫైనల్లో హిందూపురం జట్టును ఓడించి విజేతగా నిలిచింది. దీంతో ఫుట్‌బాల్‌కు గుత్తి జట్లు తమ సత్తాను చాటాయి. స్కోరు వివరాలు : మొదటి సెమీస్‌లో గుత్తి టౌన్, అనంతపురం అకాడమీ జట్లు తలపడ్డాయి. గుత్తి టౌన్ జట్టు 3–2తో అనంతపురం అకాడమీ జట్టును ఓడించి ఫైనల్‌కు చేరింది. జట్టులో సుభాష్–3 గోల్స్ సాధించాడు. అకాడమీ క్రీడాకారుడు బాషా–2 గోల్స్ సాధించాడు. రెండవ సెమీస్‌లో ధర్మవరం, కొనకొండ్ల జట్లు తలపడ్డాయి. కొనకొండ్ల జట్టు 5–1తో విజయం సాధించింది. జట్టులో కళ్యాణ్–5 గోల్స్ సాధించారు. ధర్మవరం జట్టుకు చెందిన క్రీడాకారుడు తేజ–1 గోల్ సాధించారు. క్రీడలను ఆస్వాదించండి : క్రీడలను ఆస్వాదించడం ద్వారా ఉన్నతమైన ఆటతీరును ప్రదర్శించండని సీనియర్ జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు గంగాధర్ తెలిపారు. అనంత క్రీడా మైదానంలో జరిగిన ఫుట్‌బాల్ టోర్నీ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో భాస్కర్‌రెడ్డి, స్పెయిన్ కోచ్ జోర్డీ, ఆనంద్‌రెడ్డి, విజయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
చెస్ చాంపియన్‌షిప్ ఎంపిక
విజయవాడ స్పోర్ట్స్ : అహ్మదాబాద్(గుజరాత్)లో ఈనెల 22 నుంచి 30 వ తేదీ వరకు నిర్వహించే జాతీయ అండర్–13 బాలుర చెస్ చాంపియన్‌షిప్ ఏపీ జట్టుకు జె.అక్షిత్‌కుమార్, బీజేఎస్‌కే రణధీర్ ఎంపికయ్యారు. గ్లోబల్ చెస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న వీరిద్దరూ గత నెల మూడు నుంచి ఐదో తేదీ వరకు రాజమండ్రిలో ఏపీ చెస్ చాంపియన్‌షిప్‌లో వరుసగా మొదట రెండు స్థానాలు కైవసం చేసుకున్నారు. జె.అక్షిత్‌కుమార్ ప్రస్తుతం నొయిడా నేషనల్æప్రీమియం చెస్ టోర్నీ ఆడుతున్నాడు. జట్టులో బీజేఎస్‌కే రణధీర్ బుధవారం అహ్మదాబాద్‌కు పయనమయ్యాడు. గ్లోబల్ చెస్ అకాడమీలో బుధవారం రణధీర్‌ను గ్లోకల్ టెక్నాలజీస్ సీఈఓ తరుణ్ కాకాని అభినందించి నగదు బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో గ్లోబల్ చెస్ అకాడమీ అధ్యక్ష, కార్యదర్శులు కె.రాజేంద్ర, ఎస్కే ఖాసీం, ఏపీ చెస్ అసోసియేషన్ కార్యదర్శి డి.శ్రీహరి పాల్గొన్నారు. -
అండర్-13 బ్యాడ్మింటన్ చాంప్ అనురాగ్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రైజ్‌మనీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అండర్-13 బాలుర సింగిల్స్ టైటిల్‌ను కె.అనురాగ్ కైవసం చేసుకున్నాడు. మెదక్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందానగర్‌లోని జీహెచ్ఎంసీ పీజేఆర్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన అండర్-13 బాలుర సింగిల్స్ ఫైనల్లో కె.అనురాగ్ 3-1తో కె.సాయి చరణ్‌పై విజయం సాధించాడు. విజేతలకు సంగారెడ్డి కోర్టు మెజిస్ట్రేట్ డి.దుర్గాప్రసాద్, సంగారెడ్డి ఎమ్మెల్యే జి.మహిపాల్ రెడ్డి ట్రోఫీలను అందజేశారు. అండర్-10 బాలుర సింగిల్స్: 1.జి.ప్రణవ్ రావు, 2.స్వాతిక్ రెడ్డి. డబుల్స్: 1.జి.ప్రణవ్ రావు, ఎ.పి.రవితేజ జోడి, 2.వి.ఎస్.ఎస్.సందేష్, స్వాతిక్‌రెడ్డి జోడి. అండర్-15 బాలుర సింగిల్స్: 1.నవనీత్(మెదక్), 2.కె.ప్రశాంత్(ఖమ్మం).అండర్-15 బాలికల సింగిల్స్: 1.కె.ప్రీతి, 2.కె.భార్గవి. డబుల్స్: 1.కె.ప్రీతి, బి.సుప్రియ జోడి. 2.కె.భార్గవి, ఎ.అభిలాష జోడి.