అండర్‌–13 ఫుట్‌బాల్‌ విజేత గుత్తి టౌన్‌ | under-13 football winner gooty town | Sakshi
Sakshi News home page

అండర్‌–13 ఫుట్‌బాల్‌ విజేత గుత్తి టౌన్‌

Published Sat, Jan 21 2017 10:32 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

అండర్‌–13 ఫుట్‌బాల్‌ విజేత గుత్తి టౌన్‌ - Sakshi

అండర్‌–13 ఫుట్‌బాల్‌ విజేత గుత్తి టౌన్‌

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : అండర్‌–13 బాలుర ఫుట్‌బాల్‌ విజేతగా గుత్తి టౌన్‌ జట్టు నిలిచింది. స్థానిక అనంత క్రీడా మైదానంలో శనివారం జరిగిన అండర్‌–13 ఫుట్‌బాల్‌ జిల్లాస్థాయి టోర్నీలో గుత్తి టౌన్‌ జట్టు కొనకొండ్ల జట్టును 4–0తో ఓడించి విజేతగా నిలిచింది. గుత్తి టౌన్‌ జట్టులో వినయ్‌ అనే క్రీడాకారుడు హ్యాట్రిక్‌ గోల్స్‌ సాధించి జట్టు విజయానికి కీలకంగా నిలిచాడు. మరో క్రీడాకారుడు సుభాష్‌–1 గోల్‌ చేశాడు. దీంతో అండర్‌–13 ఫుట్‌బాల్‌ బాలుర విజేతగా గుత్తి టౌన్‌ జట్టు నిలిచింది. గుత్తి రైల్వే జట్టు అండర్‌–19 బాలుర ట్రోఫీని ఈ నెల 18న జరిగిన అండర్‌–19 ఫైనల్‌లో హిందూపురం జట్టును ఓడించి విజేతగా నిలిచింది. దీంతో ఫుట్‌బాల్‌కు గుత్తి జట్లు తమ సత్తాను చాటాయి.  

స్కోరు వివరాలు :  మొదటి సెమీస్‌లో గుత్తి టౌన్, అనంతపురం అకాడమీ జట్లు తలపడ్డాయి. గుత్తి టౌన్‌ జట్టు 3–2తో అనంతపురం అకాడమీ జట్టును ఓడించి ఫైనల్‌కు చేరింది. జట్టులో సుభాష్‌–3 గోల్స్‌ సాధించాడు. అకాడమీ క్రీడాకారుడు బాషా–2 గోల్స్‌ సాధించాడు. రెండవ సెమీస్‌లో ధర్మవరం, కొనకొండ్ల జట్లు తలపడ్డాయి. కొనకొండ్ల జట్టు 5–1తో విజయం సాధించింది. జట్టులో కళ్యాణ్‌–5 గోల్స్‌ సాధించారు. ధర్మవరం జట్టుకు చెందిన క్రీడాకారుడు తేజ–1 గోల్‌ సాధించారు.  

క్రీడలను ఆస్వాదించండి :  క్రీడలను ఆస్వాదించడం ద్వారా ఉన్నతమైన ఆటతీరును ప్రదర్శించండని సీనియర్‌ జాతీయ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు గంగాధర్‌ తెలిపారు. అనంత క్రీడా మైదానంలో జరిగిన ఫుట్‌బాల్‌ టోర్నీ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన, జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో భాస్కర్‌రెడ్డి, స్పెయిన్‌ కోచ్‌ జోర్డీ, ఆనంద్‌రెడ్డి, విజయ్‌భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement