గుజరాత్ చేతిలో ఓడినా... | Hyderabad team to reach the quarter-finals | Sakshi
Sakshi News home page

గుజరాత్ చేతిలో ఓడినా...

Published Sat, Aug 23 2014 1:30 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM

Hyderabad team to reach the quarter-finals

క్వార్టర్ ఫైనల్‌కు చేరిన హైదరాబాద్
చెన్నై: ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం ముగిసిన మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో 72 పరుగుల తేడాతో హైదరాబాద్ పరాజయం పాలైంది. అయితే లీగ్ దశలో తొలి రెండు మ్యాచ్‌లు (టీఎన్‌సీఏ సిటీ ఎలెవన్, ముంబైలపై) నెగ్గడంతో నాకౌట్ అవకాశం దక్కించుకుంది. ఆదివారం జరిగే  క్వార్టర్ ఫైనల్లో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ డిస్ట్రిక్ ఎలెవన్‌తో హైదరాబాద్ తలపడుతుంది.
 
వరుసగా  రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఉత్సాహం మీదున్న హైదరాబాద్, గుజరాత్ ముందు తలవంచింది. 306 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో... ఓవర్‌నైట్ స్కోరు 33/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన అక్షత్ బృందం 61.2 ఓవర్లలో 233 పరుగులకే కుప్పకూలింది. ఆశిష్ రెడ్డి (54), కొల్లా సుమంత్ (51) అర్ధ సెంచరీలు చేయగా, ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో ప్రాంజల్ సుతాలియా 86 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement