
బార్సిలోనా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్) జంట క్వార్టర్ ఫైనల్లో ఓడింది. డబుల్స్ క్వార్టర్స్‌లో బోపన్న–వాసెలిన్ ద్వయం 6–4, 6–7 (9/11), 11–13తో ‘సూపర్ టైబ్రేక్’లో కబాల్–రాబర్ట్ ఫరా (కొలంబియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. బోపన్న జోడీకి 20,540 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 16 లక్షల 74 వేలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగం రెండో రౌండ్‌లో మాజీ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) 2–6, 6–1, 3–6తో క్వాలిఫయర్ క్లిజాన్ (స్లొవేకియా) చేతిలో ఓటమి చవిచూశాడు.
Comments
Please login to add a commentAdd a comment