
థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్ చేరింది. గురువారం బ్యాంకాక్‌లో జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–16, 21–14తో యిప్ పుయ్ యిన్ (హాంకాంగ్)పై గెలిచింది.
పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్, ప్రణయ్ ఓడిపోగా... డబుల్స్‌లో మను అత్రి–సుమీత్ రెడ్డి జంట, మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జోడీలు ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాయి. శుక్రవారం జరుగనున్న క్వార్టర్స్‌లో సోనియా చెహ్ (మలేసియా)తో సింధు తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment