క్వార్టర్స్‌లో హంపి | Koneru Humpy in pre-quarters of World Women Chess | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో హంపి

Published Wed, Mar 25 2015 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 PM

క్వార్టర్స్‌లో హంపి

క్వార్టర్స్‌లో హంపి

సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అలీసా గలియమోవా (రష్యా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో హంపి 2-0తో గెలిచింది. మంగళవారం జరిగిన రెండో గేమ్ లో హంపి 53 ఎత్తుల్లో విజయం సాధించింది. ఈ టోర్నీలో హంపికిది వరుసగా ఆరో గెలుపు కావడం విశేషం.

ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మాత్రం ప్రిక్వార్టర్స్ రెండో గేమ్‌లో అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) చేతిలో 51 ఎత్తుల్లో ఓడిపోయింది. ఫలితంగా వీరిద్దరూ 1-1తో సమఉ జ్జీగా నిలిచారు. దాంతో ఈ ఇద్దరి మధ్య బుధవారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement