
Australian Open 2023: మహిళల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) కథ ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ప్రపంచ 45వ ర్యాంకర్ మగ్దా లినెట్టి (పోలాండ్) 7–6 (7/3), 6–4తో గార్సియాను ఓడించింది. ఈ గెలుపుతో 30 ఏళ్ల మగ్దా లినెట్టి తన 30వ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది.
ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఐదో సీడ్ సబలెంకా (బెలారస్) 7–5, 6–2తో 12వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్)పై, డొనా వెకిచ్ (క్రొయేషియా) 6–2, 1–6, 6–3తో ఫ్రువిర్తోవా (చెక్ రిపబ్లిక్)పై, 30వ సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–0, 6–4తో షుయె జాంగ్ (చైనా)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు.
చదవండి: KL Rahul- Athiya Shetty: చూడచక్కని జంట.. దిష్టి తగలకూడదు! కోహ్లి, సూర్య విషెస్! రిసెప్షన్ ఎప్పుడంటే..
SA20 2023: ఐపీఎల్‌లో నిరాశపరిచినా.. ఆ లీగ్‌లో మాత్రం దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్