హోరాహోరీగా బ్యాడ్మింటన్ మ్యాచ్‌లు | sucessful badminton matches | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా బ్యాడ్మింటన్ మ్యాచ్‌లు

Published Sun, Feb 9 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM

sucessful badminton matches

కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : కడప నగరంలోని వైఎస్‌ఆర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆలిండియా బ్యాడ్మింటన్ సబ్‌జూనియర్ ర్యాంకింగ్ పోటీల్లో మెయిన్‌డ్రాకు చేరుకున్న క్రీడాకారుల మధ్య పోరు హోరా హోరీగా సాగుతోంది. శనివారం నిర్వహించిన ప్రీ క్వార్టర్, క్యార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఉత్కంఠను లేపుతూ క్రీడాభిమానులకు కనువిందుచేస్తోంది. మొత్తం 64 మ్యాచ్‌లు నిర్వహించగా సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో 32 మంది క్రీడాకారులు సెమీఫైనల్‌లోకి ప్రవేశించారు. కాగా కడప క్రీడాకారుడు దత్తాత్రేయరెడ్డి 3వ సీడెడ్ క్రీడాకారుడు ఆర్జిత్ చేతిలో ఓటమి చవిచూశాడు. గట్టిపోటీ ఇచ్చినప్పటికీ విజయం అందుకోలేకపోయాడు. కాగా పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రి గోపీచంద్ సింగిల్స్ విభాగంలో క్వార్ట్‌ర్ ఫైనల్లో 3వ ర్యాంకు క్రీడాకారిణి రిచాముక్తిబోధ్ చేతిలో ఓటమి చవిచూసిన్పటికీ డబుల్స్ విభాగంలో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. అంతర్జాతీయ క్రీడాకారుడు లక్ష్యసేన్ ఏపీకి చెందిన జగదీష్‌పై విజయం సాధించాడు.
 
 క్వార్టర్ ఫైనల్ విజేతల వివరాలు..
 అండర్ 13 డబుల్స్ బాలికల విభాగం : ఆర్.ముక్తిబోధ్ (కర్నాటక), సిమ్రాన్‌సింగ్, (మహారాష్ట్ర) వి. జక్కా, పుల్లెల గాయత్రి గోపీచంద్ (ఏపీ), దీత్యాజగదీష్, మేధాశశిధరన్ (కర్నాటక), జోషిదివ్యాన్షి, షిఫెయిల్ గౌతం (ఉత్తరఖండ్).
 
 అండర్ 13 డబుల్స్ బాలుర విభాగం : ఎస్.మదీన (ఏపీ), ఎం.మైరభ (మణిపూర్), బి.రితిన్, మణిదీప్ (ఏపీ), ఎస్.కర్రిషణ్ముకఅంజన్, పి.రాజ్‌వత్, చయంతిజోష్(ఉత్తరఖండ్), వికాస్‌యాదవ్ (ఢిల్లీ).
 
 అండర్ 15 డబుల్స్ బాలికల విభాగం : అశ్వినిభట్, మిథుల (కర్నాటక), రియాఅరోల్కర్, పుర్వబార్వే (మహారాష్ట్ర), ఉన్నతిబిషాట్(ఉత్తరఖండ్), చిమ్రాన్‌కలిత(అస్సాం), షబానాబేగం, కె. ప్రీతి (ఏపీ).
 
 అండర్ 15 డబుల్స్ బాలుర విభాగం : కె. గుల్షన్‌కుమార్ (ఢిల్లీ), లక్ష్యసేన్ (ఉత్తరఖండ్), జశ్వంత్ (ఏపీ), ధరువ్‌కపిల (పంజాబ్), గౌస్‌షేక్, బషీర్ సయ్యద్ (ఏపీ), కృష్ణప్రసాద్, సాత్విక్‌సాయిరాజ్ (ఏపీ).
 
 అండర్ 13 సింగిల్స్ బాలికల విభాగం : సిమ్రాన్‌సింగ్ (మహారాష్ట్ర), రిచాముక్తబోధ్ (కర్నాటక), తనిష్కదేశ్‌పాండే (మహారాష్ట్ర), నిషితావర్మ (ఏపీ).
 
 అండర్ 13 సింగిల్స్ బాలుర విభాగం : మైశ్నమ్ మైరభ (మణిపూర్), వరుణ్‌దేవ్ (మహారాష్ట్ర), బి.రితిన్ (ఏపీ), సాయి కర్రి షణ్ముఖఅంజన్ (ఏపీ).
 
 అండర్ 15 సింగిల్స్ బాలికల విభాగం : పూజ దవ్‌లేకర్ (మహారాష్ట్ర), పూర్వాబార్వే (మహారాష్ర్ట), రియాఅరోల్కర్ (మహారాష్ట్ర), కె. అశ్వినిభట్ (కర్నాటక)
 అండర్ 15 సింగిల్స్ బాలుర విభాగం : కార్తికేయ గుల్షన్‌కుమార్ (ఢిల్లీ), లక్ష్యసేన్ (ఉత్తరఖండ్), ఆర్జిత్ చలిహ (అస్సాం), రాహుల్ భరద్వాజ్ (కర్నాటక).
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement