
టీమిండియా విధ్వంసకర బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌పై ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా రేపు (నవంబర్ 10) భారత్‌తో జరుగబోయే సెమీస్ సమరానికి ముందు ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో టీమిండియాతో జరిగిన ఓ మ్యాచ్‌లో సూర్యకుమార్ ఊచకోతను గుర్తు చేసుకుంటూ బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
ఈ ఏడాది మొదట్లో ఇంగ్లండ్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో తన తొలి టీ20 సెంచరీ బాదిన సూర్య.. ఆ మ్యాచ్‌లో తనను చంపేశాడని, నాటి భయానక ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో శివాలెత్తిన సూర్యకుమార్.. తనను మరే బ్యాటర్ భయపెట్టని విధంగా భయపెట్టాడని అన్నాడు. అదృష్టవశాత్తు అతను అలసిపోయి తన బౌలింగ్‌లోనే ఔట్ కావడంతో ఊపరిపీల్చుకున్నానని తెలిపాడు.
ఆ మ్యాచ్‌లో సూర్యకుమార్ ఆడిన షాట్లు అత్యద్భుతమని, క్రికెట్‌లో తాను చూసిన షాట్లలో అవే అత్యుత్తమమని, ఇప్పటికీ అవి తన కళ్లముందే మెదులుతున్నాయని పేర్కొన్నాడు. ఆ ఇన్నింగ్స్ తర్వాతే తనకు సూర్యకుమార్ అంటే ఏంటో అర్ధమైందని, ఇప్పుడు అతనింకా రాటుదేలాడని, ప్రస్తుతం అతను ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 ఆటగాడని కొనియాడాడు.
ఒక్కసారి అతను క్రీజ్‌లో కుదురుకున్నాక బౌలింగ్ చేయడం ఎంతటి బౌలర్‌కైనా చాలా కష్టమని, క్రికెట్ చరిత్రలో ఇలా బౌలర్లను భయపెట్టే బ్యాటర్లలో సూర్యకుమార్ ముందు వరుసలో ఉంటాడని ఆకాశానికెత్తాడు. ఏబీడీ తర్వాత మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ అన్న పేరుకు సూర్యకుమార్ వంద శాతం అర్హుడని, రేపు తమతో జరుబోయే సెమీస్ మ్యాచ్‌లో అతను శాంతంగా ఆడాలని ఆశిస్తున్నానని అన్నాడు. సెమీస్‌లో టీమిండియానే ఫేవరెట్ అయినప్పటికీ.. అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగే తమను తక్కువ అంచనా వేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు.
చదవండి: '360 డిగ్రీస్' రహస్యం చెప్పేసిన సూర్యకుమార్
Comments
Please login to add a commentAdd a comment