T20 WC 2024: ఇంగ్లండ్‌పై ఘ‌న విజ‌యం.. ఫైన‌ల్‌కు టీమిండియా| T20 World Cup 2024 Semi-Final: India Vs England Match Live Score, Updates, And Highlights | Sakshi
Sakshi News home page

T20 WC 2024: ఇంగ్లండ్‌పై ఘ‌న విజ‌యం.. ఫైన‌ల్‌కు టీమిండియా

Published Thu, Jun 27 2024 7:37 PM | Last Updated on Fri, Jun 28 2024 1:42 AM

T20 WC 2024: India vs England 2nd  Semi final Live Updates

 India vs England 2nd  Semi final Live Updates: 

ఫైన‌ల్‌కు టీమిండియా

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 ఫైన‌ల్లో టీమిండియా అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా గ‌యానా వేదిక‌గా జ‌రిగిన సెమీఫైన‌ల్లో ఇంగ్లండ్‌ను 68 ప‌రుగుల తేడాతో చిత్తు చేసిన భార‌త జ‌ట్టు.. తమ ఫైన‌ల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ విజ‌యంతో గ‌త టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్ ఓట‌మికి భార‌త్ బ‌దులు తీర్చుకుంది. 

ఈ మ్యాచ్‌లో భార‌త్ ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 171 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లి, రిష‌బ్ పంత్ ఆరంభంలోనే ఔటైన‌ప్ప‌టికి కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(57), సూర్య‌కుమార్ యాద‌వ్‌(47) అద్బుతమైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు.

ఆఖ‌రిలో హార్దిక్ పాండ్యా(23), జ‌డేజా(17), అక్ష‌ర్ ప‌టేల్‌(10) కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ర‌షీద్‌, అర్చ‌ర్‌, టాప్లీ, కుర్రాన్ త‌లా వికెట్ సాధించారు.

తిప్పేసిన స్పిన్న‌ర్లు..

అనంత‌రం 172 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త బౌల‌ర్ల దాటికి 103 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. భార‌త బౌల‌ర్ల‌లో స్పిన్న‌ర్లు కుల్దీప్ యాద‌వ్‌, అక్ష‌ర్ ప‌టేల్ తిప్పేశారు. అక్ష‌ర్ ప‌టేల్‌, కుల్దీప్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్టి ఇంగ్లండ్ ప‌త‌నాన్ని శాసించాడు. వీరితో పాటు జ‌స్ప్రీత్ బుమ్రా రెండు కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో హ్యారీ బ్రూక్‌(25) పరుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఇక జూన్ 29న బార్బోడ‌స్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికాతో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది.జ‌
 

ఆరో వికెట్ డౌన్‌..
68 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 25 ప‌రుగులు చేసిన హ్యారీ బ్రూక్‌.. కుల్దీప్ యాద‌వ్ క్లీన్ బౌల్డ‌య్యాడు. 11 ఓవ‌ర్ల‌కు ఇంగ్లండ్ స్కోర్: 68/6
49 ప‌రుగుల‌కే 5 వికెట్లు.. క‌ష్టాల్లో ఇంగ్లండ్‌
49 ప‌రుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఐదో వికెట్‌గా సామ్ కుర్రాన్ వెనుదిరిగాడు. కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో ఎల్బీగా కుర్రాన్ పెవిలియ‌న్‌కు చేరాడు.

ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్..
ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో జానీ బెయిర్ స్టో(0) క్లీన్ బౌల్డ‌య్యాడు. క్రీజులోకి హ్యారీ బ్రూక్ వ‌చ్చాడు. 7 ఓవ‌ర్ల‌కు ఇంగ్లండ్ మూడు వికెట్ల‌ న‌ష్టానికి 46 ప‌రుగులు చేసింది.

రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్‌..
172 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 5 ప‌రుగులు చేసిన ఫిల్ సాల్ట్‌.. జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్‌..
172 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 23 ప‌రుగులు చేసిన జోస్  బ‌ట్ల‌ర్‌.. అక్ష‌ర్ పటేల్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 4 ఓవ‌ర్ల‌కు ఇంగ్లండ్ వికెట్ న‌ష్టానికి 33 ప‌రుగులు చేసింది.

అద‌ర‌గొట్టిన రోహిత్, సూర్య‌.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
ఇంగ్లండ్‌తో సెకెండ్ సెమీఫైన‌ల్లో టీమిండియా బ్యాటింగ్లో అద‌ర‌గొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌తత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 171 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో రోహిత్ శ‌ర్మ‌(57) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. సూర్య‌కుమార్ యాద‌వ్‌(47), హార్దిక్ పాండ్యా(23) కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ర‌షీద్‌, అర్చ‌ర్‌, టాప్లీ, కుర్రాన్ త‌లా వికెట్ సాధించారు.

ఒకే ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు..
వ‌రుస క్ర‌మంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 18వ ఓవ‌ర్ వేసిన జోర్డాన్ బౌలింగ్‌లో తొలుత హార్దిక్ పాండ్యా(23) ఔట్ కాగా.. అనంత‌రం శివ‌మ్ దూబే(0) పెవిలియ‌న్‌కు చేరాడు. 18 ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త్ 6 వికెట్ల న‌ష్టానికి 147 ప‌రుగులు చేసింది.

సూర్యకుమార్ ఔట్‌...
124 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 47 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్‌.. అర్చర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.  17 ఓవర్లకు భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉన్నారు.

రోహిత్‌ శర్మ ఔట్‌..
టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. 57 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ.. అదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

రోహిత్ శ‌ర్మ హాఫ్ సెంచ‌రీ..
13 ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త్ రెండు వికెట్లు కోల్పోయి 110 ప‌రుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. రోహిత్ శ‌ర్మ‌(56), సూర్య‌కుమార్ యాద‌వ్‌(39) ప‌రుగుల‌తో ఉన్నారు.
10 ఓవ‌ర్ల‌కు భార‌త్ స్కోర్: 77/2
మ్యాచ్ తిరిగి మ‌ళ్లీ ఆరంభ‌మైంది. 10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి టీమిండియా 2 వికెట్ల న‌ష్టానికి 77 ప‌రుగులు చేసింది. క్రీజులో రోహిత్ శ‌ర్మ‌(41), సూర్య‌కుమార్ యాద‌వ్‌(21) ప‌రుగుల‌తో ఉన్నారు.

వర్షం అంతరాయం..
గయానా వేదికగా ఇంగ్లండ్‌-భారత్ మధ్య జరుగుతున్న సెకెండ్ సెమీఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మ్యచ్ నిలిచిపోయే సమయానికి టీమిండియా 8 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్‌(13), రోహిత్ శర్మ(37) పరుగులతో ఉన్నారు.

రెండో వికెట్‌ డౌన్‌
40 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రిషబ్‌ పంత్‌.. సామ్‌ కుర్రాన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.  6 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌ శర్మ(26), సూర్యకుమార్‌ యాదవ్‌(5) పరుగులతో ఉన్నారు.

తొలి వికెట్‌ డౌన్‌.. కోహ్లి ఔట్‌
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. టాప్లీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు. 3 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది.

తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌..
సెకెండ్‌ సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు ఎటువంటి  మార్పులు లేకుండా బ‌రిలోకి దిగాయి. ఈ మ్యాచ్‌ రాత్రి 9.15 గంటలకు ప్రారంభం కానుంది.

తుది జ‌ట్లు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా

ఇంగ్లండ్ : ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీప‌ర్‌), జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ

అభిమానులకు గుడ్‌ న్యూస్‌
అభిమానుల‌కు గుడ్ న్యూస్. గ‌యానాలో ఎండ కాస్తోంది. క‌వ‌ర్స్‌ను పూర్తిగి తొలిగించారు. భారత ప్లేయర్లు మైదానంలోకి వచ్చి ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అంపైర్లు 8.30 గంటలకు మైదానం, పిచ్‌ను పరిశీలిస్తారు.

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో రెండో సెమీఫైన‌ల్‌కు స‌మ‌యం అస‌న్న‌మైంది. సెకెండ్ సెమీస్‌లో భాగంగా గ‌యానా వేదిక‌గా  భార‌త్‌-ఇంగ్లండ్ జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి. ఈ మ్యాచ్‌కు వ‌రుణుడు అడ్డంకిగా నిలిచాడు.

ప్ర‌స్తుతం వ‌ర్షం అగిన‌ప్ప‌ట‌కి.. పిచ్‌ను క‌వ‌ర్ల‌తో క‌ప్పి ఉంచారు. అయితే గ‌త రాత్రి నుంచి భారీ వ‌ర్షం కురుస్తుండ‌డంతో మైదానం ఔట్ ఫీల్డ్ చిత్త‌డిగా మారింది. మైదానాన్ని సిద్ధం చేసేందుకు గ్రౌండ్ స్టాప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంకా పిచ్ సిద్దం కాక‌పోవ‌డంతో టాస్ ఆల‌స్యం కానుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement