టీ20 వరల్డ్‌కప్-2024లో ఇంగ్లండ్-భారత్ సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు ఒక యాదృచిక సంఘటన అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ గణాంకాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఇద్దరి స్టాట్స్ సరిగ్గా ఒకేలా ఉన్నాయి. రోహిత్ ప్రస్తుత వరల్డ్‌కప్‌లో 6 మ్యాచ్‌లు ఆడి 159.9 స్ట్రైక్ రేటుతో 191 పరుగులు చేయగా.. బట్లర్ కూడా సరిగ్గా స్ట్రైక్ రేటుతో 191 పరుగులు చేశాడు. అంతేకాకుండా వారిద్దరూ ఎదుర్కొన్న బంతులు కూడా సమనంగా ఉండటం గమనార్హం.
రోహిత్ 120 బంతులు ఎదుర్కొగా..బట్లర్ సైతం 120 బంతులే ఆడాడు. ఇవే కాక మరి కొన్ని గణంకాలు ఫ్యాన్స్‌ను అబ్బురపరుస్తున్నాయి. ఈ ఏడాది టీ20ల్లో రోహిత్, బట్లర్ ఇద్దరూ సరిగ్గా 9 మ్యాచ్‌లు ఆడి.. చెరో 192 బంతులు ఎదుర్కొన్నారు.
అదేవిధంగా ఇద్దరూ ఈ ఏడాది టీ20ల్లో 2 సార్లు నాటౌట్‌గా నిలిచి రెండు హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులు నిజంగా ఒక అద్బుతమంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. కాగా భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment