
Duleep Trophy 2023- South Zone vs North Zone, 2nd Semi-Final- బెంగళూరు: సౌత్‌జోన్ సీమర్ వైశాక్ విజయ్‌కుమార్ (5/76) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో నార్త్‌జోన్‌ను కూల్చేశాడు. దీంతో దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో నార్త్‌జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 56.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది.
ఓవర్‌నైట్ స్కోరు 51/2తో శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన నార్త్ జట్టు 160 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (63; 11 ఫోర్లు), హర్షిత్ రాణా (38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
మూడు పరుగుల స్వల్ప ఆధిక్యంతో కలిపి నార్త్ జట్టు సౌత్ జట్టుకు 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా... ఆట ముగిసే సమయానికి సౌత్‌జోన్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. ఆఖరి రోజు విజయానికి 194 పరుగుల దూరంలో ఉంది.
పుజారా శతకం
సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో చతేశ్వర్ పుజారా (133; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదంతొక్కగా, సూర్యకుమార్ యాదవ్ (52; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. దీంతో వెస్ట్ భారీ లక్ష్యంవైపు దూసుకెళుతోంది.
ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 292 పరుగులు చేసింది. సౌరభ్ 4, సారాంశ్ 3 వికెట్లు తీశారు. ప్రస్తుతం వెస్ట్ 384 పరుగుల ఆధిక్యంలో ఉంది. వర్షం కారణంగా చివరి రోజు ఆట సాధ్యంకాకుండా మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో వెస్ట్ జోన్ జట్టుకు ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది.
చదవండి: బజ్‌బాల్ ఆట చూపించాడు.. అరుదైన రికార్డు కొల్లగొట్టాడు