Vijaykumar Vyshak
-
5 వికెట్లతో చెలరేగిన వైశాక్..! పుజారా జట్టుకు ఓటమి తప్పదా?!
Duleep Trophy 2023- South Zone vs North Zone, 2nd Semi-Final- బెంగళూరు: సౌత్‌జోన్ సీమర్ వైశాక్ విజయ్‌కుమార్ (5/76) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో నార్త్‌జోన్‌ను కూల్చేశాడు. దీంతో దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో నార్త్‌జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 56.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 51/2తో శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన నార్త్ జట్టు 160 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ప్రభ్సిమ్రాన్ సింగ్ (63; 11 ఫోర్లు), హర్షిత్ రాణా (38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మూడు పరుగుల స్వల్ప ఆధిక్యంతో కలిపి నార్త్ జట్టు సౌత్ జట్టుకు 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా... ఆట ముగిసే సమయానికి సౌత్‌జోన్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. ఆఖరి రోజు విజయానికి 194 పరుగుల దూరంలో ఉంది. పుజారా శతకం సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో చతేశ్వర్ పుజారా (133; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదంతొక్కగా, సూర్యకుమార్ యాదవ్ (52; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. దీంతో వెస్ట్ భారీ లక్ష్యంవైపు దూసుకెళుతోంది. ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 292 పరుగులు చేసింది. సౌరభ్ 4, సారాంశ్ 3 వికెట్లు తీశారు. ప్రస్తుతం వెస్ట్ 384 పరుగుల ఆధిక్యంలో ఉంది. వర్షం కారణంగా చివరి రోజు ఆట సాధ్యంకాకుండా మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో వెస్ట్ జోన్ జట్టుకు ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. చదవండి: బజ్‌బాల్ ఆట చూపించాడు.. అరుదైన రికార్డు కొల్లగొట్టాడు -
ఆర్సీబీకి పట్టిన దరిద్రం.. ఇకనైనా అతడిని వదిలేయండి! లేదంటే మీ కర్మ!
IPL 2023- MI Vs RCB: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేసర్ హర్షల్ పటేల్ ఆట తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆర్సీబీకి పట్టిన దరిద్రం అని.. జట్టు నుంచి అతడిని తీసివేస్తేనే బాగుపడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంత చెత్త బౌలర్‌ను ఎక్కడా చూడలేదని.. వచ్చే ఏడాదైనా అతడిని వదిలించుకోవాలని ఫ్రాంఛైజీకి సూచిస్తున్నారు. బంగారం కోసం వెదుకుతూ.. వజ్రం లాంటి యజువేంద్ర చహల్‌ను వదులుకున్నారంటూ చురకలు అంటిస్తున్నారు. ఈసారి కూడా ట్రోఫీ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందేనని.. ఇలాంటి బౌలర్‌ను ఆడిస్తే మూల్యం చెల్లించక తప్పదంటూ పెద్ద ఎత్తున హర్షల్‌ను ట్రోల్ చేస్తున్నారు. మరోసారి విఫలం ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు మొత్తంగా 11 ఇన్నింగ్స్ ఆడిన ఈ గుజరాతీ బౌలర్ 388 పరుగులు ఇచ్చి 12 వికెట్లు తీశాడు. ఎకానమీ 9.94. ఇక ముంబై ఇండియన్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో హర్షల్ చెత్త ప్రదర్శన కనబరిచాడు. 3.3 ఓవర్లు బౌలింగ్‌లో ఒక్క వికెట్ కూడా తీయకపోగా ఏకంగా 41 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముంబై చేతిలో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ముంబై బ్యాటర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, నేహల్ వధేరా దూకుడు నేపథ్యంలో 200 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. హర్షల్ ఒక్కడే కాదు హర్షల్ ఒక్కడే కాదు మహ్మద్ సిరాజ్(3 ఓవర్లలో 31 పరుగులు, 0 వికెట్) కూడా పూర్తిగా విఫలమయ్యాడు. వనిందు హసరంగా రెండు వికెట్లు తీసినప్పటికీ 4 ఓవర్ల కోటాలో ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. విజయ్ కుమార్ వైశాక్ సైతం చెత్తగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇలా ఆర్సీబీ బౌలర్ల నాసికరం బౌలింగ్ కారణంగా ముంబై 16.3 ఓవర్లలోనే ముంబై లక్ష్యాన్ని ఛేదించి ప్లే ఆఫ్స్ రేసులో ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ బౌలర్లను సోషల్ మీడియా వేదికగా చీల్చి చెండాడుతున్న ఫ్యాన్స్.. ముఖ్యంగా హర్షల్ పటేల్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. చదవండి: ఆ నలుగురు అద్భుతం.. ఎంతటి రిస్క్‌కైనా వెనుకాడటం లేదు: రోహిత్ శర్మ Next sala cup namde without harshal patel in team @RCBTweets #MIvRCB pic.twitter.com/KwuzRXFdTS — Mr.littleboy (@chitti_babu__) May 9, 2023 1 like = 1 slap to Harshal Patel 1 retweet = 10 slap to Harshal Patel pic.twitter.com/Ptd15eUV0z — SUPRVIRAT (@ishantraj51) May 9, 2023 Harshal Patel#MIvsRCB #RCBvsMI pic.twitter.com/rF524cSO4f — Bhushan Kamble (@Vibewithbhusshh) May 9, 2023 WHAT. A. WIN! 👌 👌 A clinical chase from @mipaltan to beat #RCB & bag 2⃣ more points! 👏 👏 Scorecard ▶️ https://t.co/ooQkYwbrnL#TATAIPL | #MIvRCB pic.twitter.com/dmt8aegakV — IndianPremierLeague (@IPL) May 9, 2023 Up Above The World So High Like A Diamond His Name Is SKY 🤩#TATAIPL | #MIvRCB | @surya_14kumar | @mipaltan pic.twitter.com/EgUDqe7aao — IndianPremierLeague (@IPL) May 9, 2023 -
ధోని కెప్టెన్సీ అంటే అలెర్ట్ గా ఉండాలి...లేదంటే ఇంతే
-
RCB Vs CSK: చివరి మ్యాచ్‌లో హీరో.. ఇప్పుడు జీరో! అత్యంత చెత్త రికార్డు..
ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లో అదరగొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ పేసర్ విజయ్‌కుమార్ వైషాక్.. తన రెండో మ్యాచ్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్-2023లో భాగంగా సోమవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో విజయ్‌కుమార్ చెత్త ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో విజయ్‌కుమార్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 62 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ తరపున అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా వైషాక్ నిలిచాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ తొలి స్థానంలో ఉన్నాడు. గతేడాది సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాజిల్‌వుడ్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సీఎస్కే చేతిలో 8 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేయగల్గింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(62), మాక్స్వెల్(76) విరోచిత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ.. విజయం మాత్రం సీఎస్కేనే వరించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్కే బ్యాటర్లలో కాన్వే(45 బంతుల్లో 83 పరుగులు), శివమ్ దుబే(52) పరుగులతో దుమ్ము రేపారు. చదవండి: IPL 2023: మరీ ఇంత బద్దకమా.. మొయిన్ అలీపై కోపంతో ఊగిపోయిన ధోని! వీడియో వైరల్ -
అరంగేట్రంలోనే అదరగొట్టిన విజయ్‌కుమార్.. పుత్రోత్సాహంతో పొంగిపోయిన తల్లి
ఢిల్లీ క్యాపటల్స్తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కీలకమైన 3 వికెట్లు (4-0-20-3) పడగొట్టి తన జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేస్ బౌలర్ విజయ్‌కుమార్ వైశాఖ్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్సీబీ తరఫున డెబ్యూ మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన వైశాఖ్.. డీసీ స్టార్ ప్లేయర్, ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఔట్ చేసి ఐపీఎల్ వికెట్ల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, లలిత్ యాదవ్‌ల వికెట్లు తీసి ఢిల్లీ పతనాన్ని శాసించాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబర్చి, రాత్రిరాత్రే స్టార్డమ్ తెచ్చుకున్న వైశాఖ్‌ను చూసి అతని తల్లి పుత్రోత్సాహంతో పరవశించిపోయింది. మ్యాచ్ అనంతరం కొడుకును చూడగానే ఆమె పట్టలేనంత ఆనందంతో బిడ్డను ముద్దాడింది. ఈ సన్నివేశాన్ని చూస్తూ పక్కనే ఉన్న తండ్రి మురిసిపోయాడు. 26 ఏళ్ల వైశాఖ్ తమ సొంత ప్రేక్షకుల ముందు తొలి మ్యాచ్‌లోనే విజృంభించడంతో అతని తల్లిదండ్రులు పట్టరాని ఆనందంతో ఉప్పొంగిపోయారు. వైశాఖ్ తల్లి అతన్ని ముద్దు పెట్టుకుంటున్న దృశ్యం ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోకు ఆర్సీబీ అభిమానులు పిక్చర్ ఆఫ్ ది డే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, నిన్న (ఏప్రిల్ 15) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కోహ్లి (50), బౌలింగ్‌లో విజయ్‌కుమార్ వైశాఖ్ (3/20) రాణించడంతో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది రెండు వరుస పరాజయాల తర్వాత వచ్చిన విజయం (రెండవది). విజయ్‌కుమార్ వైశాఖ్ గురించి.. కర్ణాటకకు చెందిన విజయ్‌కుమార్ వైశాఖ్ 2020-21 సీజన్లో విజయ్‌హజారే ట్రోఫీలో కర్ణాటక తరఫున దేశవాలీ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా టీ20 క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వైశాఖ్.. కర్ణాటక తరఫున 2021-22 రంజీ ట్రోఫీ కూడా ఆడాడు. వైశాఖ్.. ఇప్పటివరకు 10 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 38 వికెట్లు, 14 టీ20ల్లో 22 వికెట్లు, 7 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ సందర్భంగా రజత్ పాటిదార్ గాయపడడంతో అతని స్థానంలో వైశాఖ్ ఆర్సీబీలోకి వచ్చాడు.