
PC: IPL.com
ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లో అదరగొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ పేసర్ విజయ్‌కుమార్ వైషాక్.. తన రెండో మ్యాచ్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్-2023లో భాగంగా సోమవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో విజయ్‌కుమార్ చెత్త ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో విజయ్‌కుమార్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 62 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ తరపున అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా వైషాక్ నిలిచాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ తొలి స్థానంలో ఉన్నాడు. గతేడాది సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాజిల్‌వుడ్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సీఎస్‌కే చేతిలో 8 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేయగల్గింది.
ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(62), మాక్స్‌వెల్(76) విరోచిత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ.. విజయం మాత్రం సీఎస్‌కేనే వరించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్‌కే బ్యాటర్లలో కాన్వే(45 బంతుల్లో 83 పరుగులు), శివమ్ దుబే(52) పరుగులతో దుమ్ము రేపారు.
చదవండి: IPL 2023: మరీ ఇంత బద్దకమా.. మొయిన్ అలీపై కోపంతో ఊగిపోయిన ధోని! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment