Duleep Trophy 2023: Tilak Varma Mayank Innings Helps South Zone, Check Score Details Inside - Sakshi
Sakshi News home page

Duleep Trophy 2023: ఆదుకున్న మయాంక్, తిలక్‌ 

Published Fri, Jul 7 2023 7:52 AM | Last Updated on Fri, Jul 7 2023 10:09 AM

Duleep Trophy: Tilak Varma Mayank Innings Helps South Zone Check Score - Sakshi

Duleep Trophy 2023- South Zone vs North Zone, 2nd Semi-Final- బెంగళూరు: కష్టాల్లో ఎదురీదుతున్న సౌత్‌జోన్‌ జట్టును హైదరాబాద్‌ రైజింగ్‌ స్టార్‌ ఠాకూర్‌ తిలక్‌ వర్మ (46; 5 ఫోర్లు, 1 సిక్స్‌), సీనియర్‌ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (76; 10 ఫోర్లు)తో కలిసి గట్టెక్కించాడు. దీంతో దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్‌జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌటైంది.

నార్త్‌జోన్‌ 3 పరుగుల ఆధిక్యంతోనే సరిపెట్టుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 63/4తో రెండో రోజు ఆట కొనసాగించిన సౌత్‌జోన్‌ను మయాంక్, తిలక్‌ నడిపించారు. ఐదో వికెట్‌కు ఇద్దరు 110 పరుగులు జోడించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన నార్త్‌జోన్‌ ఆట నిలిచే సమయానికి 11 ఓవర్లలో 2 వికెట్లకు 51 పరుగులు చేసింది.  

క్రికెట్‌కు తమీమ్‌ గుడ్‌బై 
చిట్టోగ్రామ్‌: వన్డే ప్రపంచకప్‌కు మూడు నెలల ముందు బంగ్లాదేశ్‌ జట్టు సీనియర్‌ ప్లేయర్, కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ సంచలన ప్రకటన చేశాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వెంటనే తప్పుకుంటున్నట్లు భావోద్వేగంతో ప్రకటించాడు.

బుధవారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్‌ ఓడగా ...తర్వాతి రోజే ఈ ప్రకటన వచ్చింది. 16 ఏళ్ల కెరీర్‌ లో 34 ఏళ్ల తమీమ్‌ ఇక్బాల్‌... 241 వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధ సెంచరీలతో 8313 పరుగులు... 70 టెస్టుల్లో 10 సెంచరీలతో 5134 పరుగులు... 78 టి20 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలతో కలిపి 1758 పరుగులు సాధించాడు.  

చదవండి: ఒక్క బంతి ఎక్కువ తీసుకున్నా గోవిందా! నాడు తండ్రి సచిన్‌ వికెట్‌ తీసి.. ఇప్పుడేమో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement