బెనోని: అండర్–19 ప్రపంచకప్ సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ప్రత్యర్థి ఖరారైంది. ఈ నెల 4న జరిగే తొలి సెమీస్‌లో టీమిండియాతో పాకిస్తాన్ తలపడుతుంది. శుక్రవారం జరిగిన చివరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పాక్ 6 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 49.1 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. ఫర్హాన్ జఖీల్ (40) టాప్ స్కోరర్‌గా నిలవగా ఆమిర్ ఖాన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం పాక్ 41.1 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేసిన మొహమ్మద్ హురైరా (76 బంతుల్లో 64; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. హురైరాను అఫ్గాన్ బౌలర్ నూర్ అహ్మద్ ‘మన్కడింగ్’ ద్వారా రనౌట్ చేయడం ఈ మ్యాచ్‌లో వివాదం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment