
టి20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్-2 సమీకరణాలు ఆసక్తిగా మారిన సంగతి తెలిసిందే. గురువారం సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించిన పాకిస్తాన్ ఒక్కసారిగా సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది. అయితే ఇప్పటికీ పాకిస్తాన్‌కు సెమీస్ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒకవేళ పాకిస్తాన్ సెమీస్‌కు వెళ్లాలన్న టీమిండియా, సౌతాఫ్రికాలపై ఆధారపడాల్సిందే.
జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయి.. సౌతాఫ్రికా నెదర్లాండ్స్‌తో చేతిలో ఓడితేనే పాక్‌కు అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ రెండు మ్యాచ్‌ల్లో ఏ ఒక్క మ్యాచ్ వర్షంతో ఆగిపోయినా అప్పుడు కూడా ఇంటికి వెళ్లేది పాకిస్తాన్ జట్టే. కాబట్టి ఎటు చూసుకున్నా పాకిస్తాన్‌కు టీమిండియానే పెద్దదిక్కులా కనిపిస్తుంది.
ఇక జింబాబ్వే, టీమిండియా మ్యాచ్‌లో విజయావకాశాలు ఎక్కువగా భారత్‌కే ఉన్నాయి. అయితే ఈ ప్రపంచకప్‌లో జింబాబ్వే పాకిస్తాన్‌కు షాక్ ఇవ్వడంతో ఆ జట్టును తక్కువగా అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుంది. అందుకే జింబాబ్వేతో మ్యాచ్‌ను టీమిండియా సీరియస్‌గా తీసుకొని ఆడితే బాగుంటుందని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment