క్షణక్షణం.. ఉత్కంఠ
క్షణక్షణం.. ఉత్కంఠ
Published Thu, Oct 27 2016 9:50 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM
సెమీస్‌కు చేరిన బ్యాడ్మింటన్ పోటీలు
తెనాలి: స్థానిక చెంచుపేటలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ –2016 పోటీ లు గురువారం రాత్రికి క్వార్టర్ ఫైనల్స్ పూర్తయ్యాయి. అండర్–13, అండర్–15 కేటగిరీల్లో బాలుర క్వార్టర్ ఫైనల్స్ నిర్వహించారు. విజేతలు సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు.
అండర్–15 క్వార్టర్ ఫైనల్స్ సింగిల్స్ విజేతలు..
షేక్ ఇమ్రాన్ (అనంతపురం) 21–18, 22–20 స్కోరుతో క్రీడాకారుడు సాయిచరణ్ (గుంటూరు)పై విజయం సాధించాడు. ఆర్ సంజీవరావు (పశ్చిమగోదావరి) 21–13, 21–14 స్కోరుతో ఎం. సాయినాథ్‌రెడ్డి (కర్నూలు)పై గెలుపొందాడు. చరణ్‌నాయక్ (గుంటూరు) 21–15, 21–14తో కార్తికేయ(గుంటూరు)పై, షేక్ అర్షద్ (కర్నూలు) 21–16, 18–21, 21–9 సీహెచ్ రుషి (నెల్లూరు)పై విజయం సాధించారు.
అండర్–15 క్వార్టర్ ఫైనల్స్ డబుల్స్ విజేతలు..
కోయ సాయిచరణ్–కె.చరణ్ నాయక్(గుంటూరు) 21–15, 21–7 స్కోరుతో బీ కార్తీక్, కే మినిద్‌జాషువా(విశాఖపట్నం)పై. కేఎన్‌వీఎస్ సూర్య (పశ్చిమ గోదావరి)–షేక్ ఇమ్రాన్ (అనంతపురం) ద్వయం 21–17, 21–11 స్కోరుతో ఏ వంశీ కష్ణరాజ్, బీ గిరీష్‌నాయుడు (తూర్పు గోదావరి) జిల్లా జట్లపై గెలుపొందాయి.
అండర్–13 క్వార్టర్ ఫైనల్స్ సింగిల్స్ విజేతలు..
వంశీకృష్ణ (పశ్చిమ గోదావరి) 21–5, 21–7 షేక్ నుమెయిర్ (ప్రకాశం)పై, సాయికిరణ్ (విశాఖ) 21–17, 22–20 బాబా రాహుల్ (కర్నూలు)పై విజయం సాధించాడు. ఎన్.శివారెడ్డి (కర్నూల్) 21–18, 19–21,21–18 స్కోరుతో హిమదీప్ (ప్రకాశం)పై, విజయ్ (అనంతపురం) 21–9, 21–7 స్కోరుతో మోహిత్‌రెడ్డి (పశ్చిమ గోదావరి)పై గెలిచారు.
అండర్13 క్వార్టర్ ఫైనల్స్ డబుల్స్ విజేతలు..
అండర్–13 డబుల్స్ విభాగంలో విజయ్– రాహుల్ (అనంతపురం) 21–14, 21–14 స్కోరుతో తేజ్‌ప్రణవ్– విష్ణువర్ధన్ (నెల్లూరు)పై గెలుపొందారు. ఏవీఎస్ హిమదీప్– ఎ.మొహిత్‌రెడ్డి (పశ్చిమగోదావరి) 21–17, 21–17 స్కోరుతో మహీర్ ఆలీఖాన్– ఎన్.శివారెడ్డి (కర్నూలు) విజయం సాధించారు. హర్షన్– వీఎస్‌ఎస్ సందేశ్ (కృష్ణా) 21–13, 21–14 స్కోరుతో కేఎల్ అభిరామ్– వై.బెన్ని రోహిత్ (విశాఖ)పై గెలిచారు. ఏ నిధి భట్ (కర్నూలు), షేక్ నుమెయిర్ (ప్రకాశం) ద్వయం 21–10, 21–17 స్కోరుతో సాయిమణికంఠ– మొహిత్ (తూర్పుగోదావరి)పై విజయం సాధించారు.
Advertisement
Advertisement