Eagerness
-
మూడో నిపుణుడు
రాజుగారు నిద్రలోంచి ఉలిక్కిపడి లేచారు. లేవగానే తన నోట్లో దంతాలున్నాయో లేవోనని చూసుకోసాగారు. అంతా సరిగానే ఉందని భావించి మళ్లీ నిద్రలోకి జారుకున్నారు. తెల్లారి రాజదర్బారు కొలువయ్యాక తన మంత్రి వర్గంతో ‘‘రాత్రి కలలో నా దంతాలన్నీ విరిగిపోయాయనే కల వచ్చింది. దీని నిగూడార్థం చెప్పే నిపుణుడిని హాజరుపరచండి’’ అని హుకుం జారీ చేశారు. రాజుగారు చెప్పినట్లుగానే హుటాహుటిన స్వప్న ఫలితాలను వివరించే ఒక నిపుణుడిని హాజరుపర్చారు. ‘నా పళ్లన్నీ ఊడిపోయినట్లుగా నేను కలగన్నాను’ అని చెప్పి కలను వివరించారు. రాజుగారు. దానికి ఆ నిపుణుడు ‘‘అపచారం అపచారం.. రాజుగారూ మీకు వచ్చిన కల ఏమి చెబుతోందంటే... మీ కళ్లముందే మీ ఇంటిలోని వారంతా చనిపోతారు’’ అని అర్థం చెప్పాడు. రాజుగారు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వెంటనే అతన్ని కారాగారంలో వేసి నిర్బంధించవలసిందిగా భటులను ఆదేశించి, మరో నిపుణుడిని పిలవాలని ఆజ్ఞాపించారు. మరో నిపుణుడు వచ్చాడు. రాజుగారు చెప్పిన కలను విన్న అతనూ మొదటి నిపుణుడు చెప్పినట్లుగానే చెప్పడంతో అతన్నీ చెరసాలలో వేసి, మూడో నిపుణుడిని పిలవాలని మళ్లీ రాజుగారు హుకుం జారీచేశారు. మూడో నిపుణుడు హాజరయ్యాడు. రాజుగారు తనకొచ్చిన కలను పూసగుచ్చినట్లు వివరించారు. ఇది విన్న ఆ నిపుణుడు రాజుగారూ ‘మీకు నిజంగానే ఈ కల వచ్చిందా?’ అని మళ్లీ రెట్టించాడు. రాజుగారు ఎంతో ఆతృతతో అవునని తలూపారు. దానికా నిపుణుడు ‘‘రాజుగారూ మీకు శుభాకాంక్షలు’’ చెప్పగానే.. రాజుగారు ‘‘దేనికి శుభాకాంక్షలు:’’ అని ఎంతో ఆతృతతో అడిగారు. దానికా నిపుణుడు ‘‘మీ ఆయుష్షు సుదీర్ఘమైనది. మీ కుటుంబంలో అందరికంటే మీరు ఎక్కువ కాలం బతుకుతారు’’ అని కల అర్థాన్ని వివరించాడు. రాజుగారు అతను చెప్పిన జోస్యానికి ఎంతో మెచ్చుకున్నారు. ఎన్నో విలువైన బహుమతులతో సత్కరించారు. నిజానికి మిగతా ఇద్దరు జ్యోతిష్యులు చెప్పింది కూడా ఇదే అయినప్పటికీ చెప్పే తీరులో వ్యత్యాసముంది. కొందరి మాటలతో మనస్సుకు గాయాలవుతాయి. మరికొందరి మాటలు ప్రేమను పంచి హృదయాలను గెలుచుకుంటాయి. – ముజాహిద్ -
క్షణక్షణం.. ఉత్కంఠ
సెమీస్‌కు చేరిన బ్యాడ్మింటన్ పోటీలు తెనాలి: స్థానిక చెంచుపేటలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ –2016 పోటీ లు గురువారం రాత్రికి క్వార్టర్ ఫైనల్స్ పూర్తయ్యాయి. అండర్–13, అండర్–15 కేటగిరీల్లో బాలుర క్వార్టర్ ఫైనల్స్ నిర్వహించారు. విజేతలు సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. అండర్–15 క్వార్టర్ ఫైనల్స్ సింగిల్స్ విజేతలు.. షేక్ ఇమ్రాన్ (అనంతపురం) 21–18, 22–20 స్కోరుతో క్రీడాకారుడు సాయిచరణ్ (గుంటూరు)పై విజయం సాధించాడు. ఆర్ సంజీవరావు (పశ్చిమగోదావరి) 21–13, 21–14 స్కోరుతో ఎం. సాయినాథ్‌రెడ్డి (కర్నూలు)పై గెలుపొందాడు. చరణ్‌నాయక్ (గుంటూరు) 21–15, 21–14తో కార్తికేయ(గుంటూరు)పై, షేక్ అర్షద్ (కర్నూలు) 21–16, 18–21, 21–9 సీహెచ్ రుషి (నెల్లూరు)పై విజయం సాధించారు. అండర్–15 క్వార్టర్ ఫైనల్స్ డబుల్స్ విజేతలు.. కోయ సాయిచరణ్–కె.చరణ్ నాయక్(గుంటూరు) 21–15, 21–7 స్కోరుతో బీ కార్తీక్, కే మినిద్జాషువా(విశాఖపట్నం)పై. కేఎన్‌వీఎస్ సూర్య (పశ్చిమ గోదావరి)–షేక్ ఇమ్రాన్ (అనంతపురం) ద్వయం 21–17, 21–11 స్కోరుతో ఏ వంశీ కష్ణరాజ్, బీ గిరీష్‌నాయుడు (తూర్పు గోదావరి) జిల్లా జట్లపై గెలుపొందాయి. అండర్–13 క్వార్టర్ ఫైనల్స్ సింగిల్స్ విజేతలు.. వంశీకృష్ణ (పశ్చిమ గోదావరి) 21–5, 21–7 షేక్ నుమెయిర్ (ప్రకాశం)పై, సాయికిరణ్ (విశాఖ) 21–17, 22–20 బాబా రాహుల్ (కర్నూలు)పై విజయం సాధించాడు. ఎన్.శివారెడ్డి (కర్నూల్) 21–18, 19–21,21–18 స్కోరుతో హిమదీప్ (ప్రకాశం)పై, విజయ్ (అనంతపురం) 21–9, 21–7 స్కోరుతో మోహిత్‌రెడ్డి (పశ్చిమ గోదావరి)పై గెలిచారు. అండర్13 క్వార్టర్ ఫైనల్స్ డబుల్స్ విజేతలు.. అండర్–13 డబుల్స్ విభాగంలో విజయ్– రాహుల్ (అనంతపురం) 21–14, 21–14 స్కోరుతో తేజ్ప్రణవ్– విష్ణువర్ధన్ (నెల్లూరు)పై గెలుపొందారు. ఏవీఎస్ హిమదీప్– ఎ.మొహిత్రెడ్డి (పశ్చిమగోదావరి) 21–17, 21–17 స్కోరుతో మహీర్ ఆలీఖాన్– ఎన్.శివారెడ్డి (కర్నూలు) విజయం సాధించారు. హర్షన్– వీఎస్ఎస్ సందేశ్ (కృష్ణా) 21–13, 21–14 స్కోరుతో కేఎల్ అభిరామ్– వై.బెన్ని రోహిత్ (విశాఖ)పై గెలిచారు. ఏ నిధి భట్ (కర్నూలు), షేక్ నుమెయిర్ (ప్రకాశం) ద్వయం 21–10, 21–17 స్కోరుతో సాయిమణికంఠ– మొహిత్ (తూర్పుగోదావరి)పై విజయం సాధించారు. -
పాతబస్తీలో పాగాకు ఎంబీటీ తహతహ
రెండు దశాబ్దాలుగా తీవ్ర ప్రయత్నాలు అక్షరాస్యత, అభివృద్ధి ప్రణాళికలే ప్రచారాస్త్రాలు సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పాతబస్తీలో పాగా వేసేందుకు మజ్లిస్-బచావో-తహరిక్ (ఎంబీటీ) తహత హలాడుతోంది. రెండు దశాబ్దాల కిందటి వైభవం కోసం పడరాని పాట్లు పడుతోంది. గత మూడు పర్యాయాలుగా రాజకీయ శత్రు పక్షమైన మజ్లిస్-ఇత్తేహదుల్-ముస్లిమీన్ (ఎంఐఎం)ను మట్టి కరిపించేందుకు శక్తియుక్తులను ఒడ్డుతోంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో సైతం పాతబస్తీలోని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతోపాటు చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, చార్మినార్, బహదూర్‌పురా, ఖైరతాబాద్, ముషీరాబాద్, సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అభ్యర్ధులను బరిలో దింపింది. మజ్లిస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు పాతబస్తీలో అక్షరాస్యత, అభివృద్ధి ప్రణాళికల పేరుతో ప్రజల్లో మమేకమయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గతంలో పార్టీ ప్రాతినిధ్యం వహించిన చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా అసెంబ్లీ స్థానాలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా తిరిగి దక్కించుకునేందుకు రెండు నెలల ముందు నుంచే వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఆ రెండు స్థానాల నుంచి సాక్షాత్తు ఎంబీటీ వ్యవస్థాకుడైన దివంగత నేత అమానుల్లాఖాన్ కుమారులైన ప్రస్తుత పార్టీ అధినేత డాక్టర్ ఖయ్యాం ఖాన్, ఫర్హాతుల్లా ఖాన్లు బరిలో దిగి గట్టిపోటీకి సిద్ధమయ్యారు. పట్టు వదలకుండా.. పాతబస్తీలో మజ్లిస్ పార్టీని దెబ్బతీసి గట్టెక్కేందుకు గత మూడు పర్యాయాలుగా ఎంబీటీ పట్టు వదలని విక్రమార్కునిలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. రెండు దశాబ్దాల క్రితం సుల్తాన్ సలావుద్దీన్‌తో ఏర్పడ్డ విభేదాలతో అమానుల్లా ఖాన్ నాయకత్వంలో 1993లో ఏర్పడిన మజ్లిస్- బచావ్ తహరీక్ (ఎంబీటీ) 1994లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తొలి విజయం సాధించింది. మజ్లిస్ కంచు కోటలైన చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా అసెంబ్లీ స్థానాల్లో ఎంబీటీ విజయకేతనం ఎగురవేయగా, మజ్లిస్ మాత్రం కేవలం చార్మినార్ నియోజకవర్గానికే పరిమితమైంది. అది కూడా సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ పెద్ద కుమారుడు అసదుద్దీన్ ఓవైసీ రాజకీయ అరంగేట్రంతో చార్మినార్ దక్కినట్లయింది. అయితే 1999 ఎన్నికల్లో ఎంబీటీ తన బలాన్ని నిలుపుకోలేకపోయింది. రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి. పార్టీ అధినేత అమానుల్లా ఖాన్ వరసగా ఐదు పర్యాయాలు విజయం సాధించిన చాంద్రాయణగుట్ట నుంచి ఓటమి చవిచూడక తప్పలేదు. అదేవిధంగా గతంలో యాకుత్‌పురా నుంచి విజయం సాధించిన ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ఎంఐఎం పక్షాన పోటీ చేసి గెలుపొందగా, ఎంబీటీ పక్షాన పోటీ చేసిన విరాసత్ రసూల్ ఖాన్ కూడా ఎంఐఎం గూటికి చేరారు. ఆ తర్వాత రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో చాంద్రాయణ గుట్ట అసెంబ్లీ నంచి అమానుల్లాఖాన్ పెద్ద కుమారుడు ఖయ్యాంఖాన్, యాకుత్‌పురా నుంచి ఫర్హాతుల్లా ఖాన్, మిగతా నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు బరిలో దిగి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూడక తప్పలేదు. తిరిగి ఈసారి అభ్యర్థులను బరిలో దింపి మజ్లిస్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి ఎంబీటీ సిద్ధమవుతోంది. అభ్యర్థులు వీరే... నగరంలోని ఒక లోక్‌సభ, ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎంబీటీ అభ్యర్థులను బరిలో దింపింది. హైదరాబాద్ లోక్‌సభ నుంచి సయ్యద్ ముస్తాక్ మహముద్... చాంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానం నుంచి డాక్టర్ ఖయ్యాంఖాన్, యాకుత్‌పురా నుంచి పర్హాతుల్లా ఖాన్, బహదూర్‌పురా నుంచి రశీద్ హష్మీ, చార్మినార్ నుంచి మాజీద్ ఖాన్, ఖైరతాబాద్ నుంచి ఆలమ్‌ఖాన్, సనత్‌నగర్ నుంచి సంఘిశెట్టి రంజిత్ కుమార్, ముషీరాబాద్ నుంచి దుర్గం మధుసూదన్‌లు పోటీ పడుతున్నారు.