ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఏ జట్టుకు సెమీస్ బెర్త్ అధికారికంగా ఖరారు కాలేదు. మరో నాలుగు మ్యాచ్‌లే ఆడాల్సి ఉన్నప్పటికీ 6 జట్ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. అన్ని జట్లతో పోలిస్తే టీమిండియాకు సెమీస్ అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ రేపటి వరకు ఏమీ చెప్పలేని పరిస్థితి. ఏ జట్టు ఏమరపాటుగా ఉన్నా సెమీస్ బెర్త్ గల్లంతవడం ఖాయం.
గ్రూప్-1 విషయానికొస్తే.. ఈ గ్రూప్ నుంచి భారత్ సెమీస్ రేసులో ముందుంది. సూపర్-8లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో మెరుగైన విజయాలు సాధించి గ్రూప్ టాపర్‌గా కొనసాగుతుంది. సూపర్-8లో రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించినా టీమిండియాకు సైతం టెక్నికల్‌గా సెమీస్ బెర్త్ ఖరారు కాలేదు.
ఒకవేళ భారత్.. రేపు జరుగబోయే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడితే సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. ఆసీస్ చేతిలో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓడి.. ఆతర్వాత బంగ్లాదేశ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 93 పరుగుల తేడాతో గెలిస్తే టీమిండియా సెమీస్ ఆశలు ఆవిరవుతాయి. ఇలా జరగడం దాదాపుగా అసాధ్యమే అయినప్పటికీ.. జరదని మాత్రం చెప్పలేని పరిస్థితి. కాబట్టి రేపు ఆసీస్‌తో జరుగబోయే మ్యాచ్‌లో గెలవాలనే టీమిండియా అనుకోవాలి.
మరోవైపు ఇవాళ (జూన్ 23) ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించడంతో గ్రూప్-1లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటిదాకా సెమీస్ రేసులో లేని ఆఫ్ఘనిస్తాన్.. ఆసీస్‌పై గెలుపుతో ఒక్కసారిగా సెమీస్ రేసులోకి వచ్చింది. ఇప్పుడు ఆ జట్టు భవిష్యత్తు భారత్-ఆసీస్ మ్యాచ్‌పై ఆధారపడి ఉంది.
ఇదిలా ఉంటే, గ్రూప్-2 సెమీస్ రేసు గ్రూప్-1 కంటే కఠినంగా ఉంది. గ్రూప్-1లో అయినా మొదటి సెమీస్ బెర్త్‌పై (భారత్) ఓ క్లారిటీ ఉంది. గ్రూప్-2లో అయితే అదీ లేదు. ఇప్పటివరకు అజేయ జట్టుగా ఉన్న సౌతాఫ్రికా గ్రూప్-2లో టాపర్‌గా ఉన్నా ఆ జట్టుకు కూడా సెమీస్ బెర్త్ అంత ఈజీగా దక్కేలా లేదు. ఆ జట్టు తమ చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఉంది.
సౌతాఫ్రికా, విండీస్‌లతో పోలిస్తే.. ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్‌కు కాస్త మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఆ జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో చిన్న జట్టైన యూఎస్‌ఏతో తలపడాల్సి ఉంది. ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. మొత్తంగా చూస్తే ఈ సారి ప్రపంచకప్ సెమీస్ బెర్త్‌లు గతంలో ఎన్నడూ లేనంత కఠినంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment