సెమీస్‌ బెర్తులు ఖరారు.. ఆసీస్‌తో పాక్‌, ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్‌ 'ఢీ' | T20 World Cup 2021: England Take On Kiwis, Pakistan Take On Australia In Semi Finals | Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: సెమీస్‌ బెర్తులు ఖరారు.. ఆసీస్‌తో పాక్‌, ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్‌ 'ఢీ'

Published Sun, Nov 7 2021 9:37 PM | Last Updated on Mon, Nov 8 2021 10:19 PM

T20 World Cup 2021: England Take On Kiwis, Pakistan Take On Australia In Semi Finals - Sakshi

England Take On Kiwis, Pakistan Take On Australia In Semi Finals Of T20 WC 2021: టీ20 ప్రపంచకప్‌-2021లో సెమీస్‌ బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్‌-1 నుంచి ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్లు ఇదివరకే సెమీస్‌కు చేరుకోగా.. ఇవాళ(నవంబర్‌ 7) అఫ్గానిస్థాన్‌పై గెలుపుతో న్యూజిలాండ్‌ గ్రూప్‌-2 నుంచి తమ సెమీస్‌ బెర్తును కన్‌ఫర్మ్‌ చేసుకుంది. ఈ గ్రూప్‌ నుంచి పాక్‌ ఇదివరకే సెమీస్‌ చేరుకుంది. సెమీస్‌లో గ్రూప్‌-1 టాపర్‌ అయిన ఇంగ్లండ్‌.. న్యూజిలాండ్‌(గ్రూప్‌-2లో సెకెండ్‌ ప్లేస్‌)తో తలపడనుండగా, గ్రూప్‌-2 టాపర్‌ పాక్‌.. ఆస్ట్రేలియా(గ్రూప్‌-1 సెకెండ్‌ ప్లేస్‌)ను ఢీ కొట్టనుంది.

ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి సెమీస్‌ మ్యాచ్‌ అబుదాబి వేదికగా నవంబర్‌ 10న జరగనుండగా.. పాకిస్థాన్‌- ఆస్ట్రేలియా మ్యాచ్‌ నవంబర్‌ 11న దుబాయ్‌ వేదికగా జరుగుతుంది. ఈ రెండు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మొదలవుతాయి. ఈ రెండు సెమీస్‌ మ్యాచ్‌లు నవంబర్‌ 8న జరిగే భారత్‌- నమీబియా మ్యాచ్‌తో సంబంధం లేకుండా జరగనున్నాయి. 
చదవండి: చరిత్ర సృష్టించిన రషీద్‌ ఖాన్‌.. టీ20ల్లో అరుదైన రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement