Gautam Gambhir urges fans to not go harsh on Team India: టీ20 ప్రపంచ కప్ 2021లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా ప్రయాణం ముగిసింది. నవంబర్7న జరిగిన మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌పై న్యూజిలాండ్ విజయం సాధించడంతో భారత్ సెమిస్ ఆశలు అవిరియ్యాయి. 2012 తర్వాత ఐసీసీ ఈవెంట్‌లో భారత్ నాకౌట్ దశకు చేరుకోకపోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కొంత మంది మాజీ క్రికెటర్‌లు కోహ్లి సేనపై విమర్శల వర్షం కురిపిస్తుంటే.. మరి కొంత మంది మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్ టీమిండియాకు మద్దతుగా నిలిచాడు. ఆటగాళ్లు చాలా కాలం పాటు బయో బబుల్‌లో ఉన్నారనే వాస్తవాన్ని అర్థం చేసుకోవాలని అభిమానులను గంభీర్ అభ్యర్థించాడు.
"టీ 20 ప్రపంచ కప్ 2021లో భారత పేలవ ప్రదర్శన చూసి నేను కూడా భాదపడ్డాను. అయితే ఆటగాళ్లు చాలా కాలం నుంచి బయో బబుల్‌లో ఉన్నారనే విషయం గుర్తు పెట్టుకోండి. మనకు వినోదం పంచడానికి వాళ్లు బయో బబుల్ జీవితాన్ని గడుపుతున్నారు. దీంట్లో వాళ్లు ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. ఈ మెగా టోర్న్‌మెంట్‌లో మీరు బాగా ప్రయత్నించారు బాయ్స్" అని గంభీర్ పేర్కొన్నాడు. ఈ ప్రపంచకప్‌లో సూపర్ 12లో డ్రా అయిన రెండు గ్రూపుల మధ్య జట్లలో తేడాలున్నాయని అతడు తెలిపాడు. ఇకపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) రౌండ్-రాబిన్ కాకుండా 2019 ప్రపంచ కప్ వంటి లీగ్ ఫార్మాట్‌ను నిర్వహించాలని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment