సైనా నెహ్వాల్
దుబాయ్: అద్వితీయ ఆటతీరును కొనసాగించిన భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) సూపర్ సిరీస్ సెమీఫైనల్స్లో ఓడిపోయింది. శనివారం జరిగిన సెమీఫైనల్స్లో 21-11, 13-21, 9-21 తేడాతో తైవాన్ క్రీడాకారిణి వరల్డ్ నెంబర్ 9 టే జూ యింగ్ చేతిలో వరల్డ్ నెంబర్ 4 సైనా ఓడిపోయింది.
మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ అజేయంగా నిలిచి గ్రూప్ ఏ లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సైనా 15-21, 21-7, 21-17తో యోన్ జూ బే (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది.