world super series
-
నేటి సెమీస్‌లో చెన్ యుఫెతో ‘ఢీ’
-
సింగిల్స్ చాంప్స్ మొమొటా, ఒకుహారా
దుబాయ్: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో జపాన్ క్రీడాకారులు కెంటో మొమొటా, నొజోమి ఒకుహారా మెరిశారు. పురుషుల సింగిల్స్‌తోపాటు మహిళల సింగిల్స్‌లోనూ టైటిల్స్‌ను సొంతం చేసుకొని సంచలనం సృష్టించారు. పురుషుల ఫైనల్లో కెంటో మొమొటా 21-15, 21-12తో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)పై గెలుపొందగా... మహిళల సింగిల్స్ ఫైనల్లో ఒకుహారా 22-20, 21-18తో యిహాన్ వాంగ్ (చైనా)ను ఓడించింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో సింగిల్స్ విభాగంలో జపాన్ ఆటగాళ్లు టైటిల్ సాధించడం ఇదే తొలిసారి. ఒకుహారా ఈ టోర్నీలో అజేయంగా నిలువడం విశేషం. టైటిల్ గెలిచే క్రమంలో ఒకుహారా లీగ్ దశలో ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్), రెండో ర్యాంకర్ సైనా నెహ్వాల్ (భారత్)లపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన మొమొటా, ఒకుహారాలకు 42 వేల డాలర్ల (రూ. 28 లక్షల 20 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. ఈ టోర్నీలో భారత్ తరఫున సైనా, శ్రీకాంత్ బరిలోకి దిగినప్పటికీ ఇద్దరూ లీగ్ దశలోనే నిష్ర్కమించారు. -
వరల్డ్ సూపర్ సిరీస్: సైనా విజయం
దుబాయ్: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తొలి విజయం సాధించింది. గురువారం జరిగిన రెండో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్‌పై 21-23, 9-21, 21-12 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్ సైనా గెలుపొందింది. తొలి లీగ్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లకు తొలి రోజు నిరాశ ఎదురైన విషయం అందరికీ విదితమే. -
సైనా, శ్రీకాంత్‌లకు నిరాశ
తొలి లీగ్ మ్యాచ్‌లో పరాజయం సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ దుబాయ్: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో భారత స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లకు తొలి రోజు నిరాశ ఎదురైంది. వీరిద్దరూ తొలి లీగ్ మ్యాచ్‌ల్లో జపాన్ ఆటగాళ్ల చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ శ్రీకాంత్ 13-21, 13-21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ కెంటో మొమొటా (జపాన్) చేతిలో... మహిళల గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సైనా 14-21, 6-21తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో ఓటమి చవిచూశారు. గురువారం జరిగే రెండో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్, కరోలినా మారిన్ (స్పెయిన్)తో సైనా తలపడతారు. ఒకుహారాతో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన సైనా ఈసారి మాత్రం తేలిపోయింది. చీలమండ గాయంతో బాధపడుతున్న సైనా కోర్టులో చురుకుగా కదల్లేకపోయింది. ఇక మొమొటాతో జరిగిన మ్యాచ్‌లోనూ శ్రీకాంత్ తన సహజశైలి ఆటతీరును కనబర్చలేకపోయాడు. ఐఓసీ అథ్లెట్స్ కమిషన్ ఎన్నికల్లో సైనా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లోని అథ్లెట్స్ కమిషన్ కమిటీ ఎన్నికల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పోటీపడనుంది. వచ్చే ఏడాది ఆగస్టులో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్ సందర్భంగా ఈ ఎన్నికలను నిర్వహిస్తారు. నాలుగు స్థానాల కోసం మొత్తం 24 మంది స్టార్ క్రీడాకారులు పోటీపడనున్నారు. -
సైనా, శ్రీకాంత్‌లకు నిరాశ
వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ దుబాయ్: లీగ్ దశలో అజేయంగా నిలిచిన సైనా నెహ్వాల్ అసలు పోరులో తడబడింది. బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి సెమీఫైనల్లో నిష్ర్కమించింది. ఈ మెగా ఈవెంట్లో తొలిసారి బరిలోకి దిగిన హైదరాబాద్‌కే చెందిన కిడాంబి శ్రీకాంత్ కూడా సెమీఫైనల్లోనే వెనుదిరిగాడు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సైనా నెహ్వాల్ 21-11, 13-21, 9-21తో తాయ్ జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకాంత్ 18-21, 13-21తో ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. -
బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో శ్రీకాంత్ ఓటమి
దుబాయ్: ప్రపంచ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో శనివారం భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత టాప్ షట్లర్లు సైనా నెహ్వాల్‌తో పాటు శ్రీకాంత్ కూడా ఓటమి చవిచూశాడు. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో శ్రీకాంత్ 18-21, 9-21 స్కోరుతో చైనా ఆటగాడు చెన్ లాంగ్ చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు మహిళల సింగిల్స్ సెమీస్‌లో వరల్డ్ నెంబర్ 4 సైనా 21-11, 13-21, 9-21 తేడాతో తైవాన్ క్రీడాకారిణి వరల్డ్ నెంబర్ 9 టే జూ యింగ్ చేతిలో ఓడిపోయింది. -
వరల్డ్ సూపర్ సిరీస్ సెమీఫైనల్స్‌లో సైనా ఓటమి
దుబాయ్: అద్వితీయ ఆటతీరును కొనసాగించిన భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) సూపర్ సిరీస్ సెమీఫైనల్స్‌లో ఓడిపోయింది. శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో 21-11, 13-21, 9-21 తేడాతో తైవాన్ క్రీడాకారిణి వరల్డ్ నెంబర్ 9 టే జూ యింగ్ చేతిలో వరల్డ్ నెంబర్ 4 సైనా ఓడిపోయింది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ అజేయంగా నిలిచి గ్రూప్ ఏ లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సైనా 15-21, 21-7, 21-17తో యోన్ జూ బే (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. -
సెమీస్‌లో సైనా, శ్రీకాంత్
వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ దుబాయ్: అద్వితీయ ఆటతీరును కొనసాగిస్తూ సైనా నెహ్వాల్... చివరి లీగ్ మ్యాచ్‌లో పోరాడి ఓడిన కిడాంబి శ్రీకాంత్... బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ అజేయంగా నిలిచి గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సైనా 15-21, 21-7, 21-17తో యోన్ జూ బే (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. సైనాతోపాటు ఈ గ్రూప్ నుంచి సుంగ్ జీ హున్ (కొరియా)... గ్రూప్ ‘బి’ నుంచి అకానె యమగూచి (జపాన్), జు యింగ్ తాయ్ (చైనీస్ తైపీ) సెమీఫైనల్లోకి అడుగుపెట్టారు. చైనా స్టార్ ప్లేయర్స్ షిజియాన్ వాంగ్, యిహాన్ వాంగ్లు లీగ్ దశలోనే నిష్ర్కమించడం గమనార్హం. ఫలితంగా నాలుగేళ్ల తర్వాత తొలిసారి చైనాయేతర క్రీడాకారిణి ఈ టోర్నీలో టైటిల్ దక్కించుకోనుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘బి’లో శ్రీకాంత్ రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 17-21, 21-12, 14-21తో ప్రపంచ మూడో ర్యాంకర్ జాన్ జోర్గెన్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. ఈ గ్రూప్‌లో శ్రీకాంత్, జోర్గెన్సన్, కెంటో మొమిటా (జపాన్) రెండేసి విజయాలతో సమఉజ్జీలుగా నిలిచారు. అయితే మూడు మ్యాచ్‌ల్లో కలిపి మొమిటా కంటే ఒక్కో గేమ్ ఎక్కువగా గెలిచిన జోర్గెన్సన్, శ్రీకాంత్ సెమీఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. పురుషుల సింగిల్స్‌లోనే గ్రూప్ ‘ఎ’ నుంచి చెన్ లాంగ్ (చైనా), విటిన్‌గస్ (డెన్మార్క్) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. శనివారం సెమీఫైనల్స్, ఆదివారం ఫైనల్స్ జరుగుతాయి. -
రికార్డుకు చేరువలో లీ చోంగ్ వీ
కౌలాలంపూర్: మరో విజయం సాధిస్తే... ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టైటిల్‌ను అత్యధికసార్లు నెగ్గిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టిస్తాడు. 2008 నుంచి 2010 వరకు వరుసగా మూడుసార్లు పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన లీ చోంగ్ వీ నాలుగోసారి ఈ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో లీ చోంగ్ వీ 21-14, 21-16తో జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)పై గెలిచాడు. రికార్డుస్థాయిలో మూడుసార్లు ఈ టైటిల్‌ను సాధించిన మహిళల జోడి వాంగ్ జియోలీ-యూ యాంగ్ (చైనా); పురుషుల జంట మథియాస్ బో-కార్స్టెన్ మోగెన్సన్ (డెన్మార్క్) ఈసారి సెమీఫైనల్లోనే నిష్ర్కమించాయి. దాంతో అత్యధికసార్లు ఈ టైటిల్ సాధించనున్న రికార్డుకు లీ చోంగ్ వీ మరో విజయం దూరంలో ఉన్నాడు. -
గెలిచినా ఇంటికే...
కౌలాలంపూర్: ఈ ఏడాదిని విజయంతో ముగించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన ఖాతాలో మాత్రం ఒక్క టైటిల్‌నూ జమచేసుకోలేకపోయింది. సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి సెమీఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైంది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో సైనా 21-11, 17-21, 21-13తో యోన్ జూ బే (దక్షిణ కొరియా)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో జురుయ్ లీ (చైనా) 21-11, 21-14తో మినత్సు మితాని (జపాన్)ను ఓడించింది. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక జురుయ్ లీ గ్రూప్ ‘బి’లో అజేయంగా నిలిచి అగ్రస్థానాన్ని దక్కించుకొని సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సైనా, యోన్ జూ బే, మితాని ఒక్కో విజయం, రెండు పరాజయాలతో సమఉజ్జీలుగా నిలిచారు. టోర్నీ నిబంధనల ప్రకారం మెరుగైన గేమ్స్ సగటు ఆధారంగా ఈ గ్రూప్‌లో రెండో స్థానం పొందిన యోన్ జూ బే సెమీఫైనల్‌కు చేరుకోగా... సైనా, మితాని వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి ఇంటిముఖం పట్టారు. యోన్ జూ బే 3 గేమ్‌లు నెగ్గి, 4 గేమ్‌లను చేజార్చుకోగా... సైనా 3 గేమ్‌లు నెగ్గి, 5 గేమ్‌లను కోల్పోయింది. మితాని 2 గేమ్‌లు సాధించి, 5 గేమ్‌లను చేజార్చుకుంది. దాంతో -1 గేమ్స్ సగటుతో యోన్ జూ బే ముందంజ వేయగా, -2 గేమ్స్ సగటుతో సైనాకు, -3 గేమ్స్ సగటుతో మితానికి నిరాశ ఎదురైంది. ఒకవేళ యోన్ జూ బేపై సైనా వరుస గేముల్లో గెలిచి ఉంటే సెమీఫైనల్‌కు అర్హత పొందే అవకాశం ఉండేది. సైనా 2007 తర్వాత తొలిసారి తన ఖాతాలో ఒక్క అంతర్జాతీయ టైటిల్ కూడా లేకుండా సీజన్‌ను ముగించింది. 2008 నుంచి ప్రతి ఏడాది ఏదో ఒక అంతర్జాతీయ టైటిల్‌ను సాధించిన సైనా... ఈ సంవత్సరం ఆడిన 14 టోర్నమెంట్లలో ఏ ఒక్కదాంట్లోనూ ఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయింది.