సైనా, శ్రీకాంత్‌లకు నిరాశ | Saina Nehwal Loses to Tai Tzu Ying in World Super Series Badminton Semis | Sakshi
Sakshi News home page

సైనా, శ్రీకాంత్‌లకు నిరాశ

Published Sun, Dec 21 2014 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM

సైనా, శ్రీకాంత్‌లకు నిరాశ

సైనా, శ్రీకాంత్‌లకు నిరాశ

వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ
 దుబాయ్: లీగ్ దశలో అజేయంగా నిలిచిన సైనా నెహ్వాల్ అసలు పోరులో తడబడింది. బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి సెమీఫైనల్లో నిష్ర్కమించింది.
 
 ఈ మెగా ఈవెంట్‌లో తొలిసారి బరిలోకి దిగిన హైదరాబాద్‌కే చెందిన కిడాంబి శ్రీకాంత్ కూడా సెమీఫైనల్లోనే వెనుదిరిగాడు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సైనా నెహ్వాల్ 21-11, 13-21, 9-21తో తాయ్ జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకాంత్ 18-21, 13-21తో ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో పరాజయాన్ని చవిచూశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement