
ఢాకా: పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత జట్టు హవా కొనసాగుతోంది. ఇవాళ జపాన్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్.. 6-0 గోల్స్‌తో చెలరేగిపోయింది. తద్వారా గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన ఏకైక జట్టుగా నిలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. హర్మన్‌ప్రీత్ సింగ్ మరోమారు అదరగొట్టాడు. 10, 53వ నిమిషాల్లో గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
దిల్‌ప్రీత్ సింగ్ 23వ నిమిషంలో, జరామన్‌ప్రీత్ సింగ్ 34వ నిమిషంలో, సుమిత్ 46వ నిమిషంలో, షంషేర్ సింగ్ 54వ నిమిషంలో గోల్స్ సాధించి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించారు. రౌండ్ రాబిన్ స్టేజ్‌లో భారత్(10 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో కొరియా (6), జపాన్ (5), పాకిస్థాన్ (2) ఉండగా.. ఆతిథ్య బంగ్లాదేశ్ ఖాతా కూడా తెరవలేకపోయింది.
చదవండి: BWF World Championships 2021 Finals: పోరాడి ఓడిన శ్రీకాంత్..