‘ఫైనల్ బెర్త్’ సాధించేనా? | Preview: India face Australia with eye on Hockey Champions Trophy final | Sakshi
Sakshi News home page

‘ఫైనల్ బెర్త్’ సాధించేనా?

Published Wed, Jun 15 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

‘ఫైనల్ బెర్త్’ సాధించేనా?

‘ఫైనల్ బెర్త్’ సాధించేనా?

* నేడు ఆస్ట్రేలియాతో భారత్ పోరు  
* చాంపియన్స్ ట్రోఫీ హాకీ

లండన్: మూడున్నర దశాబ్దాలుగా ఊరిస్తోన్న చాంపియన్స్ ట్రోఫీ ‘ఫైనల్ బెర్త్’ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు భారత హాకీ జట్టు నేడు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించాలనే పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌ను డ్రా గా ముగించినా భారత్‌కు ఫైనల్లో తలపడే అవకాశాలు సజీవంగానే ఉంటాయి. ఒకవేళ  భారత్ ఓడి తర్వాత జరిగే మ్యాచ్‌లో బ్రిటన్... బెల్జియంపై నెగ్గితే భారత్ మూడో స్థానంలో నిలుస్తుంది.

ఈ సందర్భంలో భారత్ కాంస్య పతకం కోసం పోరాడాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో 10 పాయింట్లతో ఆసీస్ మొదటి స్థానంలో ఉండగా, 7 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. బ్రిటన్ (5పాయింట్లు), బెల్జియం (4 పాయింట్లు) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement