![Hatrick defeat for Indian hockey team - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/11/singh.jpg.webp?itok=0TBPASxZ)
ఆ్రస్టేలియా పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. పెర్త్‌లో బుధవారం జరిగిన మూడో మ్యాచ్‌లో టీమిండియా 1–2 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున జుగ్‌రాజ్ సింగ్ (41వ ని.లో) ఏకైక గోల్ చేయగా... ఆస్ట్రేలియా జట్టుకు జెరెమి హేవార్డ్ (44వ, 49వ ని.లో) రెండు గోల్స్ అందించి గెలిపించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 3–0తో ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్ రేపు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment