
కామన్‌వెల్త్ గేమ్స్-2022లో భారత పురుషుల హాకీ జట్టు రజత పతకం సాధించింది. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో చేతిలో 0-7 తేడాతో భారత్ ఓటమిపాలైంది. తద్వారా భారత్ సిల్వర్ మెడల్ సాధించింది. తొలి క్వార్టర్ నుంచే భారత్‌పై ఆస్ట్రేలియా అధిపత్యం చెలాయించింది. ఏ దశలోను ఆస్ట్రేలియాకు భారత్ పోటీ ఇవ్వలేకపోయింది. నాలుగు క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియా 7 గోల్స్ సాధించగా.. భారత్ కనీసం ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది.
ఆస్ట్రేలియా తరపున టామ్ విక్హామ్, బ్లేక్ గోవర్స్, ఫిన్ ఒగిల్వీ, నాథన్ ఎఫ్రామ్స్, నాథన్ ఎఫ్రామ్స్ గోల్స్ సాధించారు. దీంతో ఆస్ట్రేలియా బంగారు పతకం తమ ఖాతాలో వేసుకుంది. కాగా కామన్‌వెల్త్ గేమ్స్ హాకీలో ఇది ఆస్ట్రేలియాకు ఏడో పతకం కావడం గమనార్హం. ఇక కామన్‌వెల్త్ గేమ్స్-2022లో భారత మ్యాచ్‌లు ముగిశాయి. కామన్‌వెల్త్ గేమ్స్-2022 పతకాల పట్టికలో 61 మెడల్స్‌తో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. వాటిలో 22 గోల్డ్ మెడల్స్,16 రజత, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.
చదవండి: CWG 2022:: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. ఫైనల్లో అదరగొట్టిన రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి
Comments
Please login to add a commentAdd a comment