Champions Trophy Hockey
-
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా..
రాజ్‌గిర్ (బిహార్): లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచిన భారత మహిళల హాకీ జట్టు కీలక సమరానికి సమాయత్తమైంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో నేడు మాజీ చాంపియన్ జపాన్‌తో డిఫెండింగ్ చాంపియన్ భారత్ సెమీఫైనల్లో తలపడనుంది. ఇప్పటి వరకు సాధించిన ఫలితాలతో సంబంధం లేకుండా ఈ నాకౌట్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. మరో సెమీఫైనల్లో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనాతో మలేసియా పోటీపడుతుంది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో భారత జట్టు ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. లీగ్ దశలో భారత్ మొత్తం 26 గోల్స్ సాధించి ప్రత్యర్థి జట్లకు కేవలం 2 గోల్స్ మాత్రమే సమర్పించుకుంది. ‘డ్రాగ్ ఫ్లికర్’ దీపిక ఏకంగా 10 గోల్స్‌తో అదరగొట్టింది. సంగీత కుమారి నాలుగు గోల్స్... ప్రీతి దూబే మూడు గోల్స్ చేశారు. లాల్రెమ్సియామి, మనీషా చౌహాన్, నవ్‌నీత్ కౌర్ రెండు గోల్స్ చొప్పున సాధించారు. ఉదిత, కెప్టెన్ సలీమా టెటె, బ్యూటీ డుంగ్‌డుంగ్ ఒక్కో గోల్ చేశారు. మరోవైపు జపాన్ జట్టు ఓవరాల్‌గా 6 గోల్స్ మాత్రమే చేసింది. ఈ నేపథ్యంలో భారత్ తమ సహజశైలిలో ఆడితే వరుసగా ఆరో విజయంతో ఐదోసారి ఈ టోరీ్నలో టైటిల్ పోరుకు చేరుకుంటుంది. ఇప్పటి వరకు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఏడుసార్లు జరగ్గా.. భారత జట్టు రెండుసార్లు చాంపియన్‌గా (2016, 2023) నిలిచి, మరో రెండుసార్లు (2013, 2018) రన్నరప్‌తో సరిపెట్టుకుంది. జపాన్ జట్టు మూడుసార్లు (2010, 2013, 2023) ఫైనల్‌కు చేరుకొని ఒకసారి (2010లో) విజేతగా నిలిచి, రెండుసార్లు తుది పోరులో ఓడిపోయింది. ‘మా జట్టు బలాలు ఏంటో, బలహీనతలు ఏంటో సభ్యులందరికీ తెలుసు. మా బలాన్ని మరింత పెంచుకొని, భవిష్యత్ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ టోర్నీని వినియోగించు కుంటున్నాం. ఇప్పటి వరకైతే భారత జట్టు అద్భుతంగా ఆడింది. అయితే నాకౌట్ మ్యాచ్ అయినా సెమీఫైనల్లో జపాన్ను తక్కువ అంచనా వేయకూడదు’ అని భారత జట్టు హెడ్ కోచ్ హరేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. -
అమ్మాయిలు అజేయంగా
రాజ్‌గిర్ (బీహార్): మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ లీగ్‌లో ఎదురు లేని ప్రదర్శనతో దూసుకెళ్తోంది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3–0తో జపాన్ పై ఘన విజయం సాధించింది. భారత్ తరఫున నవనీత్ కౌర్ (37వ నిమిషం), దీపిక కుమారి (47వ ని., 48వ ని.) గోల్స్ నమోదు చేశారు. ఆడిన మూడూ గెలిచిన భారత్ 15 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలువగా... పారిస్ ఒలింపిక్స్ రన్నరప్, రజత పతక విజేత చైనా (12) రెండో స్థానంలో నిలిచింది. జపాన్‌తో జరిగిన పోరులో తొలి క్వార్టర్ నుంచే భారత స్ట్రయికర్లు తమ దాడులకు పదునుపెట్టడంతో మూడు పెనాల్టీ కార్నర్ అవకాశాలు లభించాయి. 8వ నిమిషంలో దీపిక తొలి ప్రయత్నాన్ని ప్రత్యర్థి గోల్‌కీపర్ యూ కుడో చాకచక్యంగా ఆడ్డుకుంది. మిడ్‌ఫీల్డర్లు కెపె్టన్ సలీమా టేటే, నేహా, షరి్మలా దేవిలు రెండో క్వార్టర్లో చక్కని సమన్వయంతో ఫార్వర్డ్ లైన్‌కు గోల్స్ అవకాశాలు సృష్టించారు. కానీ జపాన్ రక్షణ పంక్తి అడ్డుకోగలిగింది. దీంతో దీపిక రెండో ప్రయత్నం కూడా విఫలమైంది. ఎట్టకేలకు మూడో క్వార్టర్లో భారత్ ఖాతా తెరిచింది. వైస్‌కెపె్టన్ నవ్‌నీత్ కౌర్ రివర్స్ షాట్ కొట్టి ఫీల్డ్ గోల్ చేయడంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆఖరి క్వార్టర్ మొదలవగానే దీపిక చెలరేగింది. ప్రత్యర్థి రక్షణ శ్రేణిని ఛేదించుకొని గోల్‌పోస్ట్ లక్ష్యంగా దాడులు చేసింది. ఈ క్రమంలో వరుస పెనాల్టీ కార్నర్లను దీపిక గోల్స్‌గా మలిచి భారత్‌ను గెలిచే స్థితిలో నిలిపింది. చివరి వరకు ఇదే ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్ ప్రత్యరి్థకి మాత్రం ఒక్క గోల్ కొట్టకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసింది. చాంపియన్స్ ట్రోఫీలో దీపిక దూకుడుకు ప్రత్యర్థి డిఫెండర్లు చేతులెత్తేస్తున్నారు. ఈ టోర్నీలోనే ఆమెది అసాధారణ ప్రదర్శన. నాకౌట్‌కు ముందే ఆమె పది గోల్స్ సాధించింది. ఇందులో 4 ఫీల్డ్ గోల్స్ కాగా, ఐదు పెనాల్టీ కార్నర్ గోల్స్ ఉన్నాయి. మరొకటి పెనాల్టీ స్ట్రోక్‌తో చేసింది. ఆదివారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో మలేసియా 2–0తో థాయ్‌లాండ్‌పై, చైనా 1–0తో దక్షిణ కొరియాపై గెలుపొందాయి. భారత్ సెమీస్ ప్రత్యర్థి కూడా జపానే! మంగళవారం జరిగే సెమీఫైనల్లో భారత అమ్మాయిల జట్టు... నాలుగో స్థానంలో ఉన్న జపాన్‌తో తలపడుతుంది. -
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా...
హులున్‌బుయిర్ (చైనా): ఆసియా పురుషుల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు లీగ్ దశలో అజేయంగా నిలిచింది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నాకౌట్ దశలోనూ తమ జోరు కొనసాగించాలనే లక్ష్యంతో నేడు జరిగే సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో టీమిండియా తలపడనుంది. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు లీగ్ దశలో 21 గోల్స్ సాధించి కేవలం నాలుగు గోల్స్ సమర్పించుకుంది. ఆతిథ్య చైనా జట్టుపై 3–0తో గెలిచి ఈ టోర్నీలో శుభారంభం చేసిన భారత జట్టు ఆ తర్వాత జపాన్‌పై 5–1తో, మలేసియాపై 8–1తో గెలిచింది. అనంతరం దక్షిణ కొరియాపై 3–1తో, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 2–1తో విజయం సాధించిన భారత జట్టు ఈ టోర్నీలో అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకుంది. ఫార్వర్డ్ శ్రేణిలో, మిడ్ ఫీల్డ్‌లో, డిఫెన్స్‌లో భారత ఆటగాళ్లు సమష్టిగా రాణించారు. పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన స్ట్రయికర్లు ఈ టోర్నీలో మాత్రం మెరిశారు. సుఖ్జీత్ సింగ్, అభిషేక్, ఉత్తమ్ సింగ్, గుర్జోత్ సింగ్, అరిజిత్ సింగ్ అంచనాలకు మించి రాణించారు. యువ మిడ్ ఫీల్డర్ రాజ్‌కుమార్ పాల్ మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో ‘హ్యాట్రిక్’ సాధించాడు. మాజీ కెపె్టన్ మన్‌ప్రీత్ సింగ్, వైస్ కెపె్టన్ వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ మిడ్ ఫీల్డ్‌లో చురుకుగా కదులుతూ ఫార్వర్డ్ శ్రేణి ఆటగాళ్లకు పాస్‌లు అందించారు. దిగ్గజ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ రిటైర్మెంట్ తర్వాత పాల్గొంటున్న తొలి టోర్నీలో గోల్ కీపర్లు కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్ అడ్డుగోడలా నిలబడ్డారు. కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ డ్రాగ్ ఫ్లిక్ షాట్లతో ఆకట్టుకొని ఐదు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచాడు. అయితే లీగ్ దశలో కొరియాను అలవోకగా ఓడించిన భారత జట్టు నాకౌట్ మ్యాచ్‌లో కొరియాను తేలిగ్గా తీసుకోకుండా పక్కా వ్యూహంతో ఆడాల్సిన అవసరం ఉంది. కొరియా జట్టుకు ఎక్కువ పెనాల్టీ కార్నర్లు రాకుండా జాగ్రత్త పడాలి. కొరియా డ్రాగ్ ఫ్లికర్ జిహున్ యాంగ్ ఈ టోర్నీలో ఏడు గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. యాంగ్‌ను నిలువరిస్తే కొరియా జోరుకు అడ్డుకట్ట వేసినట్టే. ‘పారిస్ ఒలింపిక్స్ తర్వాత తక్కువ సమయం విశ్రాంతి తీసుకొని చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు వచ్చాం. భారత జట్టు ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. కొరియా క్లిష్టమైన ప్రత్యర్థి. డిఫెన్స్‌తోపాటు అటాకింగ్‌లో కొరియాకు మంచి పేరుంది’ అని హర్మన్ వ్యాఖ్యానించాడు. మరో సెమీఫైనల్లో చైనాతో పాకిస్తాన్ ఆడుతుంది.38 భారత్, దక్షిణ కొరియా జట్లు ఇప్పటి వరకు ముఖాముఖిగా 61 సార్లు తలపడ్డాయి. 38 సార్లు భారత్ గెలుపొందగా... 11 సార్లు కొరియాను విజయం వరించింది. 12 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. 7 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు జరిగింది. భారత జట్టు ఏడు సార్లు సెమీఫైనల్ దశకు చేరుకుంది. 2013లో మాత్రం భారత జట్టు లీగ్ దశలోనే ని్రష్కమించింది. -
హర్మన్‌ప్రీత్ అదరహో
హులున్‌బుయిర్ (చైనా): పలువురు కీలక ఆటగాళ్లు లేకుండానే ఆసియా పురుషుల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో బరిలోకి దిగిన భారత జట్టు లీగ్ దశను అజేయంగా ముగించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. భారత కెప్టెన్, డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ (13వ, 19వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించి జట్టును గెలిపించాడు. పాకిస్తాన్ తరఫున అహ్మద్ నదీమ్ (8వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. శనివారమే జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో చైనా 2–0తో జపాన్ జట్టును ఓడించగా... మలేసియా, దక్షిణ కొరియా జట్ల మధ్య మ్యాచ్ 3–3తో ‘డ్రా’గా ముగిసింది. వరుసగా ఐదో విజయం నమోదు చేసిన భారత జట్టు 15 పాయింట్లతో లీగ్ దశలో టాపర్‌గా నిలిచింది. 8 పాయింట్లతో పాకిస్తాన్ రెండో స్థానంలో, 6 పాయింట్లతో చైనా, దక్షిణ కొరియా వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఆదివారం విశ్రాంతి దినం. సోమవారం జరిగే సెమీఫైనల్స్‌లో దక్షిణ కొరియాతో భారత్; చైనాతో పాకిస్తాన్ తలపడతాయి. 5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచిన మలేసియా, ఒక పాయింట్‌తో ఆరో స్థానంలో నిలిచిన జపాన్ 5–6 స్థానాల కోసం పోటీపడతాయి. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు జరగ్గా... భారత జట్టు ఏడుసార్లు కనీసం సెమీఫైనల్‌కు చేరుకుంది. 2013లో మాత్రమే భారత జట్టు సెమీఫైనల్ చేరుకోలేకపోయింది. ఆరంభంలో గోల్ ఇచ్చినా... పాక్‌తో మ్యాచ్‌కు ముందు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత జట్టుకు చిరకాల ప్రత్యర్థి నుంచి గట్టిపోటీనే ఎదురైంది. ఆట ఎనిమిదో నిమిషంలో భారత డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ మిడ్‌ఫీల్డ్ నుంచి దూసుకొచ్చిన హన్నాన్ షాహిద్ అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో అహ్మద్ నదీమ్ లక్ష్యానికి చేర్చాడు. ఆరంభంలోనే గోల్ సమర్పించుకున్నా భారత జట్టు ఆందోళనకు గురి కాలేదు. వెంటనే తేరుకొని తమ దాడుల్లో పదును పెంచింది. 13వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను... 19వ నిమిషంలో లభించిన మరో పెనాల్టీ కార్నర్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్స్‌గా మలిచాడు. దాంతో రెండు క్వార్టర్లు ముగిసేసరికి భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్లో పాకిస్తాన్ దూకుడుగా ఆడుతూ ఏకంగా 10 పెనాల్టీ కార్నర్లు సంపాదించింది. అయితే ఈ 10 పెనాల్టీ కార్నర్లను భారత గోల్‌కీపర్, డిఫెండర్లు అడ్డుకోవడం విశేషం. చివరి క్వార్టర్లో భారత్ జోరు పెంచి పాక్‌ను కట్టడి చేసి విజయాన్ని ఖరారు చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు 10, పాకిస్తాన్‌కు 13 పెనాల్టీ కార్నర్లు వచ్చాయి. 17 గత ఎనిమిదేళ్ల కాలంలో అంతర్జాతీయ టోర్నీల్లో పాకిస్తాన్ జట్టుపై భారత్‌కిది 17వ విజయం కావడం విశేషం. చివరిసారి భారత్ 2016 దక్షిణాసియా క్రీడల ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. దక్షిణాసియా క్రీడల ఫైనల్ అనంతరం భారత్, పాకిస్తాన్ జట్లు 18 సార్లు తలపడ్డాయి. 2018 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఫలితం రాలేదు.203 అంతర్జాతీయ హాకీలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ చేసిన గోల్స్ సంఖ్య. ధ్యాన్‌చంద్, బల్బీర్ సింగ్ సీనియర్ తర్వాత భారత్ తరఫున 200 గోల్స్ మైలురాయి దాటిన మూడో ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ హాకీలో 12 మంది క్రీడాకారులు 200 అంతకంటే ఎక్కువ గోల్స్ చేశారు. -
Asian Champions Trophy Hockey: తిరుగులేని భారత్.. జపాన్‌పై ఘన విజయం
ఢాకా: పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత జట్టు హవా కొనసాగుతోంది. ఇవాళ జపాన్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్.. 6-0 గోల్స్‌తో చెలరేగిపోయింది. తద్వారా గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన ఏకైక జట్టుగా నిలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. హర్మన్‌ప్రీత్ సింగ్ మరోమారు అదరగొట్టాడు. 10, 53వ నిమిషాల్లో గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దిల్‌ప్రీత్ సింగ్ 23వ నిమిషంలో, జరామన్ప్రీత్ సింగ్ 34వ నిమిషంలో, సుమిత్ 46వ నిమిషంలో, షంషేర్ సింగ్ 54వ నిమిషంలో గోల్స్ సాధించి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించారు. రౌండ్ రాబిన్ స్టేజ్‌లో భారత్(10 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో కొరియా (6), జపాన్ (5), పాకిస్థాన్ (2) ఉండగా.. ఆతిథ్య బంగ్లాదేశ్ ఖాతా కూడా తెరవలేకపోయింది. చదవండి: BWF World Championships 2021 Finals: పోరాడి ఓడిన శ్రీకాంత్.. -
భారత్... చేజేతులా
బ్రెడా (నెదర్లాండ్స్): వరుసగా రెండోసారి చాంపియన్స్ ట్రోఫీలో భారత పురుషుల హాకీ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ పెనాల్టీ షూటౌట్లో 1–3తో పరాజయం పాలైంది. నిర్ణీత సమయం ముగిసేవరకు రెండు జట్లు 1–1తో సమంగా ఉండటంతో విజేతను షూటౌట్ ద్వారా నిర్ణయించారు. 2016 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ భారత్ షూటౌట్లోనే 1–3 స్కోరుతో ఆస్ట్రేలియా చేతిలోనే ఓడిపోవడం గమనార్హం. నిర్ణీత సమయంలో 24వ నిమిషంలో బ్లేక్ గోవర్స్ గోల్‌తో ఆసీస్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది, అనంతరం వివేక్ ప్రసాద్ (42వ నిమిషంలో) గోల్‌తో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది. -
‘ఫైనల్ బెర్త్’ సాధించేనా?
* నేడు ఆస్ట్రేలియాతో భారత్ పోరు * చాంపియన్స్ ట్రోఫీ హాకీ లండన్: మూడున్నర దశాబ్దాలుగా ఊరిస్తోన్న చాంపియన్స్ ట్రోఫీ ‘ఫైనల్ బెర్త్’ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు భారత హాకీ జట్టు నేడు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించాలనే పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌ను డ్రా గా ముగించినా భారత్‌కు ఫైనల్లో తలపడే అవకాశాలు సజీవంగానే ఉంటాయి. ఒకవేళ భారత్ ఓడి తర్వాత జరిగే మ్యాచ్‌లో బ్రిటన్... బెల్జియంపై నెగ్గితే భారత్ మూడో స్థానంలో నిలుస్తుంది. ఈ సందర్భంలో భారత్ కాంస్య పతకం కోసం పోరాడాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో 10 పాయింట్లతో ఆసీస్ మొదటి స్థానంలో ఉండగా, 7 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. బ్రిటన్ (5పాయింట్లు), బెల్జియం (4 పాయింట్లు) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.