T20 WC 2022 Ind vs Eng: Fans Expecting Rohit, Kohli, Suryakumar to Play Big Innings
Sakshi News home page

T20 WC 2022 IND VS ENG: రోహిత్‌ మెరవాలి, కోహ్లి చెలరేగాలి, సూర్య దంచికొట్టాలి..!

Published Thu, Nov 10 2022 12:53 PM | Last Updated on Thu, Nov 10 2022 1:10 PM

T20 WC 2022: Indian Fans Expecting Rohit, Kohli, Suryakumar To Play Big Innings Vs England - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు ఇవాళ (నవంబర్‌ 10) అమీతుమీ తేల్చుకోనున్నాయి. మధ్యాహ్నం 1:30 గటంలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో భారత్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపొంది, ఫైనల్లో పాక్‌ను కూడా మట్టికరిపించి, టైటిల్‌ సొంతం చేసుకోవాలని వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

కీలకమైన ఈ మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్లు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా తమ సహజమైన ఆట ఆడి ఇంగ్లండ్‌ ఆట కట్టించాలని ఆకాంక్షిస్తున్నారు. ధైర్యంగా ఆడండి మీవెనక 130 కోట్ల మంది భారతీయులున్నారంటూ భరోసానిస్తున్నారు. చాలా మంది అభిమానులు తమ ఆరాధ్య క్రికెటర్లు చెలరేగాలని దేవుళ్లకు పూజలు, పునస్కారాలు చేస్తున్నారు. బ్యాటింగ్‌ విభాగంలో టీమిండియా కాస్తా మెరుగ్గానే ఉందని, బౌలర్లు ఈ మ్యాచ్‌లో సత్తా చాటేలా వారికి శక్తిని ప్రసాదించాలని దేవుళ్లను ప్రార్ధిస్తున్నారు.  

అలాగే, రోహిత్‌, కోహ్లి, సూర్యకుమార్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవాలని కోరుకుంటున్నారు. గతకొంతకాలంగా ఫామ్‌లో లేని హిట్‌మ్యాన్‌ ఈ మ్యాచ్‌లో మెరవాలని, కోహ్లి ఎప్పటిలాగే చెలరేగాలని, సూర్యకుమార్‌ యాదవ్‌.. ఇంగ్లండ్‌ బౌలర్లను దండికొట్టాలని ప్రార్ధనలు చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో దినేశ్‌ కార్తీక్‌, పంత్‌లలో ఎవరు ఆడినా ఫామ్‌లోకి రావాలని, ముఖ్యంగా స్పిన్నర్లు తమ పాత్రలను న్యాయం చేయాలని ఆశిస్తున్నారు. భారతీయ అభిమానుల ఆకాంక్షలు, కోరికలు, ప్రార్ధనలతో సోషల్‌మీడియా హోరెత్తుతుంది. ఇదిలా ఉంటే, నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో పాక్‌.. న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నవంబర్‌ 13న పాక్‌తో టైటిల్‌ పోరులో తలడపనుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement