రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ మధ్యప్రదేశ్‌కు షాకిచ్చి బెంగాల్ తుది పోరుకు అర్హత సాధించగా.. రెండో సెమీస్‌లో కర్ణాటకను ఖంగుతినిపించి సౌరాష్ట్ర ఫైనల్‌కు చేరింది. మధ్యప్రదేశ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో బెంగాల్ 306 పరుగుల తేడాతో భారీ విజయం సాధించగా.. కర్ణాటకతో జరిగిన ఉత్కంఠ పోరులో సౌరాష్ట్ర 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ ద్విశతకం (249), రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (55) సాధించినప్పటికీ మయాంక్ అగర్వాల్ కర్ణాటకను గెలిపించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (202), రెండో ఇన్నింగ్స్‌లో అత్యంత కీలక పరుగులు (47 నాటౌట్) చేసిన అర్పిత్ వసవద సౌరాష్ట్రను గెలిపించాడు. 117 పరుగుల లక్ష్య ఛేదనలో 42 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సౌరాష్ట్రను వసవద.. చేతన్ సకారియా (24) సహకారంతో విజయతీరాలకు చేర్చాడు. సౌరాష్ట్ర 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
కర్ణాటక-సౌరాష్ట్ర మ్యాచ్ స్కోర్ వివరాలు..
కర్ణాటక తొలి ఇన్నింగ్స్: 407 ఆలౌట్ (మయాంక్ 249, శ్రీనివాస్ శరత్ 66, చేతన్ సకారియా 3/73)
సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్: 527 ఆలౌట్ (అర్పిత్ వసవద 202, షెల్డన్ జాక్సన్ 160, విధ్వత్ కావేరప్పా 5/83)
కర్ణాటక సెకెండ్ ఇన్నింగ్స్: 234 ఆలౌట్ (నికిన్ జోస్ 109, మయాంక్ 55, చేతన్ సకారియా 4/45)
సౌరాష్ట్ర సెకెండ్ ఇన్నింగ్స్: 117/6 (వసవద 47 నాటౌట్, కృష్ణప్ప గౌతమ్ 3/38, వాసుకి కౌశిక్ 3/32)
Comments
Please login to add a commentAdd a comment