![India Defeat Bangladesh By 50 Runs In ICC T20 World Cup 2024 Super 8 Clash](/styles/webp/s3/article_images/2024/06/22/hardhik-2.gif.webp?itok=4AbB9Gnv)
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో భారత్ తమ సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖారారు చేసుకుంది. ఇక 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేయగల్గింది.
బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హార్దిక్ పాండ్యా ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. విరాట్ కోహ్లి(37), పంత్(36), శివమ్ దూబే(34) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టాంజిమ్ హసన్, రిషద్ హోస్సేన్ తలా రెండు వికెట్లు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment