భారత బౌలర్ల విజృంభణ.. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌కు మరో ఘోర పరాభవం | WC 2023, ENG Vs IND : India vs England,29th Match Updates And Highlights | Sakshi
Sakshi News home page

WC 2023 ENG Vs IND: భారత బౌలర్ల విజృంభణ.. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌కు షాక్‌

Published Sun, Oct 29 2023 1:19 PM | Last Updated on Sun, Oct 29 2023 9:38 PM

WC 2023, ENG Vs IND : India vs England,29th Match Updates And Highlights - Sakshi

WC 2023- Ind vs Eng Updates:

భారత బౌలర్ల విజృంభణ.. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌కు షాక్‌
కఠినమైన పిచ్‌పై 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో టీమిండియా బౌలర్లు సఫలమయ్యారు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్‌ 129 పరుగులకే ఆలౌటై 100 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. భారత బౌలర్లలో ముఖ్యంగా పేసర్లు బుమ్రా (6.5-1-32-3), షమీ (7-2-22-4) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరికి కుల్దీప్‌ యాదవ్‌ (8-0-24-2), రవీంద్ర జడేజా (7-1-16-1) కూడా తోడవ్వడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది. భారత బౌలర్లలో సిరాజ్‌ మినహా అందరికీ వికెట్లు దక్కాయి. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో లివింగ్‌స్టోన్‌ (27) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
122 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో ఆదిల్‌ రషీద్‌ (13) క్లీన్‌ బౌల్డయ్యాడు.

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
98 పరుగుల వద్దనే ఇంగ్లండ్‌ మరో వికెట్‌ (ఎనిమిది) కూడా కోల్పోయింది. కుల్దీప్‌ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌ (27) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

ఏడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
98 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో క్రిస్‌ వోక్స్ (10) స్టంపౌటయ్యాడు. ‌

ఆరో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
81 పరుగుల వద్ద (23.1 ఓవర్లు) ఇంగ్లండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి మొయిన్‌ అలీ (15) ఔటయ్యాడు.

ఐదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. బట్లర్‌ క్లీన్‌బౌల్డ్‌
52 పరుగల వద్ద ఇంగ్లండ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్‌ బౌలింగ్‌లో బట్లర్‌ (10) క్లీన్‌ బౌల్డయ్యాడు.

15 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ ఎంతంటే..?
39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ అతికష్టం మీద 50 పరుగుల మార్కును దాటింది. 15 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 52/4గా ఉంది. బట్లర్‌ (10), మొయిన్‌ అలీ (6) క్రీజ్‌లో ఉన్నారు. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. బెయిర్‌స్టో బౌల్డ్‌
39 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో బెయిర్‌స్టో (14) క్లీన్‌ బౌల్డయ్యాడు. మొయిన్‌ అలీ.. బట్లర్‌తో (4) జత కలిశాడు.

ఇంగ్లండ్‌ మూడో వికెట్‌ డౌన్‌..
బెన్‌ స్టోక్స్‌ రూపంలో ఇంగ్లండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో స్టోక్స్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. క్రీజులోకి జోస్‌ బట్లర్‌ వచ్చాడు.  8 ఓవర్లకు భారత స్కోర్‌: 33/3

రెండో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌..

ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో రూట్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. 5 ఓవర్లకు ఇం‍గ్లండ్‌ స్కోర్‌: 30/2

తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌..
230 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 30 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. 16 పరుగులు చేసిన డేవిడ్‌ మలాన్‌.. జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

2 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 17/0
230 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 2 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్‌ మలాన్‌(10), బెయిర్‌ స్టో(4) పరుగులతో ఉన్నారు.

ఇంగ్లండ్‌ టార్గెట్‌ 230 పరుగులు..
వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.

భారత బ్యాటర్లలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(101 బంతుల్లో 87), సూర్యకుమార్‌ యాదవ్‌(47 బంతుల్లో 49 పరుగులు) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో డేవిడ్‌ విల్లీ 3 వికెట్లు పడగొట్టగా.. క్రిస్‌ వోక్స్‌, అదిల్‌ రషీద్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా..

208 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. 49 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌.. డేవిడ్‌ విల్లీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

►46 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 208/7, క్రీజులో సూర్యకుమార్‌ యాదవ్‌(49), జస్ప్రీత్‌ బుమ్రా ఉన్నారు.

వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌..
టీమిండియా వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. రషీద్‌ బౌలింగ్‌లో జడేజా ఔట్‌ కాగా..  వుడ్‌ బౌలింగ్‌లో షమీ పెవిలియన్‌కు చేరాడు. 42 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 183/7
ఐదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా..
165 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. 87 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ.. రషీద్‌ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి రవీంద్ర జడేజా వచ్చాడు. 37 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 165/5

35 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 155/4
35 ఓవర్లకు టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌ శర్మ(85), సూర్యకుమార్‌ యాదవ్‌(18) పరుగులతో  ఉన్నారు.

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌.. నాలుగో వికెట్‌ ​కోల్పోయిన భారత్‌
131 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 39 పరుగులు చేసిన రాహుల్‌.. విల్లీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. దీంతో 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులో రోహిత్‌ శర్మ(79), సూర్యకుమార్‌ యాదవ్‌ ఉన్నారు.

రోహిత్‌ శర్మ హాఫ్‌ సెంచరీ..
40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ అదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ తన హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 66 బంతుల్లో రోహిత్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 24 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 89/3. క్రీజులో రోహిత్‌(57), రాహుల్‌(19) పరుగులతో ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
శ్రేయస్‌ అయ్యర్‌(4) రూపంలో టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. 11.5వ ఓవర్లో క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో మార్క్‌వుడ్‌కు క్యాచ్‌ ఇచ్చి అయ్యర్‌ పెవిలియన్‌ చేరాడు. 12 ఓవర్లలో భారత్‌ స్కోరు: 40-3

10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌ శర్మ(24), శ్రేయస్‌ అయ్యర్‌(2) పరుగులతో ఉన్నారు.

రెండో వికెట్‌ డౌన్‌..
తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే మరో బిగ్ షాక్‌ తగిలింది. 27 పరుగుల వద్ద  విరాట్‌ కోహ్లి రూపంలో భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. కోహ్లి ఖాతా తెరవకుండానే డేవిడ్‌ విల్లీ బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి శ్రేయస్‌ అయ్యర్‌ వచ్చాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా..
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 26 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. 9 పరుగులు చేసిన శుబ్‌మన్‌ గిల్‌.. క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. క్రీజులోకి కింగ్‌ కోహ్లి వచ్చాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్‌ గిల్‌(4), రోహిత్‌ శర్మ(0) ఉన్నారు. 

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా లక్నో వేదికగా టీమిండియా, ఇంగ్లండ్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు  జట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి.

తుది జట్లు
భారత్‌: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా,  కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్‌ సిరాజ్‌

ఇంగ్లండ్‌: డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, లివింగ్‌స్టోన్‌, మొయిన్ అలీ,  క్రిస్‌ వోక్స్‌, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement