వన్డే ప్రపంచకప్-2023 మహా సంగ్రామానికి సమయం అసన్నమైంది. ఆక్టోబర్ 5 అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్- ఇంగ్లండ్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే భారత గడ్డపై అడుగు పెట్టిన ఆయా జట్లు వామాప్ మ్యాచ్‌ల్లో బీజీబీజీగా ఉన్నాయి. ఇక బారత జట్టు తమ వామాప్ మ్యాచ్‌లో సెప్టెంబర్ 30న గౌహుతి వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌తో తలపడనుంది.
అదే విధంగా ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌తో టీమిండియా తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. వన్డే ప్రపంచకప్ టైటిల్ ఫేవరేట్‌ను భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఎంచుకున్నాడు.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న ఇంగ్లండ్ మరోసారి టైటిల్‌ను సొంతం చేసుకుందని గవాస్కర్ జోస్యం చెప్పాడు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గవాస్కర్ ప్రపంచ కప్ గెలవడానికి ఇంగ్లండ్‌కు అన్నిరకాల అర్హతలున్నాయని సన్నీ చెప్పాడు. కాగా 2019 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
"నావరకు అయితే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ తమ వద్దే ట్రోఫీని ఉంచుకుంటుంది. ఇంగ్లండ్ బ్యాటింగ్ విభాగంలో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అదే విధంగా బ్యాట్, బంతితో మ్యాచ్ స్వరూపాన్నే మార్చగల ముగ్గురు వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్‌లు ఉన్నారు. అంతేకాకుండా మార్క్ వుడ్, అదిల్ రషీద్ వంటి సీనియర్ బౌలర్లు కూడా ఉన్నారు. కాబట్టి మళ్లీ ఇంగ్లండ్ జట్టే టైటిల్ ఫేవరేట్" అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
చదవండి: World Cup 2023: బ్యాడ్ లక్‌కు బ్రాండ్ అంబాసిడర్ దక్షిణాఫ్రికా.. ప్రొటీస్‌కు కలిసిరాని వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఇవే!
Comments
Please login to add a commentAdd a comment